రెడ్మి నోట్ 3 ఓవర్ ఆల్ గా హ్యాండ్ సెట్ అందరినీ ఇంప్రెస్ చేసింది కాని కెమెరా సెగ్మెంట్ లో టాప్ లో ఉండే Xiaomi కొంచం నిరుత్సాహ పరిచింది. ఈ రోజు లెనోవో vibe K5 ప్లస్ మరియు రెడ్మి నోట్ 3 యొక్క కెమెరా లలో ఏది బాగుందో కంపేర్ చేసి తెలుసుకుందాము.
రెడ్మి లో 16MP సామ్సంగ్ S5K3P3 ISOCELL సెన్సార్ ఉండగా వైబ్ K5 ప్లస్ లో 13MP CMOS BSI సెన్సార్ ఉంది. ఈ రెండింటిలో ఏది బెటర్ గా ఉంది? చదవండి..
కేమెరా యాప్ పెర్ఫార్మన్స్
లెనోవో లో ట్రెడిషనల్ లేఔట్ సెట్టింగ్స్ ఉన్నప్పటికీ ఓవర్ ఆల్ గా రెడ్మి బెటర్ గా ఉంది ఈజీగా use చేయటానికి. ముఖ్యమైన విషయం ఏంటంటే టచ్ ఫోకస్ పాయింట్ వద్దనే ఇమేజ్ ను క్లిక్ చేయటానికి అవుతుంది రెడ్మి లో. ఇది సింగిల్ హ్యాండ్ పిక్స్ షూటింగ్ కు useful. షట్టర్ రెస్పాన్స్ విషయంలో కూడా రెడ్మి ఫాస్ట్ మరియు more accurate గా కూడా ఉంది. ఓవర్ ఆల్ గా రెడ్మి విన్నర్ ఈ విషయానికి.
ఇమేజ్ గేలరీస్
Lenovo Vibe K5 Plus image samples
Xiaomi Redmi Note 3 image samples
డే లైట్ పెర్ఫార్మెన్స్
డైరెక్ట్ సన్ లైట్ లో క్లోజ్ షాట్స్, షాడోస్ వంటి రకరకాల ఇమేజెస్ తీసినప్పుడు రెండింటికీ ప్రైమరీ డిఫరెన్స్ షార్ప్ నెస్ అని తెలుసుకున్నాము. రెడ్మి లో ఎక్కువ షార్ప్ నేస్ ఉంది. అంతేకాదు ఎక్కువ కాంట్రాస్ట్, saturation లెవెల్స్ ఉన్నాయి. ఈ లైటింగ్ లో నాయిస్ బాగా మేనేజ్ చేసాయి రెండు ఫోనులు. ఓవర్ ఆల్ గా రెడ్మి విన్నర్ ఇక్కడ.
ఇండోర్ పెర్ఫార్మెన్స్
ఇండోర్ లో కూడా లెనోవో కు షార్ప్ నెస్ తక్కువుగా ఉంది. రెడ్మి warmer కలర్ tone తో ఎక్కువ షార్ప్ నెస్ ఇస్తుంది ఫోటోస్ లో. లెనోవో కేవలం warm వాతావరణంలోనే మంచి warmth ఉన్న ఫోటోస్ ను ఇస్తుంది. కలర్స్ విషయంలో రెండూ దాదాపు సిమిలర్ కాని షార్ప్ నెస్ లేకపోవటం వలన రెడ్మి విన్నర్ ఇక్కడ కూడా.
Low లైట్
రెండు ఫోనులు low లైటింగ్ లో పూర్. రెడ్మి పూర్ అని అనుకుంటే లెనోవో ఇంకా పూర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. రెండు కెమెరా లలోని నాయిస్ లెవల్స్ ఫోటోలోని డిటేల్స్ మరియు కలర్స్ ను పాడుచేస్తున్నాయి. చాలా రేర్ గా ఇష్టపడతారు low లైటింగ్ లో తీసిన ఫోటోస్ ను.
ఫైనల్ లైన్
ఓవర్ ఆల్ రెడ్మి నోట్ 3 లెనోవో వైబ్ K5 ప్లస్ కన్నా బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది కెమెరా విషయంలో. లెనోవో 3,500 రూ తక్కువుగా వస్తుంది రెడ్మి కన్నా మరియు గుడ్ లైటింగ్ లో రెడ్మి కు దగ్గరగానే ఉండటం వలన లెనోవో ఇమేజింగ్ పెర్ఫార్మన్స్ ను accept చేయవచ్చు. ఆఫ్ కోర్స్ లెనోవో కన్నా రెడ్మి ఎక్కువ ప్రైస్ కావచ్చు కాని డిసెంట్ కెమెరా పెర్ఫార్మన్స్ ను మీరు కావాలనుకుంటే లెనోవో వైబ్ K5 ప్లస్ మంచి చాయిస్ కాదు.
నోట్ : ఎంత ఎక్కువ రిచ్ కాంట్రాస్ట్ లెవెల్స్, saturation లెవెల్స్ మరియు కలర్ accuracy ఉంటే అంత తక్కువుగా నాయిస్ లెవెల్స్ ఉంటాయి.