మైక్రోసాఫ్ట్ లుమియా 950 అండ్ 950XL ఫర్స్ట్ ఇంప్రెషన్స్

మైక్రోసాఫ్ట్ లుమియా 950 అండ్ 950XL ఫర్స్ట్ ఇంప్రెషన్స్
HIGHLIGHTS

ఇప్పటివరకూ వచ్చిన లుమియా సిరిస్ బెస్ట్ లుమియా ఫోన్స్

మైక్రోసాఫ్ట్ ఇండియాలో నిన్న మోస్ట్ awaiting లుమియా ఫోన్స్, 950 అండ్ 950XL లాంచ్ చేసింది. ఇవి విండోస్ 10 తో వచ్చే మైక్రోసాఫ్ట్ ఫ్లాగ్ షిప్ హై ఎండ్ మోడల్స్.

మొదటి సారిగా వీటిని చూస్తే రెగ్యులర్ ఫోన్స్ అనిపిస్తాయి. కాని వీటిలోని విషయం అంతా విండోస్ 10 os లో ఉంది. Continuum, విండోస్ hello ఫీచర్స్ ఇందుకు కారణం.

కానీ వీటిని వాడటానికి మైక్రోసాఫ్ట్ డిస్ప్లే dock అవసరం. డాక్ ప్రైస్ – 5,,999 రూ. అంటే ఫోన్ కంప్లీట్ గా వాడేందుకు 50,000 రూ వెచ్చించాలి. సో ఈ పాయింట్ దగ్గర మైక్రోసాఫ్ట్ లుమియా కొత్త మోడల్స్ చాలా మైనస్ అయ్యాయి.

అయితే లుమియా హ్యాండ్ సెట్స్ ఇంప్రూవ్మెంట్ విషయంలో చాలా వరకూ బాగా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. చాలా responsive గా ఉన్నాయి. గతంలో మైక్రోసాఫ్ట్ వాడిన స్నాప్ డ్రాగన్ 400 SoC ల కన్నా స్నాప్ డ్రాగన్ 810 అండ్ 808 ప్రోసేసర్స్ చాలా ఫాస్ట్ గా కనిపిస్తున్నాయి.

బిల్డ్ బాడీ మినహా ఓవర్ ఆల్ గా నిజంగా ఫ్లాగ్ షిప్ మోడల్స్ వలె మంచి class ఫీలింగ్ ఇస్తున్నాయి. అన్నిటికన్నా బాగా కెమేరా ఇంప్రూవ్ అయ్యింది. గతంలోని వాటికన్నా ఫాస్ట్ గా ఉన్నాయి.

నెక్సాస్ లేదా గెలాక్సీ సిరిస్ కన్నా ఫాస్ట్ ఫోకస్ స్పీడ్ ఉండదు కాని రెగ్యులర్ user కు ఉండవలసినంత స్పీడ్ ఉంది. ఈ రెండు మోడల్స్ కు కూడా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది స్పీడ్ విషయంలో కాని అది చాలా చిన్నదే.

ఇండియా ఫ్లాగ్ షిప్ మార్కెట్ కొంచెం చిన్నది. కాని ఇది చాలా ఇంపార్టెంట్ మొబైల్ కంపెనీలకు. ఎందుకంటే బడ్జెట్ మోడల్స్ కన్నా ఫ్లాగ్ షిప్ మోడల్స్ సేల్స్ లోనే కంపెనీలకు బాగా లాభాలు వస్తాయి.

కాని వీటి విషయంలో మైక్రోసాఫ్ట్ కు అంత గేమ్ changing సేల్స్ రావని అనిపిస్తుంది ఇప్పటికి. ఎందుకంటే విండోస్ os ఫోన్ కు 50,000 వరుకూ ఖర్చుపెట్టడానికి కేవలం విండోస్ ఫాన్స్ వలనే అవతుంది.

ఓవర్ ఆల్ గా మంచి ఫీలింగ్ ఇస్తున్నాయి కాని గెలాక్సీ S6 లేదా ఐ ఫోన్ లతో మాత్రం కంపేర్ చేయలేము బిల్డ్ విషయంలో. ఎందుకంటే ఇక్కడ కూడా ప్రైస్ కంపేరిజన్ వస్తుంది. కాని మైక్రోసాఫ్ట్ లుమియా 950 అండ్ 950XL మాత్రం ఇప్పటివరకూ వచ్చిన లుమియా హ్యాండ్ సెట్స్ లో ది బెస్ట్ ఫోన్స్.

 

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo