EDIT – 31 MAY 2016
ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు Meizu M3 నోట్ (9999 రూ) ఫ్లాష్ సెల్ ప్రారంభం కానుంది అమెజాన్ లో. దీని రివ్యూ రావటం కొంచెం లేట్ అవుతుంది. సో మీకు ఇంకా రెడ్మి నోట్ 3 కన్నా ఇది బెస్ట్ ఫోనా.. కాదా అనే సమాధానం మేము తెలియజేయలేకపోయాము. అయితే Meizu M3 నోట్ ను నేను రెండు దశలలో వాడటం జరిగింది. ఆ observation లో పెర్ఫార్మన్స్ వైజ్ గా రెడ్మి నోట్ 3 కన్నా బెటర్ కాదు Meizu M3 నోట్. అయితే దీని కంప్లీట్ రివ్యూ రావటానికి మాత్రం ఇంకా టైమ్ పడుతుంది. సో ఈ రోజు Meizu M3 నోట్ కొనాలా వద్దా అని సంసిద్ధం లో ఉన్న వారికీ నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.
APRIL – 7 2016
లాస్ట్ ఇయర్ Meizu M2 నోట్ మోడల్ ను లాంచ్ చేసింది. బడ్జెట్ లో మంచి డిస్ప్లే, డిజైన్ అండ్ స్పెక్స్ తో బాగా పాపులర్ అయ్యింది M2 నోట్. ఇప్పుడు M3 నోట్ ను చైనా లో రిలీజ్ చేసింది కంపెని. మేము ఈవెంట్ కు attend అయ్యి M3 నోట్ ను ట్రై చేశాము.
ఇప్పుడు దీని ఫర్స్ట్ ఇంప్రెషన్స్ చూడగలరు.. బేసిక్ డిజైన్ అంతా సేమ్ M2 నోట్ లానే ఉంది. rounded edges తో ఐ ఫోన్ 6 లా కూడా కనిపిస్తుంది. కంపెని అఫిషియల్స్ చెప్పిన మాటలు ప్రకారం వచ్చే నెలలో ఫోన్ ఇండియన్ మార్కెట్ లో competetive ప్రైస్ తో రానుంది.
బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెడ్మి నోట్ 3 కన్నా slight గా బెటర్ గా ఉంది. దాని వలె M3 లో కూడా మెటల్ బిల్డ్ ఉంది. కాని బ్యాక్ ప్యానల్ slippery గా లేదు దీనిలో. రెడ్మి లో slippery గా ఉంటుంది.
డిస్ప్లే లో మంచి వ్యూయింగ్ angles ఉన్నాయి. బ్రైట్ నెస్ బాగుంది. సన్ లైట్ లో కూడా బాగా కనిపిస్తుంది. కంపెని ఈ ఫోన్ ను రెడ్మి నోట్ 3 కు కాంపిటిషన్ గా రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉంది. అంటే ప్రైసింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అని అంచనా. దీనిలో మీడియా టెక్ Helio P10 SoC ఉంది. దీని రియల్ పెర్ఫార్మన్స్ తెలియాలంటే ఇండియన్ వేరియంట్ రిలీజ్ అవ్వాలి.
కెమేరా విషయానికి వస్తే 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరాస్ ఉన్నాయి. రేర్ కెమేరా మంచి ఇమేజెస్ తీస్తుంది లైటింగ్ కండిషన్స్ లో. Low లైట్ లో క్వాలిటీ తగ్గుతుంది. కలర్ ప్రొడక్షన్ true గా ఉంది సోర్స్ వలె. కాని ఫుల్ crop చేస్తే ఇమేజెస్ లో నాయిస్ కనిపిస్తుంది. ఇది ఇండియన్ వేరియంట్ రిలీజ్ అయ్యేసరికి బాగుంటుంది అని అంచనా. క్రింద కెమేరా తో తీసిన samples చూడండి..
Image Sample 1: Outdoor (Overcast)
Image Sample 2: Indoor (Warm)
రెడ్మి నోట్ 3 లానే దీనిలో బ్యాటరీ కూడా సిమిలర్ గా ఉంది. 4100 mah తో వస్తుంది. బ్యాటరీ పెద్దది అయినా ఫోన్ thin గా ఉంది. కంపెని బ్యాక్ అప్ 17 గంటలు ఉంటుంది అని చెప్పింది. ఇది చాలా పెద్ద క్లెయిమ్. ప్రివియస్ గా M2 నోట్ మోడల్ మంచి బ్యాక్ అప్ ఇస్తుంది. సో కంపెని కనుక ఈ మోడల్ ను కూడా బాగా optimise చేస్తే బడ్జెట్ రేంజ్ లో మరో మంచి మొబైల్ వస్తుంది అని అనుకోవచ్చు.