ఆసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ vs యు Yureka ప్లస్ vs Meizu M2 నోట్ : క్విక్ కంపేరిజన్

Updated on 14-Aug-2015
HIGHLIGHTS

యురేకా ప్లస్, ఆసుస్ జెన్ ఫోన్ 2 లేసర్, Meizu M2 నోట్ ఫోన్స్ కెమేరా, డిజైన్ బిల్డ్, పెర్ఫార్మెన్స్ indepth సింపుల్ ఎనాలిసిస్

అండర్ 10K స్మార్ట్ ఫోన్ మార్కేట్ ఇండియా లో రోజు రోజుకీ చాలా పోటీగా ఉంది. ఉండవలసిన స్పెక్స్ తో హై ఎండ్ హార్డ్వేర్ తో తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి. 

ప్రసుతం యురేకా ప్లస్, ఆసుస్ జెన్ ఫోన్ 2 లేసర్, Meizu M2 నోట్ ఫోన్స్ ఇంతకముందు ఇదే లైన్ లో ఉన్న ఫోన్స్ కన్నా ఎక్కువ స్పెక్స్ ఇస్తున్నాయి. వీటి గురించి ఇక్కడ కెమేరా క్వాలిటీ, ఫోన్ పెర్ఫార్మన్స్ అండ్ డిజైన్-బిల్డ్ క్వాలిటి కంపేరిజన్ చూద్దాం రండి..

కెమేరా
అసుస్ ఫోన్ లేజర్ ఆటో ఫోకస్ తో వస్తుంది. ఇది మిగిలిన ఫోన్స్ కన్నా బెటర్ ఫోకస్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇమేజెస్ తీసేటప్పుడు. నార్మల్ లైటింగ్ కండిషన్స్ లో బెటర్ కలర్ accuracy అండ్ దైనామిక్ ర్యాంక్ రెండికన్నా అసుస్ జెన్ ఫోన్ 2 లేసర్ కు ఎక్కువ. దీని తరువాత meizu m2 నోట్ అసుస్ కు దగ్గరిలో డైనమిక్ ర్యాంజ్ ఇస్తుంది కాని కలర్ accuracy అంత బాగాలేదు అసుస్ తో కంపేర్ చేస్తే.


      Left నుండి right కు ఆసుస్ Zenfone 2, Meizu M2 నోట్ మరియు యు Yureka ప్లస్

కాని meizu m2 నోట్  Low లైటింగ్ లో మంచి ఫోటోలను ఇస్తుంది. Low లైట్ లో true కలర్స్ మరియు మిగిలిన రెండు ఫోనుల కన్నా మంచి డిటేల్స్ తో ఫోటోస్ ను తీస్తుంది. యురేకా ప్లస్ కు సోనీ సెన్సార్ ఉంది కాని ఈ టెస్ట్ లో ఇది వెనుక బడింది. ధరకు తగ్గ ఫోటోలను తీస్తుంది కాని మిగిలిన ఫోనుల కన్నా ఓవర్ ఆల్ బెటర్ క్వాలిటి ను ఇవ్వటం లేదు.


      left నుండి right ఆసుస్ Zenfone 2, Meizu M2 నోట్ మరియు యు Yureka ప్లస్

కెమేరా ఆప్షన్స్ లో కూడా ఆసుస్ చాలా ఎక్కువ ఫీచర్స్ ను ఇస్తుంది. దీని తరువాత meizu కు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయంలో యురేకా ప్లస్ మళ్ళీ వెనుక బడింది.

      left నుండి right ఆసుస్ జెన్ ఫోన్ 2, meizu m2 నోట్ అండ్ యు యురేకా ప్లస్

ఫుల్ రిసల్యుషణ్ లో తీసిన టెస్ట్ ఇమేజెస్ ను క్రింద చూడండి..

 

 

Camera winner: అసుస్ జెన్ ఫోన్ 2 laser

పెర్ఫార్మన్స్ అండ్ synthetic బెంచ్ మార్క్ స్కోర్స్
ఇంటర్నెట్ బ్రౌజింగ్ పెర్ఫార్మన్స్ , వీడియో పెర్ఫార్మన్స్ అండ్ నార్మల్ గా ఒక స్మార్ట్ ఫోన్ ను వాడే యూజర్ daily లైఫ్ పనులును కూడా టెస్ట్ చేసిన తరువాత Yu యురేకా ప్లస్ మూడింటి కన్నా ఫాస్ట్ గా ఉంది అని కనుగున్నాము. దీని తరువాత meizu m2 నోట్ ఫాస్ట్ గా ఉంది. ఈ రెండిటి కనా అసుస్ లేసర్ ఫోన్ స్లో గా ఉంది. ఇది ముందే అనుకున్నదే ఎందుకంటే దీనిలో క్వాడ్ కోర్ ప్రోసెసర్ మాత్రమే ఉంది. ఆఫ్ కోర్స్ ఆక్టో కోర్ ప్రొసెసర్ కన్నా క్వాడ్ కోర్ ప్రోసేసర్స్ బాగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి కాని ఈ ఫోన్ లో అలా జరగలేదు.

రియల్ టైమ్ పెర్ఫార్మన్స్ లానే బెంచ్ మార్క్ స్కోర్స్ లో కూడా యురేకా ప్లస్ meizu m2 నోట్ కు స్లైట్ గా పై చేయి సాదించగా ఆసుస్ ఈ రెండికి బాగా దూరం లో ఉంది.

పెర్ఫార్మన్స్ Winner : Yu యురేకా ప్లస్

బిల్డ్ అండ్ డిజైన్
ఎప్పుడూ ఫోన్ బిల్డ్ అండ్ డిజైన్ సెగ్మెంట్ లో రివ్యూ అనేది ఒపీనియన్స్ ను సంబందించినది. టఫ్ లుకింగ్ ఆసుస్ జెన్ ఫోన్ 2 లేసర్ నిజంగా బెస్ట్ బిల్ట్ బాడీ తో వస్తుంది మూడింటి కన్నా.  గొరిల్లా గ్లాస్ 3, ఫినిషింగ్ బటన్స్, మ్యాటీ ప్లాస్టిక్ బ్యాక్ వలన బిల్డ్ డిపార్ట్మెంట్ లో  ఇది మొదటి ప్లేస్ లో ఉంది. కేవలం పెద్ద సైజ్ లో ఉంటుంది అనే మైనస్ తప్ప ఆసుస్ బిల్డ్ లో మైనస్ ఏమీ లేదు.

డిజైన్ పరంగా meizu m2 ఫోన్ అందరికీ నచ్చింది లుక్స్ లో.  యురేకా ప్లస్ అండ్ ఆసుస్ లా repeat డిజైన్ లా కాకుండా meizu m2 ప్లాస్టిక్ బాడీ తో రెఫ్రెషింగ్ అనిపిస్తుంది.  బిల్డ్ పరంగా ఆసుస్ లెసర్ కన్నా బెటర్ గా లేదు కాని స్మార్ట్ డిజైన్ తో వస్తుంది. 

బిల్డ్ winner – ఆసుస్ అండ్ డిజైన్ winner – meizu m2
 

బాటమ్ లైన్ :
కెమేరా మీకు మెయిన్ ప్రిఫెరేన్స్ అయితే ఆసుస్ జెన్ ఫోన్ 2 Laser కరెక్ట్ చాయిస్. కెమేరా తో పాటు లుక్స్ కూడా refresh గా ఉండాలని అనుకుంటే meizu m2(అయితే ఆసుస్ అంత బెటర్ కెమేరా కాదు). Meizu m2 డిజైన్ అండ్ పెర్ఫార్మన్స్ సెక్షన్స్ లో బాగా ఉంది. యురేకా ప్లస్ అయితే కేవలం పెర్ఫార్మన్స్ ఒక్క లోనే బాగుంది.

ఓవర్ ఆల్ గా ఆసుస్ Laser రెండు (కెమేరా అండ్ బిల్డ్ క్వాలిటీ) విషయాలలో పై చేయి సాదించింది. అయితే నిజంగా చెప్పాలంటే meizu m2 చాలా మందికి నచ్చింది. ఇది మిగిలిన ఫోన్స్ కన్నా స్లైట్ గా తేడాలు చూపించింది. సో దీనిని కూడా తీసుకోవచ్చు లుక్స్ మీకు మెయిన్ ప్రిఫెరేన్స్ అయితే.

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :