LeEco(గతంలో LeTV) బ్రాండ్ నుండి నిన్న రెండు మోడల్స్ రిలీజ్ అయ్యాయి ఇండియాలో. ఒకటి Le మాక్స్ మరొకటి 1S. కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో చదవగలరు.
ఇక్కడ Le మాక్స్ యొక్క మొదటి అభిప్రాయాలు తెలుసుకుందాము.. రెండు మోడల్స్ డిజిట్ టెస్ట్ లాబ్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం Le max ఫర్స్ట్ ఇంప్రెషన్స్ చూడండి..
ముందుగా le మాక్స్ 6.33 స్క్రీన్ వలన చేతిలో పట్టుకున్న వెంటనే చాలా పెద్దది గా ఉంటుంది.అంతా మెటల్ ఉండటం వలన HTC మాదిరి ప్రీమియం ఫోన్ వలె ఉంటుంది. డిస్ప్లే చాలా షార్ప్ గా ఉంది 2K రిసల్యుషన్ కారణంగా. కలర్ బ్యాలన్స్ మరియు వ్యూయింగ్ angle కూడా బాగున్నాయి. కాని ఫుల్ బ్రైట్ నెస్ మాత్రం ఉండవలసినంత బ్రైట్ గా లేదు. dim అనిపిస్తుంది. టచ్ రెస్పాన్స్ మాత్రం బెస్ట్ టచ్.
LeEco సొంతంగా కొత్త custom UI ఇస్తుంది. దీని పేరు eUI. చాలా వరకూ రెస్పాన్స్ బాగుంది. స్మూత్ అండ్ ఫాస్ట్ UI. SoC స్నాప్ డ్రాగన్ 810 హీటింగ్ issues ను తెవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతుంది కంపెని. అలాగే మేము వాడినంత సేపు ఎక్కడా హిటింగ్ అనేది లేదు.
4GB ర్యామ్ అండ్ 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉండటం వలన ఎలాంటి అవసరాలు ఉన్న మొబైల్ users కు అయినా ఇది మంచి డివైజ్. 21MP రేర్ కెమెరా ఫాస్ట్ గా క్లిక్ చేస్తుంది పిక్స్ ను. ఇమేజెస్ కూడా బాగున్నాయి. ఫ్రంట్ లో 4MP అల్ట్రా పిక్సెల్ ఉంది. అల్ట్రా పిక్సెల్ కెమెరా తో వస్తున్న మొదటి Non HTC ఫోన్ ఇదే.
కెమెరా క్రింద ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా బాగుంది. ఆడియో లౌడ్ నెస్ usual గా ఉండే లౌడ్ కన్నా ఎక్కువుగా ఉంది. బాగుంది. Hi-Fi ఆడియో ను ఇచ్చేలా కంపెని AKG తో పార్టనర్ షిప్ కుదుర్చుకుంది.
LeEco చైనా లో టీవీ కంటెంట్ ను stream చేయటంతో మొదలయ్యింది. ఇండియాలో కూడా ఇప్పుడు వీడియోస్ ను అందించేందుకు Eros మరియు YuppTV ఇండియన్ సర్వీసెస్ తో ఒప్పందాలు కుదుర్చుకుంది.
అంటే Le Eco ఫోన్స్ కొన్నవాళ్ళు ఒక సంవత్సరం పాటు ఫ్రీ గా సినిమాలు చూడగలరు వీటిపై. అంతా బాగుంది కాని కంపెని దీని ధరను బాగా ఎక్కువ చేసింది. 32,999 రూ ఉన్నా ఇది oneplus 2 తో సిమిలర్ గా ఉంది. రెండూ ఒకటే స్పెక్స్ ఇవకపోవచ్చు కాని కంపేర్ చేయవచ్చు. Le మాక్స్ కన్నా oneplus 2 value for money అని చెప్పాలి. కంప్లీట్ రివ్యూ కొరకు వెయిట్ చేయండి.