అవును నిజమే! రిలయన్స్ Jio సిమ్ ఇప్పుడు అన్ని 4G ఫోన్ల పై పనిచేస్తుంది
ఉదయం నుండి రకరకాల సైట్స్, టీవీ మరియు పేపర్స్ లో మీరు ఇప్పటికే విని ఉంటారు దీని గురించి. సో ఇక్కడ డిజిట్ తెలుగు రీడర్స్ కు ఆ కన్ఫ్యూషన్ తీసివేయటానికి ఈ ఆర్టికల్. అవును రిలయన్స్ Jio సిమ్ మరియు Unlimited కాల్స్ అండ్ 4G ఇంటర్నెట్ Jio preview ఆఫర్ అన్ని 4G స్మార్ట్ ఫోనులపై పనిచేస్తుంది.
కంపెని ఆగస్ట్ 20 నుండి ఈ అవకాశం అందిస్తుంది. ఆల్రెడీ గతంలో సిమ్ తీసుకోవటానికి ఏమి చేయాలి ఏలా చేయాలి ఎటువంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి, ఏ స్టోర్స్ లో చేయాలి అనే విషయాలు ఈ లింక్ లో తెలపటం జరిగింది.
అయితే ఈ సారి డైరెక్ట్ గా ఒక ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్ xerox పట్టుకొని వెళ్లి సబ్మిట్ మీ దగ్గరిలో ఉన్న రిలయన్స్ అఫీషియల్ స్టోర్స్ లో సబ్మిట్ చేస్తే సిమ్ ఇస్తారు.
మీరు దానితో పాటు alternative నంబర్ గా మీ కరెంట్ నంబర్ ఇస్తే, దానికి సిమ్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయ్యింది అని మెసేజ్ వస్తుంది. తరువాత ప్రూఫ్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే సిమ్ కూడా యాక్టివేట్ అయ్యింది అని sms వస్తుంది.
ఇప్పుడు పై లింక్ లో చెప్పినట్లు గా Jio యాప్స్ అన్నీ ఇంస్టాల్ చేసుకుంటే మీ సిమ్ లో 4G 2GB free ఇంటర్నెట్ డేటా వస్తుంది. నెక్స్ట్ 1977 నంబర్ కు కాల్ చేసి unlimited ఆఫర్ గురించి అడిగితే, 3 నెలలు వరకూ unlimited 4G ఇంటర్నెట్ అనేది వస్తుంది.
అన్ని ఫోనులు అంటే exception లేకుండా అన్ని ఫోనుల్లో పనిచేస్తుందా?
కొన్ని స్టోర్స్ లో లెనోవో ఫోనుల్లో ఈ రోజుకు యాక్టివేషన్ కోడ్ అనేది ఇబ్బందిగా ఉన్నట్లు రిలయన్స్ సిబ్బంది తెలిపారు. అది కూడా రెండు రోజుల్లో సాల్వ్ అవుతుని అన్నారు. అయితే ఇది మిగిలిన స్టోర్స్ లో ఇబ్బంది గా ఉండకపోవచ్చు. ఇతర స్టోర్స్ లో పనిచేసే అవకాశం కూడా ఉంది. సో ట్రై చేయండి స్టోర్ కు వెళ్లి.