మీకు ఏ స్మార్ట్ ఫోన్ కొనాలో అర్థం కావటం లేదా? ఈ ఆర్టికల్ మీకు అన్ని నేర్పుతుంది.

Updated on 24-Jun-2016
HIGHLIGHTS

మీరు తెలుసుకోవలిసిన స్మార్ట్ బయింగ్ టిప్స్

వారానికి పది మోడల్స్ దిగుతున్న ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో, ఫోన్ కొనటం అంటే అంత ఈజీ విషయం కాదు. బయట ఉన్న అనేక రకాల బ్రాండ్ మోడల్స్ లలో ఏ ఫోన్ తీసుకోవాలో కంఫుజన్ చాలా ఉంటుంది. మాకు చాలా మంది “ఏ ఫోన్ తీసుకోవాలి?”, “ఈ బడ్జెట్ లో ఏ ఫోన్ బాగుంది?” లేదా “లేటెస్ట్ గా లాంచ్ అయిన సో కాల్డ్ ఫోన్ నేను తీసుకుందామని అనుకుంటున్నాను, దాని మీద మీ సలహా చెప్పండి?” అనే ప్రశ్నలు వేస్తున్నారు. ఇది స్మార్ట్ ఫోన్ కొనే వారికి How to Buy Guide లాంటిది. మాకు వస్తున్న ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని డిజిట్ రీడర్స్ కోసం వ్రాస్తున్న ఆర్టికల్. జనరల్ డౌట్స్ కాకుండా ఈ గైడ్ లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే క్రింద కామెంట్స్ లో అడగండి.

ముందుగా “ఏ ఫోన్ కొనాలి? లేదా ఏలాంటి ఫోన్ కొనాలి?” అనే ప్రశ్నకర్కెట్ కాదు. ఆ ప్రశ్నకు అర్థం లేదు. ఎందుకంటే మనం డైలీ ఫోన్ తో ఎటువంటి పనులు చేస్తామో అవతల వ్యక్తి కి తెలియదు. వాళ్ల చేసే పనులకు తగ్గట్టుగా వాళ్లు చెప్పిన ఫోను మీరు కొనటం వలన మీరు వాడని ఫీచర్స్ కోసం డబ్బులు పెట్టి ఫోన్ కొనటం వంటిది. చాలా మంది లేటెస్ట్ కాస్ట్లీ ఫోన్లను కొంటారు కాని వాటిలో 60 to 70 పర్సెంట్ ఫీచర్స్ ను వాడరు.

సో దీనికి సల్యుషణ్ ఏంటి?
మీరు డైలీ ఫోన్ తో ఏమి చేస్తారు? ఎంత సమయం గడుపుతారు? ఎలాంటి అవసరాలు మీకు ఫోన్ తో ఉన్నాయి. మీరు నిజంగా ఫోటోలను డైలీ ఇష్టంగా తీసుకుంటారా? వీడియో రికార్డింగ్ చేస్తారా? చేస్తే రోజుకి ఎన్ని సార్లు చేస్తారు? GPS మరియు గూగల్ మ్యాప్స్ వంటివి వాడతారా? పెద్ద పెద్ద గేమ్స్ ను ఆడతారా? 3G ఇంటర్నెట్ కాని, వైఫై కాని లేటెస్ట్ 4G కాని వాడతారా? మీరు వాడుదామని అనుకున్నా అసలు 4G వాడటానికి ప్రాక్టికల్ గా ఇప్పట్లో జరిగే పని కాదు. అది మనం వాడగలిగే అంత అనుకూల మైన situations వచ్చేటప్పటికి ఇప్పుడున్న మొబైల్ అప్పటి వరకూ ఉండదు. ఈ లోపే మార్చి వేస్తారు. ఈ ప్రశ్నలు వేసుకొని ఒక పేపర్ మీద వ్రాసుకొని, కొనే టప్పుడు మీరు ఫోన్ తో చేసే పనులు ఏంటో చూసుకొని ఫోన్ కొంటే, మిమ్మల్ని మించిన టెక్నాలజీ మాస్టర్ మరొకరు లేరు, మీరు వేరే వారిని అడగనవసరం లేదు, వాడని ఫీచర్స్ కు డబ్బులు ఖర్చు పెట్టే  వందల మంది లిస్టు లో మీరు లేకుండా ఉన్నారు అని గర్వంగా ఫీల్ అవచ్చు.. అన్నిటికీ మించి టెక్నాలజీ పై ఒక గ్రిప్ సాదించగలరు. మీరు అనుకునే చాలా మంది ఆన్ లైన్ టెక్ గురుస్ కూడా సెల్ఫ్ ఇంటరెస్ట్ తో నాలెడ్జ్ సంపాదించిన వారే. ఇప్పుడు మీకు ఏది అవసరమో ఒక స్పష్టత ఏర్పడి ఉంటుంది కదా…

స్పెసిఫికేషన్స పరంగా స్మార్ట్ ఫోన్ ఎలా చూస్ చేసుకోవాలి?
చాలా ఫాస్ట్ గా మారుతున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్ తో పాటు అంతే ఫాస్ట్ గా స్మార్ట్ ఫోన్ యొక్క టెక్నాలజీ కూడా మారుతుంది. సో ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ లో నిర్ణయాలు తీసుకోవటం కష్టం కాని కొన్ని స్మార్ట్ టిప్స్ ద్వారా సరైన ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫర్ eg 2014 లో రిలీజ్ అయిన మోటో X(1st Gen) ఇప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా దర్జాగా వాడుకోవచ్చు. అయితే దాని ఒరిజినల్ ధర లో సగానికి వస్తేనే కాని మోటో x ను కొనకూడదు, ఎందుకంటే, దాని కన్నా లేటెస్ట్ వెర్షన్స్ తో(సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్) కొత్త మోడల్స్ తక్కువ ధరకి దొరుకుతున్నాయి కాబట్టి. ప్రధానంగా ఫోన్ కొనేముందు కన్సిడర్ చేయవలిసిన టెక్నికల్ విషయాలు..

ప్రొసెసర్
,అది కంపూటర్ అయినా, స్మార్ట్ ఫోన్ అయినా ఫోన్ టెక్నికల్ విషయాలలో ముందుగా ప్రియారిటీ ఇవ్వవలిసినది ప్రొసెసర్ కి. ప్రస్తుత మార్కెట్ ప్రకారం మినిమమ్ క్వాడ్ కోర్ ప్రొసెసర్ ఉండాలి. డ్యూయల్ కోర్ ప్రాసెసర్స్ అవుట్ డేటెడ్ అయ్యాయి. అయితే ఆపిల్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్లు మరియు ఇంటెల్ హైపర్ థ్రెడెడ్ ప్రాసెసర్లు మాత్రం ఇంకా అవుట్ డేటెడ్ లిస్టు లోకి రావు. వాటికి పవర్ ఎక్కువ.  ఒక ప్రొసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ ను అంచనా వేయటానికి, అదే ఫోన్ కొన్న వారు ఆన్ లైన్ సైట్లలో రివ్యూస్ వ్రాస్తారు. వాటిని చూసి తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రివ్యూస్ ను ఇవ్వటానికి డిజిట్ లాంటి చాలా నమ్మదగిన వెబ్ సైట్లు ఉన్నాయి. వాటిని సందర్శిస్తే మీ మొబైల్ ప్రొసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ రివ్యూస్ ను మీరు తెలుసుకోగలరు. అయితే మీకు కావలిసిన స్మార్ట్ ఫోన్ రివ్యూ దొరకనప్పుడు, అదే ప్రొసెసర్ కలిగి ఉన్న వేరే మొబైల్ తో దీనిని కంపేర్ చేసుకొని కావలిసిన ఇన్ఫర్మేషన్ ను పొందగలరు.

ఫర్ eg మీరు Xiaomi Mi 4i కొనాలని అనుకుంటున్నారు, అందులోని స్నాప్ డ్రాగన్ 615 SoC వేరే ఏ ఫోనులో ఉందో తెలుసుకొని దాని పెర్ఫార్మెన్స్ రివ్యులను మ్మత్రమే చదవండి, ఇతర(డిస్ప్లే, కెమెరా) రివ్యూ ను చూడకండి. ఎందుకంటే  మీకు కావలిసినది కేవలం ప్రొసెసర్ గురించి మాత్రమే. ఇతర విషయాలు చుస్తే ఆ ప్రొసెసర్ మంచిది అయినప్పటికీ మిగిలిన విషయాలలో ఆ ఫోన్ బ్యాడ్ అయితే ప్రొసెసర్ పై కూడా మీరు ఆటోమేటిక్ గా బ్యాడ్ ఒపినియన్ తెచ్చుకుంటారు. అయితే ఈ విధంగా చేసినప్పుడు మీరు కంప్లీట్ గా Xiaomi Mi 4i ప్రొసెసర్ గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడదు, కాని మీకు చాలా వరకూ రిలేటివ్ విషయాలు తెలుస్తాయి. అలాగే ఇప్పుడు మీకు నచ్చే విషయాలు రెండు ఉన్నాయి కాని అవి రెండు వేర్వేరు ఫోనులలో ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఆ రెండింటిలో డైలీ యూసేజ్ లో దేనిని ఎక్కువుగా వాడతారో దానిని ప్రిఫర్ చేసుకోవటం అనేది స్మార్ట్ బయింగ్.

ర్యామ్
మీ ఫోన్ ఫాస్ట్ గా పనిచేసేందుకు మరొక ప్రధానమైన కారణం ర్యామ్. మీరు ఎక్కువుగా పెద్ద పెద్ద గ్రాఫిక్స్ కలిగిన గేమ్స్ మరియు అధిక సంఖ్యలో యాప్స్ ను నిరంతరం ఆడుతూ, వాడుతూ ఉంటారా? అయితే మినిమమ్ 3 జిబి ర్యామ్ తీసుకోండి. లేదు కేవలం లిమిటెడ్ యాప్స్ తో ఎవరేజ్ వాడకం చేసే వారికైతే 2 జిబి ర్యామ్ సరిపోతుంది. మరీ బేసిక్ user (అంటే కేవలం ఫోన్స్, వాట్స్ అప్) అయితే GB ర్యామ్ సరిపోతుంది. కేవలం పవరఫుల్ ప్రొసెసర్ ఉండి, దానికి మినిమమ్ ర్యామ్ లేకపోతే, పెర్ఫార్మెన్స్ ఉండదు ఫోనులో. రెండు జత కలిస్తేనే. అయితే ఇక్కడ మీరు ఎటువంటి స్మార్ట్ ఫోన్ యూజర్ అనేది దానిపై ముఖ్యంగా పరిగణించాలి. ఎందుకంటే చాలా మంది 20,000 వేలు నుండి  50,000 పెట్టి ఫోనులు కొని కేవలం సింపుల్ కాలింగ్,  Whatsapp మెసేజింగ్, ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్కింగ్ తప్పితే ఇంకేమి చేయరు. తరువాత ఒక సంవత్సరం లోపే ఫోన్ మార్చాలని అనిపిస్తాది కాని ఎక్కువ ఖరీదు పెట్టి కొనటం వలన అంత సులువుగా మార్చలేరు.

డిస్ప్లే
మినిమమ్ HD రిసల్యుషణ్ ఉంటే రిచ్ గా ఉంటుంది. పిక్సెల్ రిసల్యుషణ్ బాగుంటే, డిస్ప్లే క్వాలిటీ గా ఉంటుంది. మీరు కొనేముందు ఆ ఫోన్ డిస్ప్లే గురించి కూడా రివ్యుయర్స్ ద్వారా లేదా యూజర్ రివ్యూస్ ను బట్టి తెలుసుకోగలరు. కొన్ని బడ్జెట్ సెగ్మెంట్ (తక్కువ ధరలో) వచ్చే ఫోనులు HD రిసల్యుషణ్లు ఇచ్చి మిగిలిన బ్రైట్ నెస్, సన్ లైట్ విసిబిలిటి మరియు వ్యూయింగ్ ఏంగిల్స్ విషయాలలో కాంప్రమైజ్ అవుతున్నాయి కంపెనీలు. అందుకని డిస్ప్లే విషయంలో కచ్చితంగా రివ్యూస్ మీద ఆధార పడటం చాలా మంచిది. sunlight visibility ను important గా పరిగణించాలి. ఎందుకంటే ఫోన్ బయట డైరెక్ట్ సన్  లైట్ లో వాడటం అనేది చాలా ఎక్కువ. సో ఎక్కువ శాతం వాడుక ఉంటే need లో ఫోన్ నిరాశ పరిస్తే కొన్న వెంటనే ఫోన్ లో అన్నీ  బాగున్నా disappoint అవుతారు.
 
ఆపరేటింగ్ సిస్టం
మీకు ఎక్కువ యాప్స్ కావాలా? అయితే ఆండ్రాయిడ్ బెస్ట్ OS. అసలు చెప్పాలి అంటే ఆండ్రాయిడ్ రికమెండెడ్ OS. ఫ్యూచర్ లో అయినా ప్రస్తుతం అయినా… ఒక వెబ్ సైటు కాని సర్విస్ కాని స్టార్ట్ అయితే, ముందుగా ఆ సర్విస్ యొక్క యాప్ ఆండ్రాయిడ్ లో కచ్చితంగా డెవలప్ అవుతుంది. విండోస్ మరియు ఐ os డెవలపింగ్ పర్సెంటేజ్ లోకల్ సర్వీసులకు తక్కువ. ఫర్ eg మీరు ఫోనులో తెలుగు టీవీ చూడటానికి అయినా, లేదా తెలుగు టైపింగ్ యాప్స్ అయినా ఆండ్రాయిడ్ లోనే ముందు డెవలప్ అవుతాయి. అంతే కాదు మీకు మనసులో ఉండే చాలా చిన్న చిన్న అభిరుచులకు తగ్గట్టుగా యాప్స్ కేవలం ఆండ్రాయిడ్ లోనే దొరుకుతాయి. విండోస్ యాప్ ఎకో సిస్టం కన్నా ఆండ్రాయిడ్ డి చాలా పెద్దది. ఐ os విషయానికి వస్తే అది ఇంటర్నేషనల్ యాప్ ఎకో సిస్టం కు ఎక్కువ టార్గెట్టింగ్ గా ఉంటుంది. రీజనల్ ఐ os డెవలపర్స్ కూడా తక్కువ.

బ్యాటరీ
మీరు ఎవరేజ్ యూజర్ అయితే ఫోన్ కు 2500 mah బ్యాటరీ సరిపోతుంది. పవర్ యూజర్(నిరంతరం ఫోన్ పట్టుకొని ఏదో ఒక పని చేయటం, గేమ్స్ ఆడటం) అయితే మినిమమ్ 3000 mah ఉండాలి బ్యాటరీ. అదీ ఫుల్  HD ఎమోలేడ్ వంటి హై క్వాలిటీ డిస్ప్లే మీ ఫోనుకు ఉంటే 3000 mah పైనే ఉండాలి బ్యాటరీ. వెరీ బేసిక్ యూజర్ అయితే 2000mah చాలు. మీరు జాబ్ చేస్తున్నారా. అయితే మీకు ఎక్కువ mah బ్యాటరీ అవసరమే ఉండదు, అవును! ఎందుకంటే మీరు 8 to 9 hours ఆఫీస్ వర్క్ లోనే ఉంటారు, ఆ సమయంలో ఫోన్ తో ఎటువంటి పని చేయరు మహా అయితే కేవలం మెసేజింగ్ మరియు కాల్స్ కొరకే వాడుతారు. అది కూడా చాలా లిమిటెడ్ యూసేజ్. ఇది వినటానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కాని ఈ లాజిక్ ను ఫోన్ కొనేటప్పుడు ఎవరు గుర్తుకు తెచ్చుకోరు. సో కేవలం బ్యాటరీ ఎక్కువగా లేదని మీరు ఇష్టపడే మంచి ఫోన్ ను వదిలి మీకు అవసరం లేని ఫీచర్ కోసం ఎక్కువ డబ్బులు పెట్టో లేదో అంతగా ఇష్టం లేని ఫోనునో లేదా స్టాండర్డ్ తక్కువ ఉన్న ఫోనునో కొంటారు.

ఇక్కడ చెప్పిన వాటిని ముందుగా పరిగణించి ఆ తరువాత కెమేరా, బిల్డ్ డిజైన్ మరియు ఫోన్ సైజ్ వంటి వాటిని మీ అభిరుచులకి తగ్గట్టుగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ మరియు అప్పటి టైం ప్రకారం కరెంట్ మార్కెట్ ట్రెండ్ బట్టి స్మార్ట్  ఫోనులని స్మార్ట్ గా కొనుక్కోవటమే స్మార్ట్ బయింగ్ లోని ప్రధానమైన విషయం. ఎప్పుడూ ఎక్కువుగా వాడబడే ఫీచర్స్ బాగా ఉన్నాయా లేదా అని కన్సిడర్ చేయాలి. ఫర్  eg: ఏ యూజర్ అయినా ఎప్పుడైనా ఏ ఫోన్ లో అయినా  కామన్ గా మరియు ఎక్కువుగా వాడబడే విషయాలు.. బ్యాటరీ, డిస్ప్లే. ఆ తరువాత కెమెరా(ఇది లాస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకంటే చాలా  కెమెరా ఫోన్ కొనాలని చాలా రీసెర్చ్  రోజులో ఒక్క సారి కూడా కెమెరా ను వాడారు).

స్టోరి ఆఫ్ బయింగ్ మై స్మార్ట్ ఫోన్ in 2015(ఆ తరువాత ఒక 6 ఫోనులు మార్చటం జరిగింది)
నేను ఒక పవర్ స్మార్ట్ ఫోన్ యూజర్ ను. నాకు 5 in స్మార్ట్ ఫోన్ కావాలి. కాని పెద్ద సైజు లో ఉండే ఫోనులు అంటే నాకు పర్సేనల్ గా నచ్చదు, కారణం అవి సింగల్ హ్యాండ్ తో వాడటానికి వీలు పడదు. పాకెట్ లో పెట్టుకోవటానికి కూడా పెద్దవి గా అనిపిస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ యామ్ యాంటి ఫర్ లార్జ్ స్క్రీన్ మొబైల్స్… అలా అని ప్రస్తుత ట్రెండ్ లో మినిమమ్ 5 in స్క్రీన్ లేకపోతే గేమింగ్ వంటివి ఆడటానికి అంత కంఫర్ట్ గా ఉండదు. సో నేను అతి తక్కువ ఓవర్ ఆల్ ఫోన్ బాడీ డైమెన్షన్ లలో, 5 in స్క్రీన్ తో ఏ బ్రాండ్ లో ఏ ఫోన్ దొరుకుతుందా అని కొన్ని నెలలు పాటు గూగల్ లో రీ సర్చ్ చేశాను, అలా కావలిసిన మొబైల్ ను కొన్నాను. 

ఇందులో 5in IPS LCD డిస్ప్లే (1080 X 1920) పిక్సెల్స్  , 13MP (4208 X 3120) పిక్సెల్స్ ఆటో ఫోకస్ LED ఫ్లాష్ బ్యాక్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా, 2జిబి ర్యామ్, క్వాడ్ కోర్ 1.5 GHz మీడియా టెక్ MT6589 Cortex A7 ప్రొసెసర్, ఆండ్రాయిడ్ Jelly Bean 4.2.2 OS, 2000 mah బ్యాటరీ ఉన్నాయి. ఇక్కడ నాకు కావలిసిన దానిని స్మార్ట్ గా ఆలోచించి నా అభిరుచికి తగ్గట్టుగా ఫోన్ కొనటం జరిగింది. ఇందులో లేటెస్ట్ ప్రొసెసర్ లేదు, లేటెస్ట్ డిస్ప్లే లేదు, లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS లేదు. అన్నిటికీ మించి ఫోన్ 2013 లో విడుదలైన అవుట్ డేటెడ్(ఇయర్స్ వైజ్ గా)  మోడల్, కాని నాకు తెలిసిన విషయం ఏంటంటే దానిలో లేటెస్ట్ స్పెక్స్ లేవు కాని కావలిసిన స్పెసిఫికేషన్స ఉన్నాయి. లేని వాటిని నా డైలీ లైఫ్ లో వాడను, ఆ సో కాల్డ్ లేటెస్ట్ వెర్షన్స్ మరియు స్పెసిఫికేషన్స ఉన్నా లేకున్నా నాకు వాటి వలన తేడా రియల్ లైఫ్ డైలీ యూసేజ్ లో కనపడదు, ఎందుకంటే స్లో పెర్ఫార్మెన్స్ లేదా లో క్వాలిటీ ఫోటోస్ etc వంటి మైనస్ లు రాకుండా మినిమమ్ స్పెక్స్ ఉన్న ఫోన్ తీసుకోవటం జరిగింది కాబట్టి. వాస్తవానికి అవి మినిమమ్ స్పెక్స్ కావు, 2015 లో ఫ్లాగ్ షిప్(హై ఎండ్ ఫోన్స్) మోడల్స్ లో వస్తున్న 13 MP కెమేరా మరియు 1080 X 1920 పిక్సెల్స్ డిస్ప్లే ఉన్నాయి దీనిలో. ఇవి కూడా నేను డైలీ గుర్తించగలిగే లేదా వాడబడే స్పెక్స్ కావు కాని ఇది హై ఎండ్ ప్రైసింగ్ లో లేదు. దీని ధర 8,999 రూ. సగానికి పైగా  తక్కువ ధరకు హై ఎండ్ స్పెక్స్ ఉన్నాయి దీనిలో. 

ఆండ్రాయిడ్ లాలి పాప్ ను గతంలో వాడాను. ప్రస్తుతం మార్ష్ మల్లో వాడుతున్నా. ఆండ్రాయిడ్ 5.0/6.0 కూ మరియు ఫోన్ కొన్నప్పుడు బాక్స్ తో పాటు వచ్చిన Jelly Bean 4.2.2 కు అసలు ఏంటి తేడాలు ను గూగల్ లో సర్చ్ చేశాను, ఫీచర్స్ పరంగా మనం యూజర్ గమనించేవి పెద్దగా లేవని తెలుసుకున్నాను(అవును, కావాలంటే మీరు కూడా గమనిచండి).  ఇక పొతే యూజర్ ఇంటర్ఫేస్ లో మాత్రం రెండింటి కి కొంత తేడా ఉంది. కాని స్టాక్ ఆండ్రాయిడ్ ఇచ్చే ఫీచర్స్ వలే ఇందులో దీనికి సొంత యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, దానితో Ultimate బ్యాటరీ సేవింగ్ ఫీచర్ (ఇది లేటెస్ట్ సామ్సంగ్ గేలక్సీ S6 మోడల్ లో ఉంది) మరియు స్టేటస్ బార్ బ్యాటరీ పర్సెంటేజ్ చూపించే ఫీచర్స్ ఉన్నాయి. అసలు లాలిపాప్ లో ఉన్నవి, Jelly Bean OS లో లేనివి ఏంటి అని నాకు తెలియనప్పుడు అవి నాకు ప్రియారిటీ కాదు. సో ఐ యామ్ నాట్ వర్రీడ్ విత్ అవుట్ డేటెడ్ OS వెర్షన్ ఆల్సో.

గమనిక : ఈ ఆర్టికల్ మీకు ఏమైనా outdated గా అనిపిస్తే ఇది 2015 లో వ్రాయబడిన పోస్ట్ అని గమనించగలరు. ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను ప్రతీ  సారి తెలియజేయమని అడగటానికి కారణం మీకు నచ్చేవి మరింత సమాచారం ఇవ్వాలని. సో అభిప్రాయాలను అడిగినప్పుడు కొంచెం టైం తీసుకొని ఫీడ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నా.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :