మీ ఐ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి iCloud అనే ఆప్షన్ లోకి వెళ్లి Find My iPhone ను ఓపెన్ చేయండి.
ఇప్పుడు దానితో పటు Send Last location functionalities ను కుడా on చేయండి.
ఇప్పుడు మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Privacy సెట్టింగ్స్ లో ఉన్న Location Services లోకి వెళ్ళాలి.
ఇక పోయిన మీ ఐ ఫోన్ ను వెతకటానికి మరొక ఆపిల్ డివైజ్ లేదా www.icloud.com అనే సైట్ లోకి వెళ్లి Find My iPhone ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ మీ పోయిన ఐ ఫోన్ మోడల్ ను సెలెక్ట్ చేసుకుంటే అది ప్రస్తుతం ఎక్కడ ఉంది అనేది మాప్స్ లో చూపిస్తుంది.
అంతేకాదు, ఇంకా ఆ ఫోన్ ను లాక్, అలారం సౌండ్ ఆన్ మరియు ఫోన్ డేటా డిలిట్ చేసుకునే ఆప్షన్స్ ఇస్తుంది.
వీటి కారణంగా పోయిన ఫోన్ మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం కుదరకపోయినా, కనీసం ఫోన్లోని ప్రైవేటు డేటా ను డిలిట్ చేయగలరు.
గతంలో ఆండ్రాయిడ్ ఫోన్ గురించి కూడా పొతే ఎలా తెచ్చుకోవాలి అని తెలపటం జరిగింది. ఈ లింక్ లో చూడగలరు. అలాగే ఆండ్రాయిడ్ లో బెస్ట్ antitheft యాప్ గురించి తెలుసుకోవటానికి ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.