ఈ సంవత్సరం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ప్రైస్ మరియు పెర్ఫార్మెన్స్ మద్య సాద్యమైనంత ఉత్తమ సమత్యుల్యతను మాకు కనబరిచాయి మరియు అత్యంత ప్రజాధారణ పొందిన కేటగిరీలలో ఒకటి. అందుకే, సోమవారం మాదిరిగానే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేటగిరి పరిధిని మేము 20,000 కు విస్తరించ వాల్సి వచ్చింది. అందుకే, ఈ కేటగిరిలో అందించిన ఉత్తమైన ఫోన్లు అత్యంత ప్రజాధారణ పొందినవి. ఎక్కువ ఫ్లాగ్ షిప్ ఫీచర్లను బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు అందించడం ద్వారా ఈ సంవత్సరం 20 రూపాయల ధర పరిధిలో అనేక కీలక లాంచెస్ ఉన్నాయి. ఇందులో, 120Hz AMOLED స్క్రీన్‌ల నుండి 108MP కెమెరాల వరకు ఈ సంవత్సరం బడ్జెట్ ఫోన్ పరిధి మరింతగా విస్తారించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే, ఈ సంవత్సరం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేటగిరి మీ గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ అవసరాలను తీర్చడానికి అద్భుతమైన ఫోన్ లతో నిండిపోయింది.
iQOO Z3 స్మార్ట్ ఫోన్ 2021 సంవత్సరం యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కిరీటాన్ని అందుకుంది. Redmi Note 10 Pro Maxతో పోల్చితే ఈ స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ లో గణనీయమైన పనితీరు కనబరుస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Z3 CPU మరియు GPU పనితీరులో నిజంగా అధిక స్కోర్ లను అందించడాన్ని మేము చూశాము. iQOO Z3 సాధారణ రోజువారీ పనితీరు Lag-Free గా ఉంటుంది. అంతేకాదు, మీకు ప్రియమైన బ్యాటిల్ రాయల్ గేమ్ రెండు రౌండ్ ల కంటే ఎక్కువ నిర్వహించగలదు. ఇది బ్యాటరీ లైఫ్ లో మంచి ప్రతిభ కనబరచడమే కాక ఈ ధర పరిధిలో అత్యంత వేగవంతమైన స్పీడ్ ఛార్జ్ లలో ఒకటి. అయితే, ఈ ఫోన్ ఒక చిన్న ప్రతికూలను కలిగివుంది. ఈ ఫోన్ కెమెరా పనితీరులో మార్క్‌ను కోల్పోవడం, స్టీరియో స్పీకర్లు లేకపోవడం మరియు 2021 లో విడుదలైన ఫోన్‌లకు అనుగుణంగా కనిపించని డేటెడ్ వాటర్‌డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది.
Redmi Note 10 Pro Max ఈ సంవత్సరం రూ.20,000 ధరలో పొందగలిగిన బహుముఖ(వెర్సటైల్) స్మార్ట్. ఇది కేవలం పెర్ఫార్మెన్స్ విషయంలో iQOO Z3 కంటే కొంచెం తక్కువ స్కోర్ చేస్తుంది. అయితే, దాని శక్తివంతమైన 108 క్వాడ్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, స్టీరియో స్పీకర్లు, AMOLED డిస్ప్లే వంటి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. కానీ, ఈ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ ఫోన్ పైన ప్రభావం చూపే ఒక ప్రతికూలతగా మిగిలిపోయింది. ముఖ్యంగా, ఇది 5G కాకపోవడం కూడా ఇది iQOO Z3కి దారి తీస్తుంది.
ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్ ఎక్కువ డబ్బును ఖర్చు చెయ్యలేరు లేదా ఇష్టపడరు. ఇక్కడే Samsung Galaxy M12 సరైన ఎంపికగా కనిపిస్తుంది మరియు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Best Buy కేటగిరిలో మా ఉత్తమ ఎంపికగా నిలిచింది. Galaxy M12 వెనుక క్వాడ్ కెమెరాలు, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు పెద్ద 6,000mAh బ్యాటరీతో కూడిన సరైన మిశ్రమం. ఇది మీకు రెండు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. మీరు Galaxy M12 నుండి ఎక్కువగా ఆశించలేరు కానీ ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మినిమంగా అందించాల్సిన విషయాలను అందిస్తుంది.
20 సంవత్సరాల వారసత్వంతో, Digit Zero1 Awards 2021 అవార్డులు ఇండస్ట్రీ యొక్క ఏకైక పెర్ఫార్మెన్ ఆధారిత అవార్డులుగా గుర్తించబడ్డాయి. వారి ప్రేక్షకుల కోసం పెర్ఫార్మెన్ – ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేయడం మరియు పరిచయం చేయడంలో సంవత్సరాల తరబడి పరిశోధన ఉంచినందుకు డిజిట్ ఆ బ్రాండ్ లకు రివార్డ్‌లను అందజేస్తుంది. అన్ని ఉత్పత్తులు కఠినమైన మరియు శాస్త్రీయ ప్రక్రియ ద్వారా ఉత్తీర్ణత సాధించడానికి మరియు అదే కేటగిరిలోని పోటీదారు బ్రాండ్ లతో పోటీపడేలా తయారు చేయబడ్డాయి. ప్రతి కేటగిరీలో విన్నర్ వారి మొత్తం స్కోర్ ఆధారంగా ప్రకటించబడతారు. సగటున 56 టెస్టింగ్స్ లో పూర్తి పనితీరు విశ్లేషణ తర్వాత, ప్రతి కేటగిరీకి, కీలక పెర్ఫార్మెన్స్ పెరామీటర్స్ నిర్వహించబడుతుంది. Zero1 అవార్డుల టెస్టింగ్ ప్రక్రియ ఫీచర్లు, ధర లేదా డిజైన్ కోసం స్కోర్ లను పరిగణించదు. డబ్బుకు తగిన విలువ అందించగల అత్యుత్తమ ఉత్పత్తులను గుర్తించడం, పరిశ్రమను ముందుకు నడిపించే ఆవిష్కరణలను జరుపుకోవడం మరియు మార్కెట్‌కు అంతరాయం కలిగించే ధైర్యం చేసే ఉత్పత్తులకు రివార్డ్ ఇవ్వడం దీని లక్ష్యం.