ఎవరూ గమనించని విధంగా మోటోరోలా సడెన్ గా తన స్ట్రాటజీ మార్చటం జరిగింది ఈ ఇయర్. G, E అండ్ X సిరిస్ లోని ప్రతీ సిరిస్ నుండి రెండు మోడల్స్ రిలీజ్ చేసింది. మోటో E రెండు వేరియంట్స్, మోటో G 3 – G టర్బో, అండ్ మోటో X ప్లే – X స్టైల్. నిన్న లేటెస్ట్ G టర్బో వేరియంట్ లాంచ్ చేసింది. మరి మొదటి లుక్స్ లో ఎలా ఉందో చూద్దాం రండి.
దీనిలో ఏముంది కొత్తగా?
1. G3 లో స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్ ను మార్చి SD 615 ప్రొసెసర్ పెట్టింది.
2. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. 15 నిమిషాల చార్జింగ్ కు 6 గంటల బ్యాక్ అప్.
స్నాప్ డ్రాగన్ 410 కు బదులు స్నాప్ డ్రాగన్ 615 ఉంటే బాగుంటుంది అని మోటో G 3 రివ్యూ లో చెప్పటం జరిగింది. అలానే కంపెని ప్రొసెసర్ మార్చి లాంచ్ చేసింది. అయితే ఈ మార్పు ఫోన్ ను మంచి ఫోన్ గా తయారు చేస్తుందా? అది తెలుసుకోవటానికి కొంత సమయం వేచి చూడాలి. ప్రస్తుతానికి visibile గా మాత్రం అంతా ఫాస్ట్ గా ఉంది మోటో G3 కన్నా.
కెమేరా
టర్బో లో డిఫరెంట్ ఇమేజ్ సిగ్నల్ ప్రొసెసర్ ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కంప్లీట్ రివ్యూ లో ఇది కన్ఫర్మ్ అవుతుంది. ఓవర్ ఆల్ గా బెటర్ కలర్స్ ఉన్నాయి G3 కన్నా. షార్ప్ మరియు Low లైటింగ్ లో కూడా బెటర్ గా ఉంది.
Moto G Turbo: (L-R) Indoor Fluorescent Lights, Studio White Lights, Indoor Fluorescent Lights, Low Light (Click images to enlarge)
Moto G (3rd Gen): (L-R) Indoor Fluorescent Lights, Studio White Lights, Indoor Fluorescent Lights, Low Light (Click images to enlarge)
ఫైనల్ లైన్
ఒరిజినల్ మోటో G3 ప్రైస్ 12,999 రూ. టర్బో కాస్ట్ 14,499 రూ. ఫర్స్ట్ ఇంప్రెషన్స్ లో ఆల్రెడీ బెటర్ పెర్ఫార్మన్స్ అండ్ కెమెరా అండ్ ఫాస్ట్ చార్జింగ్ ఉంది. దీనికి తోడు ఆల్రెడీ బ్యాటరీ G3 లోనే బాగుంది అని ప్రూవ్ అయ్యింది. సో బ్రాండ్ వాల్యూ ఉంటుంది అని కొత్త ఫోన్ కొనటానికి మోటో G 3 తీసుకునే ప్లాన్స్ లో ఉంటే టర్బో బెటర్ చాయిస్ కొనటానికి.