లెనోవో Vibe K5 ప్లస్ మోడల్ ను ఇండియాలో నిన్న లాంచ్ చేయటం తెలిసిన విషయమే. ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ తో వస్తుంది కాని A6000 ప్లస్ మోడల్ ను replace చేయనుంది బడ్జెట్ సెగ్మెంట్ లో..
గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రైస్ కు మెటల్ బాడీ మరియు ఫోన్ ఫ్లాష్ సేల్స్ లో కాకుండా ఓపెన్ సేల్స్ లో సేల్ అవటం. మార్చ్ 23 నుండి ఓపెన్ సేల్స్ అందరికీ రిజిస్ట్రేషన్స్ లేకుండా సేల్ అవనుంది ఫ్లిప్ కార్ట్ లో exclusive గా.
ఈ మోడల్ పై కంపెని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది, అయితే దీనిలో నిజంగా ఎంత వరకూ కంటెంట్ ఉందో ఫర్స్ట్ ఇంప్రెషన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..
ముందుగా చెప్పవలసిన విషయం ఫోన్ 5 in డిస్ప్లే అవటం వలన లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్ గా అనిపిస్తుంది. తరువాత అల్యూమినియం మెటల్ బాడి మంచి విషయం, కాని ఇది unibody డిజైన్ తో రాలేదు. వెనుక రిమూవబుల్ బ్యాటరీ కవర్ ఉంది.
ఓవర్ ఆల్ గా ఫోన్ sturdy అండ్ ఫ్రంట్ లో ఉన్న polished chrome strip మెటల్ తో రావటం వలన ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేకపోవటం కొంత నిరాశ గా అనిపించవచ్చు కొందరికి.
5 in డిస్ప్లే లో వ్యూయింగ్ angles అండ్ కలర్ saturation natural గా బాగున్నాయి. టచ్ రెస్పాన్స్ స్మూత్ గా ఉంది. infact రెడ్మి నోట్ 3 కన్నా బాగుంది.(అయితే confuse అవకండి, కేవలం కంపేర్ చేస్తే K5 ప్లస్ బెటర్ గా ఉంది అంతేకాని రెడ్మి నోట్ 3 టచ్ bad అని కాదు)
స్నాప్ డ్రాగన్ 616 SoC గతంలో హానర్ 5X లో ఉంది. ఈ మొబైల్ 616 ప్రొసెసర్ 2gb ర్యామ్ తో వస్తుంది. animations అండ్ ఒక యాప్ నుండి మరొక యాప్ కు వెళ్ళేటప్పుడు మధ్యలో ఉండే గాప్స్ వంటివి quite స్మూత్ అండ్ snappy గా ఉన్నాయి.
డివైజ్ కు స్టాండర్డ్ 16gb ఇంటర్నెల్ స్టోరేజ్ ఉంది. అదనంగా మైక్రో sd కార్డ్ సపోర్ట్ కూడా సెపరేట్ గా వస్తుంది. వెనుక రెండు స్పీకర్స్ ఒక హై లైట్ అయితే, అవి డాల్బీ atmos సౌండ్ తో రావటం మరొక హై లైట్. అయితే ఇవి ఫోన్ కు పైన క్రింద ఇచ్చి ఉంటే స్టీరియో ఎఫెక్ట్ ఉండేది. K5 ప్లస్ AntVR హెడ్ సెట్ తో VR ప్లే ను సపోర్ట్ చేస్తుంది.
కెమేరా సేన్సార్స్ విషయానికి వస్తే వెనుక 13MP omnivision OV13850 సెన్సార్ కలిగి ఉంది. మొదటి ఇంప్రెషన్స్ లో ఇమేజ్ క్వాలిటీ డీసెంట్ గా ఉంది dim లైటింగ్ లో. అయితే రివ్యూ చేస్తేనే కంప్లీట్ డిటేల్స్ తెలుసుకోవటానికి అవుతుంది. ఫ్రంట్ లో ఉన్న 5MP లో beautify వంటి ఫీచర్స్ ఉన్నాయి.
2750 mah బ్యాటరీ ను రెప్లేస్ చేయవచ్చు. అంటే బ్యాటరీ ను బయటకు తీయగలరు. దీనిపై కూడా లోతుగా టెస్ట్ చేయకుండా స్టేట్ మెంట్ ఇవటం కరెక్ట్ కాదు.
Conclusion ఏంటంటే లెనోవో vibe K5 ప్లస్ సబ్ 10K బడ్జెట్ సెగ్మెంట్ లో కచ్చితంగా టాప్ 3 ఫోన్స్ లో ఉండే కంటెంట్ కనిపిస్తుంది. అయితే ఇది రివ్యూ చేస్తే కాని కన్ఫర్మ్ గా చెప్పలేము.