Moto G4 Plus : First ఇంప్రెషన్స్
లెనోవో మోటోరోలా బ్రాండ్ లో ఎక్కువ involvement ఇస్తుంది. గూగల్ own చేసినప్పుడు moto మార్కెట్ కు తగ్గట్టుగా స్పెక్స్ ను ఇచ్చేది కాదు. కాని లెనోవో మార్కెట్ కు తగ్గ స్పెక్స్ ను మార్చింది.
ఇందుకు ఉదాహరణ 720P నుండి ఫుల్ HD 5.5 in డిస్ప్లే లకు షిఫ్ట్ అవటం. ఇంకా కెమెరా ను కూడా 16MP కు అప్ గ్రేడ్ చేసింది. మరియు laser ఆటో ఫోకస్ with PDAF కూడా ఉన్నాయి.
కంపెని కెమెరా ఐ ఫోన్ 6 ప్లస్ కన్నా బాగుంటుంది అని చెబుతుంది. ఆఫ్ కోర్స్ ఇది రివ్యూ చేసిన తరువాతే తెలుస్తుంది. అయితే కెమెరా ఫాస్ట్ గా మాత్రం లేదు. యాప్ కూడా స్లోగానే లాంచ్ అవుతుంది.
బహుసా HDR, ప్రో మోడ్, బెస్ట్ షాట్ వంటి అదనపు ఫీచర్స్ ఉండటం వలన అయ్యుంటుంది. కెమెరా కోసం omnivision సెన్సార్ ను కూడా వాడింది. మేము తీసిన ఫోటోస్ ద్వారా మోస్ట్ users కు క్వాలిటీ satisfy అవుతుంది అని చెప్పగలము.
మరొక పెద్ద addition ఫింగర్ ప్రింట్ స్కానర్. మోటోరోలా మొదటి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ ఇది. అయితే G4 లో లేదు కాని G4 ప్లస్ లో ఉంది. FP square షేప్ లో ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇది బటన్ కాదు కాని ఫింగర్ ప్రింట్ తో స్క్రీన్ ను ఆన్ చేయటం, యప్ క్లోజ్ చేయటం చేస్తుంది. FP natural గా అనిపించటం లేదు నాకు పర్సనల్ గా.
పెద్ద మరొక మైనస్ ఏంటంటే బడ్జెట్ సెగ్మెంట్ కు వాటర్ ప్రూఫ్ introduce చేసిన moto ఇప్పుడు దీనిలో వాటర్ ప్రూఫ్ ఇవలేదు. ఆఫ్ కోర్స్ నానో కోటింగ్ ఉంది. may be కాస్ట్ కటింగ్ కొరకు వాటర్ ప్రూఫ్ కాకుండా వాటర్ repellent ను ఇస్తున్నట్లు ఉంది.
దీనిలో ఉన్న స్నాప్ డ్రాగన్ 617 ప్రొసెసర్ గతంలో HTC one A9 లో బాగా పనిచేసింది. కాని నేను గడిపిన కొద్ది టైమ్ లో ఫోన్ లో ఎటువంటి స్మూత్ లేదా ఫాస్ట్ లేదు.
13,499 రూ లకు MOTO G4 plus లెనోవో ZUK Z1 కు పోటీ గా వచ్చే ప్రయత్నం చేసింది. కాని Z1 ను రివ్యూ చేశాము కాబట్టి, moto కన్నా Z1 పెర్ఫార్మన్స్ బాగుంది అని చెప్పాలి.
అంతేకాదు Z1 లో 13,499 రూ లకు 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్ ఉన్నాయి. moto అదే ప్రైస్ కు 2GB – 16GB ఇస్తుంది. SD కార్డ్ సపోర్ట్ ఉంది కాని 16GB ఇంటర్నెల్ స్టోరేజ్ ఏజ్ పోతుంది ఇప్పుడిప్పుడు. ఈ తరుణంలో ఇంకా 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ ను ఆ ప్రైస్ లో ఇవటం అనేది సమంజసం గా లేదు. ఇంటర్నెల్ స్టోరేజ్ SD కార్డ్ కన్నా ఫాస్ట్ గా ఉండటమే కాదు చాలా ఇంపార్టెంట్ విషయం కూడా.
బిల్డ్ క్వాలిటీ లో కూడా సైడ్స్ లో ఉన్న మెటల్ trim మెటాలిక్ కన్నా ప్లాస్టిక్ లా అనిపిస్తుంది. వెనుక ఉన్న పనెల్ కూడా బాగా outdated. ZUK Z1 బ్యాక్ panel దీని కన్నా బెటర్. more polished గా ఉంటుంది.
ఓవర్ ఆల్ గా స్పెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, స్నాప్ డ్రాగన్ 400, 410, 615 SoC లు కాకుండా 617 ప్రొసెసర్ ను పెట్టడం కూడా బాగుంది. కాని రెడ్మి నోట్ 3, LeEco Le1S వంటి ఫోనులతో పోలిస్తే moto ఇంకా దూరంగా ఉంది.
అలాగే డిజైన్ కూడా ఏమీ లేదు ప్రత్యేకంగా ఆకర్షించటానికి. మొదటి సారి ఫోన్ చూసిన తరువాత నచ్చలేదు ఫోన్. ఒకప్పుడు mototola డిజైన్ కు మంచి పేరు బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా. ఫైనల్ గా ఫర్స్ట్ లుక్స్ లో ఫోన్ impress చేయలేదు నన్ను. ఒరిజినల్ ఆండ్రాయిడ్ అందిస్తూ బాగా పేరు తెచ్చుకున్న ఒక్కప్పటి మోటోరోలా ఇప్పుడు కాంపిటిషన్ లో వెనుకబడుతుంది అని కూడా ఒప్పుకోవాలి. Moto G4 Plus ప్రివియస్ moto G మోడల్స్ పై అప్ గ్రేడ్ అయ్యింది కాని మిగిలిన ఫోనులకు కాంపిటిషన్ ఇచ్చే అంత అప్ గ్రేడ్ కూడా అయితేనే కదా సక్సెస్ ఉంటుంది.
ఈ లింక్ లో అమెజాన్ లో 2GB/16GB – MOTO G4 Plus 13,499 రూ లకు సెల్ అవుతుంది.
ఈ లింక్ లో అమెజాన్ లో 3GB/32GB – MOTO G4 Plus 14,999 రూ లకు సెల్ అవుతుంది. MOTO G4 Unboxing తెలుగు వీడియో క్రింద చూడండి..