రిలయన్స్ Jio అనే పేరుతొ true 4G స్పీడ్స్ తో ఇండియాలో ఫిజికల్ గా అన్నీ సెట్ చేసుకుంది. కాని కమర్షియల్ గా ఇంకా లాంచ్ చేయటం లేదు అందరికీ. కంపెని స్టార్ట్ చేసిన LYF స్మార్ట్ ఫోనులను అమ్మటానికి మార్కెటింగ్ స్ట్రాటజీ తో కంపెని కేవలం LYF ఫోనుల పైనే Jio సిమ్ పనిచేసే విధముగా నియమాలను పెట్టింది.
అసలు Jio కు ఎందుకు ఇంత పాపులారిటీ?
కంపెని preview offer పేరుతో మూడు నెలల పాటు unlimited 4G ఇంటర్నెట్ మరియు కాల్స్, sms ను అందిస్తుంది. ఇందుకే! అయితే ఇది VoLTE సపోర్ట్ ఉన్న ఫోనుల పైనే పనిచేస్తుంది. LYF అన్ని ఫోనుల్లో VoLTE సపోర్ట్ ఉంది. VoLTE అంటే వాయిస్ ఓవర్ 4G LTE ఇంటర్నెట్ కనెక్షన్. ఈ మూడు నెలలు తరువాత ఎలా ఉంటాయి ఆఫర్స్ అనే దానిపై కంపెని ఇంకా స్పష్టమైన సమాచారం తెలపలేదు.
అసలు Jio సిమ్ ను ఎన్ని విధాలుగా తీసుకోగలము?
అఫీషియల్ గా Jio సిమ్ ను కేవలం LYF ఫోనులు మరియు సామ్సంగ్ selected ఫోనుల పైనే పనిచేస్తుంది. అంతే! మరే ఇతర ఫోనులపై అఫీషియల్ గా పనిచేయదు సిమ్. సిమ్ పనిచేయకపోతే ప్రివ్యూ ఆఫర్ కూడా పనిచేయదు!
Unofficial గా ఆ మధ్య Jio యాప్ లో యాక్టివేషన్ అన్ని ఫోనులకు అయ్యింది. ఇది యాప్ లోని bug(ప్రాబ్లెం). ఆ టైం లో కొంతమంది యాప్ లో ప్రివ్యూ ఆఫర్ కోడ్ ను యాక్టివేట్ చేసుకొని, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ కు వెళ్లి సిమ్ తెచ్చుకోవటం జరిగింది. కాని కంపెని యాప్ లో bug ను solve చేసి ఈ మెథడ్ ను పూర్తిగా నిలిపివేసింది ఇప్పుడు.
ఎన్ని స్టోర్స్ లో కి Jio కు సంబందించిన హెల్ప్/యాక్టివేషన్ అందుతుంది?
సరే లీగల్ గా Jio సిమ్ ఎలా తీసుకోవాలి? ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అఫీషియల్ గా?
1. LYF ఫోన్ కొనటం ద్వారా
సింపుల్ మెథడ్ – Direct గా రిలయన్స్ స్టోర్స్ కు వెళ్లి LYF కొనండి. మీకు ఫోన్ తో పాటు సిమ్ కూడా వస్తుంది. సిమ్ యాక్టివేట్(ఎలా చేయాలో క్రింద చూడగలరు) అయిన తరువాత, ప్రివ్యూ ఆఫర్ ను క్రింద చెప్పిన విధంగా యాక్టివేట్ చేయగలరు.
టిపికల్ మెథడ్ – ఈ లింక్ లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వండి. మీకు రెండు రోజులలో ఇన్విటేషన్ కోడ్ వస్తుంది. దీనికి expiry డేట్ ఉంటుంది. expiry అయ్యే లోపు మీ దగ్గరి లో ఉన్న స్టోర్ కు క్రింద తెలిపిన డాకుమెంట్స్ పట్టుకొని, డైరెక్ట్ గా రిలయన్స్ స్టోర్స్ కు వెళ్లి LYF ఫోన్ కొని Jio సిమ్ ను పొందగలరు. ఇదే ప్రాసెస్ రిలయన్స్ ఉద్యోగి వద్ద రిఫరెన్స్ కోడ్ తీసుకోని, ఆ కోడ్ పట్టుకొని స్టోర్ కు వెళ్లి LYF ఫోన్ కొని, Jio సిమ్ ను తీసుకోగలరు.
2. సామ్సంగ్ ఫోన్ ద్వారా కూడా Jio కనెక్షన్ వస్తుంది.
అయితే ప్రివ్యూ ఆఫర్ selected VoLTE సపోర్ట్ ఉన్న సామ్సంగ్ ఫోన్స్ మరియు selected సిటీస్ లోనే అందుబాటులో ఉంది. ఫోన్స్ లిస్టు క్రింద చూడగలరు..
పైన చెప్పినట్లు గా VoLTE సపోర్ట్ తో ఉన్న LYF లేదా సామ్సంగ్ ఫోనులు వాడుతున్నట్లు అయితే ఈ విధంగా Jio సిమ్ ను తిసుకోగలరు:
ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుండి ఈ ఈ లింక్ లో దొరికే My Jio యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, మీ లొకేషన్ లో ప్రివ్యూ ఆఫర్ ఉందా లేదా check చేసుకోవాలి యాప్ సహాయంతో. ఉంటే కనుక మీకు ఆఫర్ కోడ్ వస్తుంది. ఇప్పుడు ఈ కోడ్ తో పాటు క్రింద తెలిపిన డాకుమెంట్స్ ను పట్టుకొని రిలయన్స్ స్టోర్స్ కు వెళ్లి Jio సిమ్ ను కలెక్ట్ చేసుకోగలరు.
సరే సిమ్ వచ్చింది. ఇప్పుడు దీనిని ఎలా యాక్టివేట్ చేయాలి?
సిమ్ ను అఫీషియల్ గా supporting ఉన్న ఫోనులో వేసిన తరువాత ఫోన్ లో డైల్ పాడ్ ఓపెన్ చేసి 1977 అనే నంబర్ కు కాల్ చేసి verify చేసుకోవాలి.
సిమ్ యాక్టివేట్ అయ్యింది. ఇప్పుడు 3 నెలలు unlimited ఇంటర్నెట్ అండ్ కాలింగ్ ప్రివ్యూ ఆఫర్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
My Jio యాప్ లోకి వెళ్లి దాని లోపల ఇతర Jio యాప్స్ లిస్టు ఉంటాయి. వాటిని కూడా ఇంస్టాల్ చేయండి ఫోన్ లో. ఇప్పుడు మీకు SMS మరియు ఈమెయిలు ద్వారా యాక్టివేషన్ అయినట్లు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అంతే! ఇదే కాకుండా MY Jio యాప్ లో కూడా యాక్టివేషన్ స్టేటస్ చెక్ చేయగలరు.
అఫీషియల్ గా సిమ్ తీసుకునే వారు సబ్మిట్ చేయవలసిన డాకుమెంట్స్ ఏంటి?
అడ్రెస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.. కొత్త సిమ్ కు కంపెని 200 రూ తీసుకునే అవకాశం ఉంది.
సామ్సంగ్ ఫోనుల్లో పైన చెప్పిన Jio సిమ్ కు సంబందించిన ఇన్ఫర్మేషన్ కొరకు ఇంగ్లిష్ లో కంపెని సైట్ లో ఈ లింక్ లో చదవగలరు.
డిజిట్ రీడర్స్ కొరకు ఇంపార్టెంట్ టిప్:
మీరు ఆఫర్ కోసం కొత్త LYF ఫోన్ లేదా కొత్త supporting సామ్సంగ్ ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే..ముందుగా మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లో (ఏదైనా ఫర్వాలేదు) My Jio యాప్ ను (లింక్) ను ఇంస్టాల్ చేసి, మీ ఏరియా లో ప్రివ్యూ ఆఫర్(3 నెలల unlimited ఆఫర్) పనిచేస్తుందో లేదో తెలుసుకొని కొత్త ఫోన్ కొనటం బెటర్.
మీ వద్ద ఉన్న VoLTE 4G స్మార్ట్ ఫోన్ లో My Jio యాప్ ను ఇంస్టాల్ చేసుకున్నా, Jio ఫోన్ నంబర్ లేదా కస్టమర్ id ఆగుతుంది. పైన చెప్పిన ఇన్విటేషన్ ద్వారా వచ్చే కోడ్ ఇక్కడ పనిచేయదు. సో మరే ఇతర ఫోనుల్లో Jio పనిచేయటం లేదు. ఎందుకంటే సపోర్ట్ చేసే ఫోన్ పై డైరెక్ట్ గా GET JIO SIM అనే ఆప్షన్ కనిపిస్తుంది. unsupported యాప్ లో డిఫరెంట్ గా పనిచేస్తుంది.
అయినా సరే కాని ఒకసారి try చేద్దామని అనుకేవారు.. మీ వద్ద LYF లేదా సామ్సంగ్ ఫోన్ లేకపోయినా ఈ లింక్ (పైన ఇదే లింక్ తెలపటం జరిగింది) లోకి వెళ్లి క్రిందకు స్క్రోల్ చేసి రిజిస్టర్ అయిన తరువాత మెయిల్ కు వచ్చే కోడ్ ను స్టోర్స్ కు తీసుకు వెళ్లి టెస్ట్ చేసుకోండి మీ అదృష్టం. అయితే కంపెని మాత్రం ఇలాంటివి సందర్భాలు రాకుండా ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంది.