లెనోవో వైబ్ S1 కంప్లీట్ రివ్యూ : మోటో డిజైన్ తో లెనోవో ఫోన్

లెనోవో వైబ్ S1 కంప్లీట్ రివ్యూ : మోటో డిజైన్ తో లెనోవో ఫోన్
HIGHLIGHTS

లెనోవో వైబ్ రివ్యూ: సబ్ 20K బడ్జెట్ లో నిజంగా బెస్ట్ లుకింగ్ అండ్ డిజైన్ ఫోన్ ఇది

లెనోవో ను మోటోరోలా కొన్న విషయం పాత సంగతి. ఇప్పుడు మోటోరోలా లాంటి డిజైన్ తో మొదలవుతుందా లెనోవో? అవును అన్నట్టుగానే ఉంది లెనోవో వైబ్ S1 డిజైనింగ్ చూస్తే.. ఎందుకో లెనోవో vibe S1 కంప్లీట్ రివ్యూ లో చూద్దాం రండి.

బిల్డ్ అండ్ డిజైన్: బ్యూటిఫుల్

ఇప్పుడు ఫోన్ కు రెండు వైపులా గ్లాస్ బాడీ ఇవ్వటం మొదలుపెట్టాయి కంపెనీలు. ఈ వరస లో ముందు శామ్సంగ్ S6 ఉంది. తరువాత oneplus x. ఇప్పుడు ఇది. oneplus x మాదిరిగా S1 ఫింగర్ ప్రింట్స్ ను ఆకర్షించటంలేదు. మంచి విషయమే ఇది. వైట్ అండ్ బ్లూ రెండు కలర్స్ లో వస్తుంది. వైట్ కన్నా బ్లూ స్టైలిష్ గా ఉంది. కాని వైట్ కన్నా బ్లూ పై కొంచెం ఎక్కువుగా ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తాయి.

మోటోరోలా influence ఎందుకు అంటే.. వైబ్ S1 లో Curved బ్యాక్ డిజైనింగ్ ఉంది మోటో వలే. 7.8MM thickness తో 132 గ్రా బరువు ఉంది. వీటి ప్రకారం అయినా ఇది బెస్ట్ బిల్డ్ అని చెప్పాలి. oneplus x డిజైన్ బాగుంటుంది. కాని వైబ్ S1 చేతిలో కరెక్ట్ గా ఫిట్ గా ఉంటుంది. బెటర్ ఫీలింగ్ ఇస్తుంది పట్టుకుంటే. కేవలం curved బ్యాక్ వలనే ఈ తేడా. కాని ఫ్రంట్ లో బెజేల్స్ (టాప్, బాటం, సైడ్స్) బాగా ఎక్కువుగా కనిపిస్తున్నాయి. సో అన్ని ఫోనుల్లానే ఇది కూడా ఉంది అనిపిస్తుంది చూడటానికి. ఇది బ్లూ వెర్షన్ లో బాగానే ఉంది, వైట్ లో ఎక్కువుగా అనిపిస్తుంది. 

డిస్ప్లే అండ్ UI: బాగున్నాయి
5in స్క్రీన్ పై 1080P డిస్ప్లే ఎప్పుడూ బాగానే ఉంటుంది. సో అలానే వైబ్ S1 లో కూడా బాగుంది. ఇప్పుడు indepth కు వెళ్తే కొంచెం డిమ్ గా ఉంది. కలర్స్ కూడా accurate గా లేవు అని చెప్పాలి. ఇది IPS లో కామన్. కాని బ్రైట్ నేస అండ్ వైబ్రంట్ కూడా తక్కువ ఉన్నాయి. UI మాత్రం కలర్ ఫుల్. కాని లెనోవో ui ప్రీ installed యాప్స్ తో ప్రాబ్లెమ్స్ అలానే ఉన్నాయి.  కాకపోతే ఇవి uninstall చేయగలరు. కాని ఫోన్ లుక్స్ తో పోలిస్తే ui లుక్స్ డౌన్ అని చెప్పాలి.

పెర్ఫార్మెన్స్: ఫర్వాలేదు
1.7GHz మీడియా టెక్ ఆక్టో కోర్ఉంది.ఇది స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్ కన్నా మంచి చాయిస్. గ్రౌండ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వదు కాని SD 615 కన్నా మంచి పనితనం ఇస్తుంది. అంటే ఆల్మోస్ట్ oneplus x లోని స్నాప్ డ్రాగన్ 801 కు కంపేర్ చేయవచ్చు. గేమింగ్ ఎక్కువ చేసే వారు అయితే మీడియా టెక్ బెటర్ SD615 ఉన్న మొబైల్ కన్నా. ఫోన్ గేమింగ్ లో ఎక్కడా లాగ్స్ చూపించదు. రెగ్యులర్ టాస్క్స్ లో బాగా పనిచేస్తుంది. సబ్ 20K సెగ్మెంట్ లో ఇది మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. oneplus x అండ్ meizu MX5 కన్నా తక్కువే అయినప్పటికీ చాలా మైనర్ డిఫరెన్స్.

కెమెరా: బాగుంది
13MP బ్యాక్. 8MP అండ్ 2MP ఫ్రంట్ లో ఉన్నాయి. అయితే ఫ్రంట్ డ్యూయల్ కేమేరాస్ కంపెని ప్రోమోట్ చేసిన అంతగా ఉపయోగకరంగా లేవు. లెనోవో కాన్సెప్ట్ థర్డ్ పార్టీ యాప్స్ తో కూడా చేయవచ్చు. క్వాలిటీ గురించి చెప్పాలంటే ఫ్రంట్ కెమేరా సాఫ్ట్ ఇమేజెస్ ఇస్తుంది. బాగుంది. ఓవర్ గా లేదు. స్టూడియో లైట్ కండిషన్స్ అండ్ అవుట్ డోర్ లో మంచి కలర్స్ ఉన్నాయి.

 

Lenovo Vibe S1 Front Camera

రేర్ కెమెరా లో డిఫరెంట్ స్టోరీ. ఫోటోస్ క్లికింగ్ స్పీడ్ అండ్ ప్రోసెసింగ్ కొంచెం లేట్ అవుతుంది. ఇమేజెస్ పరంగా బాగుంది కాని కంపేర్ చేస్తే వేరే మొబైల్స్ తో ఫోటోస్ క్లికింగ్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. ట్రూ సోర్స్ కలర్స్ బాగున్నాయి కాని ఓవర్ ఆల్ గా oneplus x అండ్ మోటో x ప్లే కన్నా బెటర్ కాదు.

Lenovo Vibe S1 Rear Camera

బ్యాటరీ: ఎవరేజ్
2500 మహ బ్యాటరీ ఉంది. బహుశా స్లిమ్ గా తయారు చేయటానికి కంపెని బ్యాటరీ పై compromise అయినట్టు ఉంది. కాని అందరికీ దిని బ్యాటరీ లైఫ్ సరిపోదు. 7 నుండి 10 గంటలు వస్తుంది. బయటకు వెళ్లేముందు కచ్చితంగా పవర్ బ్యాంక్స్ తీసుకు వెళ్ళాలి మీరు కనుక పవర్ users అయితే.

బాటమ్ లైన్
ఓవర్ ఆల్ గా 15,999 రూ లకు లెనోవో వైబ్ S1 కచ్చితంగా కొనటానికి worthable. oneplus x మోడల్ కు దీనికి లుక్స్ వైజ్ గా పోలిస్తే పెర్సనల్లి నేను దీనిని పిక్ చేసుకుంటాను. సింపుల్ రీజన్ – వెనుక curved బ్యాక్ డిజైన్ చేతిలో మంచి లైట్ ఫీల్ ఇస్తుంది. చాలా మంది చేతిలో పట్టుకోవటానికి బాగుంది అని మొబైల్ తీసుకోవటం ఏంటి అనుకోవచ్చు కాని ఎక్కువ శాతం మొబైల్ చేతిలోనే ఉంటుంది. సో అది ఇంపార్టంట్ విషయం. మీరు కనుక సబ్ 20K లో మంచి ఫోన్ కోసం చూస్తే, లెనోవో వైబ్ S1 కూడా లిస్టు లో ఉంటుంది. మంచి కెమేరా, సంతృప్తికరమైన పెర్ఫార్మెన్స్ & డిస్ప్లే, average బ్యాటరీ లైఫ్ దీనిలో ఉన్నాయి. ఇవి మీకు చాలు అనుకుంటే తీసుకోండి.

PROS
– బ్యూటిఫుల్ ప్రీమియం డిజైన్
– మంచి కెమెరా ఇమేజ్ క్వాలిటీ

CONS
– కొంచెం డిస్ప్లే డిమ్ గా అనిపిస్తుంది
– బ్యాటరీ లైఫ్ ఇంకా బెటర్ గా ఉండాలి.
ఫైనల్ రేటింగ్: 74/100

 

 

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo