మోటో X స్టైల్: ఫస్ట్ ఇంప్రెషన్స్
మోటోరోలా డిస్ప్లే పెద్దది అయినా కాంపాక్ట్ గా డిజైన్ చేసింది మోడల్ ను
మోటోరోలా కు నిజంగా కాంపాక్ట్ సైజ్ లో డిజైన్ చేయటం బాగా తెలుసు. అవును మోటో x స్టైల్ కు ఇంతకముందు మోటో x మోడల్స్ కన్నా చాలా పెద్ద డిస్ప్లే సైజ్ ఉంది.. కాని రీసెంట్ మొబైల్ వాడకం మరియు స్మార్ట్ ఫోన్ డిజైనింగ్ ట్రెండ్స్ కారణంగా ఇప్పుడు లార్జర్ స్క్రీన్ ఉన్న మొబైల్స్ నెమ్మదిగా డిమాండ్ గా మారనున్నాయి.
ఫ్రంట్ రెగ్యులర్ గానే ఉంది స్మూత్ గా అంతా గ్లాస్. ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. బ్యాక్ సైడ్ x ప్లే వలే సిమిలర్ ప్యాటర్న.. rubberized, striped, మధ్యలో కెమెరా మరియు సర్కిల్ డిజైన్ లో మోటో లోగో.
2k రిసల్యుషణ్ డిస్ప్లే త్వరలో పాపులర్ కనున్నాయి. నిన్న రిలీజ్ అయిన Gionee Elife E8 లో కూడా 6 in 2K ఎమోలేడ్ డిస్ప్లే ఉంది. మోటో x స్టైల్ లో కూడా 5.7 in 2k రిసల్యుషణ్ IPS డిస్ప్లే ఉంది. దీని డిస్ప్లే చాలా బ్రైట్ మరియు స్పష్టం గా ఉంది. సన్ లైట్ లో కూడా మొబైల్ ను ఆపరేట్ చేసి టెస్ట్ చేశాము, క్లియర్ గా కనిపిస్తుంది సన్ లైటింగ్ లో కూడా. 551 పిక్సెల్స్ డెన్సిటీ ఉంది డిస్ప్లే లో.ఫ్రంట్ బాడీ దాదాపు 77% బాడీ అంతా డిస్ప్లే స్క్రీన్ ఉంది. ఇది ఈ మధ్య కాలంలో ఉన్న ఫోనులన్నింటి కన్నా ఎక్కువ, అంటే ఎక్కువ కాంపాక్ట్ గా ఉంటుంది అని అర్థం.
స్నాప్ డ్రాగన్ 808 soc, 3gb ర్యామ్ మరియు 16/32.64 gb స్టోరేజ్. పేపర్ పై చూస్తే కావలసినంత కంటెంట్ ఉంది అనిపిస్తుంది.. అలానే usage లో కూడా ఇసి మంచి ఎక్పిరియన్స్ ఇచ్చింది. టచ్ రెస్పాన్స్ బాగుంది..స్టాక్ ఆండ్రాయిడ్ os కూడా added బోనస్..వాడుతున్న ఇంత సేపు మోటో x స్టైల్ చాలా స్మూత్ పెర్ఫార్మింగ్ డివైజ్ లా కనిపిస్తుంది. అయితే కంప్లీట్ రివ్యూ చేసేవరకూ దీని పై ఇంకా స్పష్టంగా నిర్ణయం రాకూడదు.
సన్ లైట్ ఫెసింగ్ లో HDR మోడ్ ఆన్ లో తీసిన ఫోటో
21MP సోనీ IMX230 Exmor RS CMOS కెమేరా దాదాపు చాలా పర్ఫక్ట్ గా ఫోకస్ చేస్తుంది ఫోటోస్ లో. ఇమేజెస్ లో దైనామిక్ ర్యాంజ్ లేదని తప్ప ఫోటో మాత్రం బాగా వస్తుంది. టచ్ ఫోకస్ కొంచెం tricky గా అలానే servo ఫోకస్ కొంచెం స్లో గా ఉంది. ఇది మినహా కెమేరా అప్లికేషన్ చాలా ఫాస్ట్ గానే ఉంది. shutter లాగ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ issuses ఏమీ లేవు. వీడియో రికార్డింగ్ కూడా స్మూత్ గా ఉంది. ఓవర్ ఆల్ గా కెమేరా యూనిట్ మొత్తం బాగుంది.
టార్చ్ గ్లాస్ లాంప్ షెడ్
మోటో x స్టైల్ ఆడియో క్వాలిటీ డిసేంట్ గా ఉంది. హై వాల్యూమ్ లో ఆడియో లో మనకు ఇబ్బంది గా అనిపించే అంత distortion లేదు. ఓవర్ ఆల్ మోటో x స్టైల్ మంచి డిస్ప్లే, స్మూత్ పెర్ఫార్మెన్స్, మంచి డిజైన్ తో ఉంది. అక్టోబర్ 14 మిడ్ నైట్ నుండి ఫ్లిప్ కార్ట్ లో ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అవుతాయి. 16gb ప్రైస్ – 29,999 రూ. 32gb ప్రైస్ – 31,999 రూ.
పర్సనల్ గా నాకు మోటో x స్టైల్ నీట్ అండ్ కాంపాక్ట్ అండ్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ అనిపించింది. త్వరలో కంప్లీట్ రివ్యూ వస్తుంది. stay tuned to డిజిట్ తెలుగు.