గత సంవత్సరం రిలీజ్ అయిన మోటోరోలా నెక్సాస్ 6 చాలా పెద్దది. టోటల్ స్క్రీన్ సైజ్ 6 in అది. సో ఇప్పుడు నెక్సాస్ 6P అనే పేరుతో గూగల్ Huawei బ్రాండింగ్ లో కొన్ని మార్పులతో లేటెస్ట్ నెక్సాస్ ఫ్లాగ్ షిప్ మోడల్ లాంచ్ చేసింది.
నెక్సాస్ 6P 32gb మరియు 64gb వేరియంట్స్ లో వస్తుంది. 32gb ప్రైస్ – 39,999 రూ. 64 gb ప్రైస్ – 42,999 రూ. దీనితో పాటు గూగల్ 5x పేరుతో మరో మోడల్ కూడా లాంచ్ చేసింది.
6P లో 5.7 in అమోలేడ్ 2560 x 1440 రిసల్యుషణ్ డిస్ప్లే ఉంది. ఇది కొంచెం పెద్దది అయినా ఫర్వాలేదు వాడటానికి comfortable గానే ఉంటుంది. 7.3mm thin బాడీ తో వస్తుంది.
డిజైన్ వైస్ గా బాగుంది. phablet గా వాడుకోగలరు. దీనిలో స్నాప్ డ్రాగన్ 810 క్వాడ్ కోర్ 1.55GHz కార్టెక్స్ A53 మరియు క్వాడ్ కోర్ 2.0GHz కార్టెక్స్ A57 ప్రొసెసర్, 3gb ర్యామ్, అడ్రెనో 430GPU, 12MP 1.55µm పిక్సెల్ సైజ్ కెమేరా ఉంది. చాలా ఫాస్ట్ గా ఉంది కెమేరా.
3450 mah బ్యాటరీ కూడా సరైన పవర్ ఇస్తుంది. దీనిలో usb టైప్ c పోర్ట్ మరియు ఫస్ట్ చార్జింగ్ కూడా ఉంది. 6P లో మీరు ఎక్కువుగా ఇష్టపడే విషయం ఫోన్ స్లిమ్ గా ఉండటం. అయితే దీని పై కంప్లీట్ రివ్యూ నెక్స్ట్ వీక్ వస్తుంది.
నెక్సాస్ 6P అండ్ oneplus one: డిస్ప్లే కంపేరిజన్
నెక్సాస్ 6P అండ్ oneplus one: బ్యాక్
నెక్సాస్ 6P వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్