లెనోవో Vibe K5 నోట్ : మొదటి అభిప్రాయాలు
జనరల్ గా రిలీజ్ అయ్యి one ఇయర్ దాటిన తరువాత upgrade మోడల్ రిలీజ్ అవటం అన్నది జరుగుతుంది. కాని లెనోవో ఈ రూల్ ను కూడా బ్రేక్ చేసింది ఇప్పుడు..
లెనోవో జనవరి నెలలో Vibe K4 నోట్ ను రిలీజ్ చేసింది 2016 లో. ఇదే సంవత్సరంలో ఆగస్ట్ నెలలో దాని అప్ గ్రేడ్ మోడల్ పేరుతో Vibe K5 నోట్ ను లాంచ్ చేసింది.
మీడియా టెక్ P10 SoC, 4GB/3GB రామ్ వేరియంట్స్, 32GB స్టోరేజ్, 13MP/8MP కేమేరాస్, 3500 mah బ్యాటరీ. ఇవీ దీని క్విక్ మెయిన్ స్పెక్స్.
ఫస్ట్ లుక్స్ లో ఫోన్ ఇంటరెస్టింగ్ గా కనిపించింది. edges లో slight curves తో బాగుంది అనిపించింది. కాని కచ్చితంగా ఇది సింగిల్ హ్యాండ్ usage కు పనిచేయదు. బాగా పెద్దగా ఉంది.
వెనుక మెటాలిక్ ఫినిషింగ్ ఉన్నా ప్లాస్టిక్ ఫీలింగ్ కలుగుతుంది ఇంకా. మెటాలిక్ షైన్ ఉంది. కానీ ఇది ఓవర్ ఆల్ గా LeEco Le 2 కన్నా గొప్పగా కనపడటంలేదు.
Vibe K5 నోట్ కొంచెం Vibe P1 కు సిమిలర్ గా ఉంటుంది లుక్స్ వైజ్ గా. అలాగని ప్రీమియం లుక్స్ ఇవటం లేదు. రియల్ disappointment ఏంటంటే 5.5 in FHD డిస్ప్లే…
dim గా ఉంది, reflections చూపిస్తుంది, డల్ కలర్స్, వ్యూయింగ్ angles కూడా డిస్ప్లే dim గా ఉండటం వలన బాలేవు అని చెప్పాలి. టచ్ రెస్పాన్స్ కూడా కరెంట్ ట్రెండ్ కు తగ్గా ప్రీమియం గా లేదు. అప్ గ్రేడ్ మోడల్ లో upgrade అవ్వాలి కదా! కాని K4 నోట్ కు దీనికి పెద్ద తేడా లేదు డిస్ప్లే.
మా experience లో గతంలో Helio P10 SoC కూడా మంచి మార్కులు సంపదిన్చుకోలేదు. అయినా సరే లెనోవో ప్రత్యేకంగా software optimisations చేస్తే satisfy అయ్యే అవకాశాలున్నాయి కానీ అలా కంపెని అంత చేసి ఉండదు అని మా అంచనా. Android Marshmallow ను ఒరిజినల్ గానే ఎక్కువుగా ఉంచేలా ప్రయత్నాలు చేసింది లెనోవో. ప్రత్యేకమైన లుక్స్ ను తీసివేసింది. మా దృష్టిలో stock os లుక్స్ బెటర్. ఎందుకంటే Xiaomi లా కంప్లీట్ గా custom os లుక్స్ ఇచ్చే అంత OS variation కూడా లేదుగా లెనోవో custom os లో..
డాల్బీ atmos టెక్నాలజీ, ఇది నిజంగా మంచి ఫీచర్ లెనోవో ఫోనుల్లో. థియేటర్ మాక్స్ కూడా ఇప్పుడిప్పుడు VR అనేది పరిచయం అయ్యింది కాబట్టి నచ్చే అంశం అని చెప్పుకోవచ్చు.
13MP రేర్ కెమెరా MOTO G4 ప్లస్ కు దగ్గరిలో ఉంది అని చెప్పవచ్చు. అంటే బాగుంది అని అర్థం. ఎందుకంటే అండర్ 15K లో Le 2, రెడ్మి నోట్ 3 మరియు ఇతర ఫోనుల్లో MOTO G4 ప్లస్ బెస్ట్ కెమెరా ఫోన్.
ఓవర్ ఆల్ గా లెనోవో Vibe K5 నోట్ కొనేందుకు inspiring గా ఉండదు. prices 3GB(11,999 rs), 4GB (13,499 rs) బాగున్నాయి కాని ఎదో average upgrade మోడల్ లా ఉంది, true upgraded కంటెంట్ లేదు స్పెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఇక రివ్యూ లో మీడియా టెక్ ప్రొసెసర్ Le 2 , రెడ్మి నోట్ 3 లను మించుతుందా లేదా తెలుసుకోవాలి…