లెనోవో Z2 ప్లస్: మొదటి అభిప్రాయాలు
ఆల్రెడీ చేతిలో బాగా పనిచేసే ఫోన్ ఉన్నా, మార్కెట్ లో తక్కువ ప్రైస్ కు ఉన్నతమైన స్పెక్స్ తో ఫోనులు లాంచ్ అయితే, అది అందరి దృష్టిని ఆకర్షించటం ఇప్పుడు కామన్ అయిపొయింది.
ఇప్పుడు లెనోవో Z2 ప్లస్ కూడా ప్రైస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ(18 వేలు/20 వేలు), అందరూ దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇక్కడ ఈ మొబైల్ మొదటి అభిప్రాయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నా.
ఆల్రెడీ ఫోన్ వాడటం జరుగుతుంది. సో దీనిపై ఏర్పడిన ఫర్స్ట్ ఇంప్రెషన్స్ మీకోసం…
మొదట్లో లేటెస్ట్ SD 820 SoC తో Xiaomi Mi 5 25 వేలకు చవకైన ఫోన్ అనుకున్నాము. తరువాత కేవలం SoC ఒకటే కాదు 6GB రామ్, 64GB స్టోరేజ్ తో Oneplus 3 ఆ స్థానం దక్కించుకుంది. ఇప్పుడు లెనోవో కూడా అదే పవర్ ఫుల్ SoC 820, 4GB of LPDDR4-1866 RAM, 64GB స్టోరేజ్ with SanDisk's SmartSLC technologyమరియు 3500 mah బ్యాటరీ with ఇంటెలిజెంట్ పవర్ management, 13MP large పిక్సెల్ అండ్ 4K వీడియో రికార్డింగ్, ఫైబర్ గ్లాస్ బాడీ తో Z2 ప్లస్ ఈ స్థాన్నాన్ని బర్తీ చేయనుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కంప్లీట్ ఆన్సర్ మాత్రం రివ్యూ పూర్తి అయిన తరువాతే తెలుస్తుంది. ఇవన్నీ 19,999 రూ లకు వస్తున్నాయి. జనరల్ గా ఏవరేజ్ users కు ఇది ఎక్కువ, కాని ఈ స్పెక్స్ తో పోలిస్తే మార్కెట్ లో ఇదే చీప్ మోడల్. మరొక వేరియంట్ కూడా ఉంది దానిలో 32GB స్టోరేజ్ అండ్ 3GB రామ్. ప్రైస్ 17,999 రూ.
సో ఫోన్ పై కలిగిన మొదటి ఇంప్రెషన్స్ లోకి వస్తే..
ఫాస్ట్ గా ఉంది. ఎక్కడా లాగ్స్, stutters లేవు. యాప్స్, menus, ఆప్షన్స్ అన్నీ ఫాస్ట్. స్మూత్ పెర్ఫర్మార్. స్మార్ట్ SLC ఫాస్ట్ స్టోరేజ్ ను వాడుతుంది. బెటర్ accessing అండ్ కాపీ పేస్టు స్పీడ్స్ ఉంటాయి. అన్ని కలిపితే ప్రస్తుతం అండర్ 20 బడ్జెట్ లో Z2 ప్లస్ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫోన్ అయ్యేలా ఉంది.
13MP కెమెరా నిజంగా stunning గా లేదు. అలాగని నిరుత్సాహ పరచదు. కలర్ బాలన్స్ అండ్ accuracy బాగున్నాయి. డిటేల్స్ సూపర్బ్ అనేలా లేవు. 4K రికార్డింగ్ మాత్రం బాగుంది. కెమెరా యాప్ కూడా సూపర్ ఫాస్ట్.
డిస్ప్లే FHD 5 in 2.5D curved గ్లాస్ అండ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ కలిగి ఉంది. టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. కలర్స్ వైబ్రంట్ గా కాంట్రాస్ట్ మరియు షార్ప్ నెస్ గ్రేట్ గా ఉన్నాయి. అయితే బ్రైట్ నెస్ మాత్రం వీటికి తగ్గట్టుగా లేదు. సన్ లైట్ లో డైరెక్ట్ గా ఫోన్ వాడితే కొంచెం reflective గా ఉంది బ్రైట్ నెస్ dim గా ఉండటం వలన. ఆండ్రాయిడ్ 6.0.1 బేస్డ్ లెనోవో ZUI పై నడుస్తుంది. customizations లైట్ గా ఉన్నాయి. క్విక్ సెట్టింగ్స్ ఫోన్ క్రింద నుండి పైకి స్వైప్ చేస్తే చిన్న menu ఓపెన్ అవుతుంది. ఇది సింపుల్ గా క్లాస్ గా ఉంది. పర్సనల్ గా నచ్చింది. అంటే మీరు క్విక్ సెట్టింగ్స్ కోసం పై నుండి స్వైప్ చేయనవసరం లేదు. same ఆపిల్ కాన్సెప్ట్, కాని డిజైన్ మినిమల్.
3500 mah బ్యాటరీ ఇంటెలిజెంట్ చార్జ్ కట్ టెక్నాలజీ తో వస్తుంది. అంటే బ్యాటరీ ఫుల్ అయితే ఫోన్ ఆటోమాటిక్ గా చార్జింగ్ ను కట్ చేస్తుంది. ఇది బ్యాటరీ లైఫ్ ను పెంచుతుంది. కంప్లీట్ బ్యాటరీ గురించి రివ్యూ లో తెలుసుకుందాము.
8MP ఫ్రంట్ కెమెరా లో Omnivision OV8865 ఇమేజ్ సెన్సార్ ఉంది. ఇది larger 1.4um పిక్సెల్ సైజ్ కలిగి ఉంది. ఇంకా ఫైబర్ గ్లాస్ బాడీ వలన ఫోన్ హీటింగ్ అవకుండా ఉంటుంది కొంతమేరకు. అలాగే కూలింగ్ కూడా ఫాస్ట్ గా ఉంటాయి. అయితే మరీ ఎక్కువ ఎండల్లో ఉంటే అంత ఫాస్ట్ గా కూల్ అవదు.ఇంకా U-touch ఫింగర్ ప్రింట్ స్కానర్ బటన్ తో 7 ఫంక్షన్స్ చేసుకోగలరు సింగిల్ బటన్ తో. అంటే స్క్రీన్ లో ఉన్న నేవిగేషన్ బటన్స్ ను disable చేసుకొని ఈ సింగిల్ ఫిజికల్ బటన్ తో అవే పనులు చేసుకోగలరు. నేవిగేషన్ బటన్స్ disable చేయకపోయినా బటన్ ఈ ఫంక్షన్స్ అందిస్తుంది.
Buy Oneplus 3 from Amazon at Rs. 27,999