iRist స్మార్ట్ వాచ్: First Impressions
work in progress లాంటి అవుట్ పుట్ ఇస్తుంది. కంపెని కూడా కొన్ని బ్యాడ్ నిర్ణయాలను అమలుపరచింది
Shanghai లో జరుగుతున్న Mobile World Conference లో ఇంటెక్స్ iRist స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ లోని అప్ డేట్స్ ను డిజిట్ రీడర్స్ కు అందించాలని మేము Shanghai ఈవెంట్ లో పాల్గొన్నాము. ఇంటెక్స్ స్మార్ట్ వాచ్ ను మొదటి సారిగా మేము దానితో గడిపిన ఎక్స్పీరియన్స్ ద్వారా iRist ఫస్ట్ impressions ను ఇక్కడ తెలుసుకోగలరు.
సాదారణంగా ఇప్పటి వరకూ వచ్చిన స్మార్ట్ వాచ్ లన్నీ ఆండ్రాయిడ్ wear మీద పనిచేసేవి, కాని ఇది మాత్రం డైరెక్ట్ ఆండ్రాయిడ్ మీదనే పనిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇందులో సిమ్ ఇంబిల్ట్ గా వాడుకోవటానికి కంపెని ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ను రన్ చేస్తుంది ఇందులో. ఆండ్రాయిడ్ wear os లో అయితే సిమ్ సపోర్టింగ్ ప్రస్తుత వెర్షన్స్ లో లేదు. ఇంటెక్స్ ఇందులో వాట్స్ అప్ లాంటి యాప్స్ పనిచేస్తున్నాయని అని చెప్పింది కానీ నిజంగా 0.5 in కీ బోర్డ్ కలిగిన స్మార్ట్ వాచ్ లో టైపింగ్ ఎవరు చేస్తారు చెప్పండి. ఫోన్ వెర్షన్ లోని కిట్ క్యాట్ మాదిరిగానే ఇందులోని కిట్ క్యాట్ కూడా ఉంది కాని యాప్ డ్రాయర్ లేదు. నోటిఫికేషన్లు క్విక్ సెట్టింగ్స్ కోసం డౌన్ స్వైప్ ఉంది. కాని ఇంత చిన్న స్క్రీన్ పై ఈజీ యూసేజ్ కు అనుగుణంగా కంపెని ఎటువంటి modified ఆప్షన్స్ ను జోడించలేదు. ఇందులో ఇంటెక్స్ గూగల్ వాయిస్ అసిస్టంట్ కు బదులు కంపెని సొంత వాయిస్ అసిస్టంట్ ను వాడుతుంది.
దీనిలోని ముఖ్యమైన మంచి విషయం ఏంటంటే ఇది Standalone డివైజ్ గా పనిచేస్తుంది.అంటే దీనిని స్మార్ట్ ఫోన్ లాగ వాడుకోవచ్చు. అయితే ఇది నిజంగా స్మార్ట్ ఫోన్ ను రిప్లేస్ చేయగలదా అంటే సమాధానం ఉండదు. ఫోనులో కాకుండా దీని నుండి కాల్ చేసే వారు ఉండవచ్చు ఏమో కాని దీని నుండి texting చేసుకునే వారు ఉండకపోవచ్చు. ఇంటెక్స్ కొన్ని బేసిక్ అవసరాల కోసం యాప్స్ ను కూడా సొంతగా తయారు చేసింది దీని కోసం.
స్మార్ట్ వాచ్ అనేది చేతికి పెట్టుకొని అందరికీ కనపడేటట్లు ఉంటుంది కాబట్టి యూజర్స్ లుక్స్ పరంగా బాగుండాలని అనుకుంటారు. ఈ విషయాలో మోటో 360 సక్సెస్ అయ్యింది. కాని iRist నాణ్యత లేని దాని వలె వెడల్పుగా అనిపిస్తుంది మందం లో. రెగ్యులర్ రబ్బర్ straps తో గ్లాసీ ప్లాస్టిక్ వాడారు ఇందులో. ఓవర్ ఆల్ గా కంపెని మంచి బిల్ట్ డిజైన్ లో లేదు అనిపిస్తుంది దీని కాంపిటేటర్స్ తో పోలిస్తే. అయితే గతంలో మన ఇండియన్ కంపెని spice smart pulse పేరుతో ఇలాంటి వాచ్ మోడల్ ను 4,999 రూ లకే లాంచ్ చేసింది. ఇంటెక్స్ కూడా అదే మాదిరి కాన్సెప్ట్ తో వచ్చింది కాని MWC లో పాల్గొని అందరి attention ను తెచ్చుకునే ప్రయతం చేసింది. అయితే spice వాచ్ 5K లకే వర్క్ అవుట్ కాకపోతే ఇంటెక్స్ వాచ్ 11,999 రూ ఎందుకు వర్క్ అవుట్ అవుతుంది అనేదానికి జవాబుగా iRist లో ఏమీ లేదు. అయితే సొంతగా యాప్స్ తయారీ చేయటం కొత్త యూజర్ ఇంటర్ఫేస్ రన్ చేయటం చూస్తుంటే ఇంటెక్స్ దీని పై ఫ్యూచర్ లో ఎక్కువ శ్రద్ధ పెట్టి సపోర్ట్ ఇచ్చేలా కనిపిస్తుంది. డెవలప్మెంట్ పై పనిచేస్తేనే కాని iRist సక్సెస్ అయ్యే చాన్స్లు లేవు.
ఇందులోని 5MP కెమేర పేపర్ స్పెక్స్ చదవటానికి మంచి విషయం లా ఉంది అలాగే చేతికి కెమేరా ను తగిలించుకొని వాడితే ఎలా ఉంటుంది అనే curiosity కు తగ్గట్టుగా రియల్ గా అంత గ్రేట్ ఎక్ష్పిరియన్స ను ఇవ్వటంలేదు. దీనితో బ్లూ టూత్ వస్తుంది కాల్స్ మాట్లాడుకోవటానికి. అయితే ఓవర్ ఆల్ గా కంపెని నమ్మిన standalone స్మార్ట్ వాచ్ కాన్సెప్ట్ రియల్ టైం లో యూజర్స్ కు ఎక్కువ ఫ్లెక్సిబుల్ యూసేజ్ ను ఇవ్వదు అని మా నమ్మకం.