ఆసుస్ Zenfone 2 డీలక్స్ మరియు Zenfone 2 లేజర్: First ఇంప్రెషన్స్
అసుస్ లాంచ్ చేసిన కొత్త ఫోనులు డిసెంట్ గా ఉన్నాయి, కాని కంపెని మోడల్ నేమ్స్ తో confusion చేయటం ఆపాలి..
గత వారం అసుస్ జెన్ ఫోన్ 2 deluxe, జెన్ ఫోన్ 2 లేసర్, జెన్ ఫోన్ సెల్ఫీ, జెన్ ఫోన్ 2 Max మరియు అసుస్ జెన్ ప్యాడ్ 7 అండ్ 8 మోడల్స్ ను లాంచ్ చేసింది. వీటిలో జెన్ ఫోన్ 2 Deluxe అండ్ జెన్ ఫోన్ 2 Laser గురించి మేము తెలుసుకున్న మొదటి ఇంప్రెషన్స్ ఇక్కడ చూడగలరు..
ఆసుస్ జెన్ ఫోన్ 2 Deluxe –
రెండు స్టోరేజ్ ఆప్షన్స్ లో వస్తుంది. 64 అండ్ 128 GB. ఈవెంట్ లో 64GB మోడల్ తో మేము కొంత సేపు గడిపి దిసప్పోయింట్ అయ్యాము అని చెప్పాలి. జెన్ ఫోన్ 2 deluxe లో ఒక్క "Crystal Miracle" బ్యాక్ కవర్(ఇది కూడా undoubted గా ప్లాస్టిక్ మేటేరియలే కాని చూడటానికి బాగుంది) మినహా ఒరిజినల్ జెన్ ఫోన్ 2 ZE551ML కు దీనికి అస్సలు ఎటువంటి తేడాలు లేవు. ప్రైస్, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఇంటర్నెల్ స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్.
జెన్ ui లో మార్పులు ఏమీ లేవు, ఫోన్ response మాత్రం extremely స్మూత్ గా ఉంది. పెర్ఫార్మన్స్ కూడా జెన్ ఫోన్ 2(మంచి పెర్ఫర్మార్) ఒరిజినల్ మోడల్ వలె ఉంటుంది అని అంచనా. కేవలం బ్యాక్ కవర్ మార్చి కొత్త ఫోన్ లాంచ్ చేసింది కంపెని అనిపిస్తుంది మొదటి ఇంప్రెషన్స్ లో . సో పూర్తిగా దీనిపై రివ్యూ చేస్తేనే కాని దీనిని కంపెని ప్రత్యేకంగా మరో మోడల్ లా ఎందుకు లాంచ్ చేసిందో చెప్పలేము.
అసుస్ జెన్ ఫోన్ 2 Laser –
ఈ మోడల్ 3 వేరియంట్స్ లో వస్తుంది. రెండు ZE550KL మోడల్స్ 5.5 in 720P డిస్ప్లే తో డిఫరెంట్ స్పెక్స్ తో వస్తున్నాయి. ఒకటి స్నాప్ డ్రాగన్ 410 SoC, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ తో 9,999 రూ. రెండవది స్నాప్ డ్రాగన్ 615 SoC, 3gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ తో 13,999 రూ. రెండు ఫోనులు మేము గడిపినంతసేపు reasonably ఫాస్ట్ గా ఉన్నాయి. బరువు, లుక్స్, డిజైన్, form factor ఒరిజినల్ జెన్ ఫోన్ 2 లానే ఉన్నాయి.
జెన్ ఫోన్ 2 Laser లో మూడవ మోడల్ ZE601KL. 6in 1080P తో పెద్ద డిస్ప్లే మరియు లార్జ్ బ్యాటరీ ఉన్నాయి దీనిలో. మిగిలిన రెండు Laser ఫోన్ లకు దీనికి డిజైన్ సేమ్. పైన చెప్పిన స్నాప్ డ్రాగన్ 615 వేరియంట్ జెన్ ఫోన్ 2 laser కు దీనికి సేమ్ స్పెక్స్.
మొత్తం అన్నీ ఫోనులు గొరిల్లా గ్లాస్ 4 మరియు వెరీ లైట్ టచ్ రెస్పాన్స్ కలిగి ఉన్నాయి. అయితే వీటి మెయిల్ ఫీచర్ Laser ఆటో ఫోకస్. ఇది ఫాస్ట్ అండ్ accurate ఫోకస్ తో 13MP కెమేరా తో వస్తున్నాయి. అయితే సామ్సంగ్ S6 మరియు ఐఫోన్ 6 కన్నా వేగంగా లేదు. అయితే కెమేరా డిపార్ట్మెంట్ లో సబ్ 10K అండ్ 15K స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో గట్టి కాంపిటీషన్ ఇస్తుంది.
ఓవర్ ఆల్ గా technicalities పరంగా అన్నీ unique గా ఉన్నాయి. కాని ఈ కొత్త సిరిస్ మొతం టోటల్ confusion తో ఓవర్ crowded అయ్యాయి. ఇప్పటికీ మొత్తం 14 జెన్ ఫోన్ 2 మోడల్స్ ఉన్నాయి. కేవలం ఒక్క attribute ను యాడ్ చేసి సెపరేట్ మోడల్ గా లాంచ్ చేస్తుంది ఆసుస్. కొంతవరకూ ఫర్వాలేదు కాని మరీ ఇన్ని దించితే స్మార్ట్ ఫోన్ యూజర్స్ కూడా వాళ్ల జిమ్మిక్స్ అర్తమయ్యి మొత్తం ఫ్లాప్ అవుతుంది మార్కెటింగ్. ఇప్పుడు ఎటువంటి ఎక్స్ట్రా క్రియేటివిటీ, ఖర్చు, ఫోకస్ అవసరం లేకుండా మొబైల్ కంపెనీలు అన్నీ కేవలం స్టోరేజ్ ఒక్కటి మార్చి(16/32/128GB) డబుల్ prices తో సేమ్ మోడల్స్ ను మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇది ఐ ఫోన్ తో మొదలు అయ్యింది అని చెప్పాలి.
Hardik Singh
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile