Vivo V3 అండ్ V3 మాక్స్ ఫర్స్ట్ ఇంప్రెషన్స్
రీసెంట్ గా Vivo బ్రాండ్ నుండి V3 అండ్ V3 మాక్స్ మొబైల్స్ లాంచ్ అయ్యాయి ఇండియాలో. వీటిని వాడుతున్నాము. సేమ్ డిజైన్ తో ఉన్నాయి రెండు మోడల్స్..
గడిపిన కొత్త క్షణాలలో ఫోన్ ఫాస్ట్ గానే ఉంది కానీ ఎందుకో లాంగ్ రన్ లో లాగ్స్ ఇస్తుంది అని అంచనా. Funtouch OS 2.5 UI దాదాపు iOS లానే ఉంటుంది..
కొంచెం డిఫరెంట్ గా నచ్చే విధంగానే ఉంది ఓవర్ ఆల్ UI. ఐకాన్స్ అవీ rounded గా లేవు, ఫ్లాట్ గా ఉన్నాయి. V3 లో SD 616 SoC, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉండగా..
ఇది స్పెక్స్ వైజ్ గా హానర్ 5X కు పోటీ గా ఉంది, అయితే ప్రైస్ దాని కన్నా ఎక్కువ V3. 5 in HD డిస్ప్లే డిసెంట్ గా ఉంది. బ్రైట్, crisp అండ్ readble అండర్ సన్ లైటింగ్.. కాని ఈ ప్రైస్ లో 720P చాలా తక్కువ రిసల్యుషణ్ అని చెప్పాలి.
V3 మాక్స్ లో SD 652 SoC, 4GB ర్యామ్, both sides 13MP కేమేరాస్ ఉన్నాయి. కెమెరా స్మూత్ గా ఫాస్ట్ గా ఉంది. ఫోటోస్ కూడా మంచి డిటేల్స్ మరియు కలర్స్ ఇస్తున్నాయి.
652 SoC తో ఇండియాలో ఇదే మొదటి ఫోన్. 650 SoC కలిగి ఉన్న రెడ్మి నోట్ 3 పెర్ఫార్మన్స్ చూసిన తరువాత మరియు దీనితో కొంత సమయం గడిపితే 652 కూడా promising అనిపిస్తుంది పెర్ఫార్మన్స్ విషయంలో.
నాకు వీటిలో నచ్చిన విషయం ఏంటంటే రెండూ పట్టుకోవటానికి చాలా కంఫర్ట్ గా ఉన్నాయి. కానీ 17,980 రూ లకు V3 చాలా overpriced అని చెప్పాలి. V3 మాక్స్ కూడా 23,980 రూ లకు రావటం అంతగా ఇండియన్ మార్కెట్ లో ఆకర్షించబడే విషయం కాదు. ఫైనల్ కంక్లుజన్ కంప్లీట్ రివ్యూ లోనే తెలుసుకోగాలము.