LeTV 1S మొబైల్ : ఫర్స్ట్ ఇంప్రెషన్స్

LeTV 1S మొబైల్ : ఫర్స్ట్ ఇంప్రెషన్స్
HIGHLIGHTS

11,500 రూ లకు సుపర్బ్ బిల్డ్ అండ్ స్పెక్స్

ప్రస్తుత మార్కెట్ లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ చాలా కాంపిటీషన్ గా ఉంది. అప్పుడు xiaomi వంటి కంపెనీలు చైనా లో ఎలా జోరుగా స్టార్ట్ అయ్యాయో, ఇప్పుడు కొత్త బ్రాండ్ LeTV కూడా అదే క్రేజ్ తో వస్తున్నాయి చైనా లో.

ఇది హై ఎండ్ స్పెక్స్ తో బడ్జెట్ ర్యాంజ్ లో కొత్త బడ్జెట్ మోడల్ లాంచ్ చేసింది నిన్న, పేరు LeTV 1S. ధర 11,000 రూ. LeTV ఇది వరకూ 1S కన్నా ముందు Le1, Le 1 ప్రో, Le మ్యాక్స్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. 
 

కంపెని ఇది వరుకే ఇండియాకి ఎంటర్ అవుతున్నాము అని ప్రకటించింది కూడా. 1S మోడల్ ప్రస్తుతం చైనాలోనే రిలీజ్ అయ్యింది. దీనిని మేము వాడుతున్నాము. సో ఇక్కడ మా మొదటి అభిప్రాయాలు చూడగలరు. త్వరలోనే రివ్యూ కూడా వస్తుంది.


          పైన ఉన్న బ్లాక్ సర్కిల్ కెమేరా లెన్స్, క్రింద ఉన్న సెంటర్ సర్కిల్- ఫింగర్ ప్రింట్ సెన్సార్

ముందుగా చెప్పలిసింది.. మోస్ట్ 10 – 12K బడ్జెట్ ఫోనుల్లో లేనిది, LeTV 1S లో ఉన్నది… మెటాలిక్ unibody డిజైన్. మెటల్ ఫ్రేమ్ అండ్ అల్యూమినియం బాడీ. చేతిలో సాలిడ్ గా ఉంది పట్టుకుంటే. 5.5 in స్క్రీన్ మెటల్ బాడీ అనే సరికి హెవీ గా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అంత బరువుగా కూడా అనిపించదు. స్క్రీన్ సైడ్స్ లో ఉన్న బెజేల్స్ కూడా చాలా సన్నగా ఉన్నాయి. ప్రీమియం లుక్స్ తో. 

మరొక బెస్ట్ పార్ట్ – 2.2GHz మీడియా టెక్ Helio x10 టర్బో ప్రొసెసర్. ఇది మోస్ట్ పవర్ ఫుల్ ప్రొసెసర్ ప్రస్తుత మార్కెట్ లో. దీనికి తోడూ పవర్ VR GPU కూడా ఉంది. అంటే హై ఎండ్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

కూల్ ప్యాడ్ మాదిరిగానే ఇది కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది 11,500 బడ్జెట్ లోనే. ఫాస్ట్ గా పనిచేస్తుంది సెన్సార్. ఇది mirror ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని ప్రోమోట్ చేస్తుంది కంపెని. అంటే అద్దం లా మన రిఫ్లెక్షన్ చూపిస్తుంది.

మిగితావి, 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరాస్, 5.5 ఫుల్ HD డిస్ప్లే. ఈ మూడు అన్ని ఫోనుల్లో ఉంటున్నాయి. అయితే LeTV చైనా లో తమ సొంత కంటెంట్ ను ఫోన్స్ అండ్ టీవీ లలో ప్రోవైడ్ చేసి earn చేస్తుంది. కాని ఇది ఇండియాలోకి వస్తే కంటెంట్ ను ఇండియాలో కూడా డిస్ట్రిబ్యూషన్ చేయటానికి కొంత ఇండియన్ డేటా కంటెంట్ కావాలి. దీని అంతటికీ ఖర్చు అవుతుంది. కాని కంపెని హెడ్ టిన్ మోక్, leTV ఇండియా కు వచ్చే ప్రయత్నాలలో ఉంది అని చెప్పటం జరిగింది. సో ప్రాక్టికల్ గా చైనా లో ఉన్న ప్రైసెస్ కు ఇవి ఇండియాలోకి రావటం కష్టం.

LeTV eUI కూడా బాగుంది. దీని కి కారణం కంపెని ecosystem. సో చైనీస్ మార్కెట్ ప్రకారం 1s ఆ ప్రైస్ కు మంచి ఫోన్. మరి ఇండియన్ ప్రైస్ లో ఎంత variation ఉంటుంది అనే దానిపై దీని మీద హోప్స్ పెట్టుకోవాలి. కంపెని ఈ మోడల్ ను ఇండియాకు లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించలేదు కాని చాన్సేస్ ఎక్కువగా ఉన్నాయి.

 

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo