రీసెంట్ గా రిలీజ్ అయిన 7,999 రూ MOTO E3 Power పై మొదటి అభిప్రాయాలు

Updated on 20-Sep-2016

ముందుగా చిన్న గమనిక: ఇది రివ్యూ కాదు. కేవలం మొదటి అభిప్రాయాలు. (First ఇంప్రెషన్స్). రివ్యూ కు మరింత time పడుతుంది. అయిపోయిన వెంటనే మీకు తెలియజేయటం జరుగుతుంది. సో రివ్యూ కోసం మీరు అడగనవసరం లేదు.

మోటోరోలా నుండి నిన్న MOTO E3 Power పేరుతో 7,999 రూ లకు కొత్త ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో. దీనిపై కంప్లీట్ స్పెక్స్, ఆఫర్స్ అండ్ etc ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చూడగలరు.

అయితే MOTO E3 మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఇకపోతే ఆల్రెడీ ఫోన్ తో కొంతసేపు గడపడం జరిగింది. సో దీని పై మొదటి ఇంప్రెషన్స్ మీకు తెలిపే ప్రయత్నమే ఈ ఆర్టికల్.

5 in డిస్ప్లే లో కలర్స్ బ్రైట్ గా ఉన్నాయి. గ్రేట్ అనిపించేలా vibrant గా లేవు కాని pleasant గా warm గా ఉంది tone. టచ్ రెస్పాన్స్ కూడా వెరీ స్మూత్.

బిల్డ్ విషయానికి వస్తే మెటల్ రిమ్ ఉంది ఫోన్ సైడ్స్ లో చుట్టూ. వెనుక textured ప్లాస్టిక్ panel ఉంది. ఇది removable. అండ్ ఫోన్ వాటర్ resistant కాదు, వాటర్ repellent మాత్రమే. అంటే ఫోన్ పై వాటర్ జల్లులు పడినా, వర్షం లో కొద్ది పాటిగా తడిచినా ఏమి కాదు కాని వాటర్ లో పడి పాడయితే మాత్రం కంపెని బాధ్యత కాదు.

చూడటానికి మాత్రం candybar form factor with రౌండ్ edges తో same moto G4 లానే ఉంటుంది వెనుక నుండి. బాలేదు అని చెప్పలేము కాని ప్రత్యేకంగా ఏమి ఉండదు. అంతే!

 ఫ్రంట్ లో లౌడ్ స్పీకర్ ఉంటుంది క్రింద. అదే మీరు ఇమేజెస్ లో చూసే క్రింద ఉన్న లైన్. ఓవర్ ఆల్ గా బిల్డ్ క్వాలిటీ డీసెంట్ గా ఉంది. durability కూడా ఫీల్ అవుతారు చేతిలో ఉన్నప్పుడు.

స్పెక్స్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ బ్యాటరీ పెద్దది అని అర్థమై ఉంటుంది. బ్యాటరీ అనేది నాకు పర్సనల్ గా ఫర్స్ట్ ప్రియారిటీస్ లో ఒకటి. ఎందుకంటే డైలీ usage లో ఇది మనకు నిత్యం depend అవ్వవలసిన విషయం.  దీనిలో 3,500 mah ఉంది. ఆఫ్ కోర్స్ ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో Xiaom రెడ్మి 3S prime ఇంకా ఎక్కువ (4000 mah) బ్యాటరీ కలిగి ఉంది. కాని చైనా బ్రాండ్స్ లేదా ఆల్రెడీ Xiaomi వాడిన వారికి మళ్ళీ రెడ్మి 3S prime తీసుకోవాలని అనిపించక పోవచ్చు.

ఇక పొతే రెడ్మి 3S prime లో ఉన్న స్నాప్ డ్రాగన్ 430 SoC… moto లోని MT6735P SoC కన్నా బెటర్ బ్యాటరీ optimisation ఇస్తుంది  అని అనుకోవచ్చు కొందరు. కాని అది రెండూ టెస్ట్ చేసిన తరువాతే మనం నిర్దారించకోవలసిన విషయం.

ఇక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే మీడియా టెక్ MT6735p ప్రొసెసర్, 2GB రామ్ తో కలిసి వస్తుంది. మొదటిగా use చేసినప్పుడు రెగ్యులర్ usage – UI నావిగేషన్ బాగానే ఉంది. అయితే కొన్ని menus కొంచెం లాగ్ అవుతున్నాయి. కెమెరా యాప్ కూడా కొంచెం slow గా అనిపిస్తుంది. కాని ఇప్పటి వరకూ వాడిన తరువాత ఇది బేసిక్ users కు మాత్రం ఈజీగా సూట్ అవుతుంది అని చెప్పవచ్చు. అంటే మెసేజింగ్, సోషల్ మీడియా, అప్పుడప్పుడు వాడె కెమెరా మరియు వీడియో అండ్ ఆడియో అవసరాలకు ఫోన్ suitable అని తెలుస్తుంది.

ఇంబిల్ట్ స్టోరేజ్ కూడా 16GB ఉంది. అదనంగా 32GB SD కార్డ్ వేసుకోగలరు. ఇది హైబ్రిడ్ స్లాట్ కాదు. అయినప్పటికీ హెవీ users కు కొంతమందికి కంప్లీట్ satisfaction ఉండకపోవచ్చు కాని రెగ్యులర్ అండ్ బేసిక్ users కు సరిపోతుంది అని నా అభిప్రాయం. కాని moto E3 పవర్ లో స్టోరేజ్ పరంగా ఎక్కవు MB కలిగిన  హెవీ గేమ్స్ ను ఇంస్టాల్ చేసుకోవటం అనేది కొంచెం ఇబ్బందే.

కెమెరా విషయానికి వస్తే ఫోన్ లో వెనుక ఉన్న 8MP కెమెరా సింగిల్ LED ఫ్లాష్ తో వస్తుంది. ఫోటోస్ లోని క్వాలిటీ పరంగా indoor లోని బల్బ్ లైటింగ్స్ లో సాఫ్ట్ అండ్ అస్పష్టంగా గా వస్తున్నాయి కొంచెం deep గా చూస్తే. కలర్స్ మాత్రం ఒరిజినల్ సోర్స్ కు తగ్గట్టుగా true గా ఉన్నాయి. బ్రైట్ లైటింగ్ లో సన్ లైట్ లో మాత్రం మంచి ఫోటోస్ ఇస్తుంది. low లైటింగ్ లోనే కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఇది ప్రతీ ఫోనులో ఉండేదే. ఇక ఫ్రంట్ లోని 5MP విషయానికి వస్తే రెగ్యులర్ క్వాలిటీ ఇస్తుంది అన్ని 5MP ఫోనుల్లానే. అలాగే Beauty filter కూడా ఉంది. కొంచెం ఫోటోస్ కూడా సాఫ్ట్ గా ఉన్నాయి. ఫైనల్ గా కెమెరా మెయిన్ ప్రియారిటీ అనుకునే వారికి ఇది కంప్లీట్ గా satisfy చేయకపోవచ్చు. ఆఫ్ కోర్స్ కంప్లీట్ రివ్యూ చేసిన తరువాతే నిర్దారణ చేయగలము.

 

సో అన్ని కలిపితే.. moto e పవర్ మంచి అప్ గ్రేడ్ అని చెప్పవచ్చు moto e 2nd Gen మోడల్ నుండి. HD డిస్ప్లే, 2GB రామ్, 3,500 mah బ్యాటరీ వంటివి పరిగణలోకి తీసుకుంటే. కంపెని కూడా నిజంగా ఇతర ఫోనులతో పోటీ పడే ప్రయత్నం చేయటం లేదని తెలుస్తుంది. బేసిక్ అండ్ స్టాండర్డ్ users ను మాత్రమే టార్గెట్ చేసింది. పవర్ users ను target చేయలేదు. ఫర్వాలేదు అనిపించే పెర్ఫార్మన్స్, large బ్యాటరీ, HD డిస్ప్లే అండ్ ఒరిజినల్ అండ్ మినిమల్ – సింపుల్ ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో క్లిన్ OS, మోటోరోలా బ్రాండ్  వంటి కారణాలతో ఇది సింపుల్ users కు కచ్చితంగా మంచి ఫోన్ అని చెప్పవచ్చు. స్టోరీ పై మీ అభిప్రాయాలను క్రింద తెలపగలరు. డిజిట్ తెలుగు ఎడిటర్  ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.
Buy Moto E3 Power at Rs. 7999 on Flipkart

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :