ఆండ్రాయిడ్ ఫోనుల బ్యాటరీ ను ఆదా చేయటానికి కొత్త సాఫ్ట్ వేర్, HUSH
బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ను నిషేదించి, బ్యాటరీ లైఫ్ పెంచుతుంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో ప్రధానంగా ఉన్న బ్యాటరీ లైఫ్ సమస్య కు పరిష్కారం గా US లోని purde యూనివర్సిటీ కొత్త సాఫ్ట్వేర్ ను డెవలప్ చేసింది. దీని పేరు HUSH. ఇది ప్రస్తుతానికి pc లో ఇంస్టాల్ చేసుకునే సాఫ్ట్ వేర్ రూపంలో ఉంది.
ఫోన్ డిస్ప్లే ఆఫ్ అయి ఉన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ బ్యాటరీ ను వాడకుండా ఉంచేందుకు పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోనుల్లో 29% బ్యాటరీ drain డిస్ప్లే ఆఫ్ అయి ఉన్నప్పుడు అవుతుంది. 45.9% యాప్స్ వలన అవుతుంది బ్యాటరీ.
HUSH వాడితే, 29%(స్క్రీన్ ఆఫ్ అయి ఉన్నప్పుడు) లోని బ్యాటరీ drain సుమారు 16% వరకూ తగ్గుతుంది అని చెబుతున్నారు డెవలపర్స్. ఈ సాఫ్ట్ వేర్ టీమ్ HUSH ను 61 దేశాలలో ఉన్న 191 మొబైల్ ఆపరేటర్స్ పై పనిచేస్తున్న 2000 వేల స్మార్ట్ ఫోన్స్ లో టెస్ట్ కూడా చేసారు.
బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న యాప్స్ ను ఐడెంటిఫై చేసి, వాటిలో ఫోన్ లో ఏది ఉపయోగకరమైనదో చూసి, యూసర్స్ ఎక్కువుగా వాడని వాటిని గమనించి వాటిని నిలిపివేస్తుంది HUSH సాఫ్ట్ వేర్.
సాధారణంగా స్క్రీన్ ఆఫ్ అయి ఉన్నప్పుడు, కొన్ని యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో స్టార్ట్ అయి, చేయవలసిన పనులు చేసి, మళ్ళీ షట్ డౌన్ అవకుండా అలానే ఉపయోగం లేకుండా రన్ అవుతూ ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ లోని wakelocks సాఫ్ట్ వేర్ లోపాల వలన జరుగుతుంది.
సో, HUSH దీనిని కంట్రోల్ చేసి బ్యాటరీ ను ఇంప్రూవ్ చేయటానికి తయారు చేయబడింది అని కంప్యూటర్ అండ్ ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అండ్ HUSH రీ సర్చ్ టీమ్ మెంబర్ వెల్లడించారు. Github లో ఈ లింక్ లో దీని డెవలపర్ వెర్షన్ ఉంది. అయితే ఇది అతి త్వరలోనే యాప్ రూపంలో ఆండ్రాయిడ్ ఫోనులుకు వస్తుంది అని తెలిపారు రీసర్చ్ టీమ్.
ఆధారం: IBTimes