ఇప్పుడు అందరూ ఏడాది కి ఒక ఫోన్ వాడుతున్నారు. సో పాతవి OLX వంటి వెబ్ సైట్ ల ద్వారా అమ్మేయటం, ఈ సదుపాయం లేని వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళకు అమ్మేయటం జరుగుతుంది.
అయితే మీరు అమ్మే ముందు డేటా ను రిసేట్ లేదా ఫేక్టరీ ఫార్మాట్ వంటివి చేసి డేటా ను erase చేసి ఇస్తుంటారు. కాని ఇది పూర్తిగా డేటా ను డిలిట్ చేయదు.
కొన్ని డేటా రికవర్ సాఫ్ట్ వేర్ ల ద్వారా మీరు ఫోన్ లో డిలిట్ చేసిన డేటా (కొంత మేరకు) తిరిగి పొందే అవకాశం ఉంది. ఇది మన డేటా కోసం వాడితే ఫర్వాలేదు, మనం ఫోన్ అమ్మేసిన తరువాత బయర్ ఇదే పని చేస్తే, పరిస్థితులు వేరేగా ఉంటాయి.
సో ఇక్కడ మీ కోసం డేటా ను మొబైల్ లో పర్మనంట్ గా ఎలా డిలిట్ చేయాలో కొన్ని సింపుల్ టిప్స్ చూడండి.
1. ముందుగా ఫోన్ లో (sd కార్డ్ లేదా ఇంటర్నల్ స్టోరేజ్) ఒరిజినల్ డేటా ను అవే ఫోల్డర్స్ తో pc లోకి కట్ పేస్ట్ చేయండి. తరువాత ఫోన్ లోకి డమ్మీ డేటా ను కాపీ చేయండి. అంటే ఏవో పర్సనల్ ఇమేజెస్ లాంటివి కాకుండా పబ్లిక్ ఫైల్స్(సాంగ్స్, ఇమేజెస్).
2. ఇప్పుడు ఫోన్ ను ఫేక్టరీ రిసేట్ లేదా ఫార్మాట్ వంటివి చేయండి. ఇక ఎవరైనా ఆ ఫోన్ డేటా ను రికవర్ చేయటానికి ట్రై చేస్తే మీ పర్సనల్ డేటా కాకుండా మీరు లేటెస్ట్ గా పెట్టిన random డేటా రికవర్ అవుతుంది.
డేటా ను పర్మనంట్ గా (కొంతమేరకు) కూడా డిలిట్ చేసే సాఫ్ట్ వేర్స్ అండ్ మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి..
ఆండ్రాయిడ్ యాప్స్. వీటికి రూట్ అవసరం లేదు. ఇవి నార్మల్ గా డేటా ను డిలిట్ చేయవు. ఫార్మాట్/ఫేక్టరీ రిసేట్/డిలిట్ చేసిన తరువాత ఉండే ఫ్రీ స్పేస్ ను deep క్లినింగ్ చేస్తుంది. సో మీ డేటా రికవర్ అవటానికి chances ఉండవు mostly. వీటిని వాడే ముందు యాప్ ఎలా పనిచేస్తుంది అని description చదవండి.
1. Secure Wipe (ఈ పేర్ల ఫై క్లిక్ చేస్తీ ప్లే స్టోర్ డౌన్లోడ్ పేజ్ కు వెళ్తారు.)
2. Secure Delete (ఈ పేర్ల ఫై క్లిక్ చేస్తీ ప్లే స్టోర్ డౌన్లోడ్ పేజ్ కు వెళ్తారు.)
3. Android data eraser ఇది PC సాఫ్ట్ వేర్. కంప్యుటర్ లో ఇంస్టాల్ చేసి, ఓపెన్ చేసిన తరువాత మీ మొబైల్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సాఫ్ట్ వేర్ లో Erase your old phone ఆప్షన్ లో Permanent erase ఆప్షన్ చూస్ చేసి, మీ కంప్లీట్ ఫోన్ డేటా ను పర్మనెంట్ గా డిలిట్ చేయగలరు. కాని ఇవి చేసే ముందు మీ పాత డేటా కాపీ చేసి పెట్టుకోండి, ఎందుకంటే important డేటా ఏమీ లేదులే అని డిలిట్ చేసేసిన తరువాత మీకు కావలసినది ఏదో డిలిట్ అయింది అని గుర్తుకు వస్తుంది.
ఆండ్రాయిడ్ మొబైల్ సెట్టింగ్స్ లో Security ఆప్షన్ లోకి వెళ్తే Encrypt అనే ఆప్షన్ కనపడుతుంది. ఇది కూడా డేటా సేఫ్టీ కు సంబందించిన సెట్టింగ్. enable చేస్తే డేటా ను రికవర్ చేయకుండా చేస్తుంది. కాని ప్రాక్టికల్ గా దీని use అన్ని situations లో suit అవదు.
ఇది enable చేస్తే డేటా అంతా encrypt అవుతుంది. అంటే ప్లెయిన్ గా ఉండే డేటా ను అటు ఇటు అర్థం లేని విధంగా cipher కోడింగ్ లో మారుస్తుంది. ఎవరినా మీ డేటా ను యాక్సిస్ చేయాలంటే పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. కాని ఇది వాడితే మీ మొబైల్ స్లో అవుతుంది.