CREO మార్క్ 1 : ఫర్స్ట్ ఇంప్రెషన్స్
CREO అనే బెంగలూరు based కంపెని మార్క్ 1 పేరుతో నిన్న స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీని గురించి తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళండి.
కంపెని ప్రత్యేకత ఏంటంటే – ప్రతీ నెల users అడిగే ఫీచర్స్ ను అప్ డేట్స్ రూపంలో ఇస్తుంది. అయితే ఈ అప్ డేట్స్ వలన కొత్త బగ్స్ ఉండకుండా ఉంటే ఇది సక్సెస్ అయినట్లే..
ఎందుకంటే Cyanogen OS, Oxygen OS లు ప్రస్తుతానికి ఇవే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి ఇప్పటికీ. Mark 1 పై మా మొదటి అభిప్రాయాలను చూడండి..దీనిని మేము వాడటం జరుగుతుంది.
ఇది Fuel OS పై రన్ అవుతుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే os లో ఏమీ ప్రత్యేకత కనిపించలేదు నాకు. Sense అనే ఫీచర్ కొత్తది అని చెబుతుంది కంపెని, కాని ఇది ఆల్రెడీ గూగల్ నౌ వంటి ఫంక్షన్స్ నే అందిస్తుంది..ఇదే ఫీచర్ Vivo మొబైల్స్ లోని FunTouch OS మరియు ఆపిల్ spotlight లోని ఉంది.
Echo అండ్ Retriever కూడా పేపర్ పై చదవటానికి useful ఫీచర్స్ అనిపించవచ్చు. Retriever తో ఫోన్ ను ఫ్లాషింగ్, ఫార్మాటింగ్ చేసిన పోయిన ఫోన్ తిరిగి పొందవచ్చు, అంటే మన పర్సనల్ డేటా ఎప్పటికీ పోదు ఫోన్ నుండి..అలాగే మన డేటా కంపెని సర్వర్స్ లో కూడా ఉండనుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి..
సాఫ్ట్ వేర్ లో అప్ డేట్స్ ఇస్తామని చెబుతున్న కంపెని ప్రస్తుతం సాఫ్ట్ వేర్ పరంగా యూజర్ ఇంటర్ఫేస్ లో ఎటువంటి meaningful ఫీచర్స్ ను ఇవ్వకపోవటం నిరాశ కలిగించింది. దాదాపు ఒరిజినల్ stock ఆండ్రాయిడ్ లుక్స్ కలిగి ఉంది os.
ఇండియన్ మార్కెట్ లో స్పెక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. 20 వేల ప్రైస్ తో వచ్చే మార్క్ 1 లో 11 వేలకు వస్తున్న LeEco Le 1S ఫోన్ యొక్క స్పెక్స్ కనిపిస్తున్నాయి. ఇంతవరకూ గడిపిన సమయంలో దీని కన్నా రెడ్మి నోట్ 3 ఫాస్ట్ గా మరియు బెటర్ యూజర్ ఇంటర్ఫేస్ తో వస్తుంది అనిపిస్తుంది.
కెమెరా ను ఓపెన్ చేస్తుంటే లాగ్ ఉంటుంది. 21MP రేర్ కెమెరా తో ఫోటో క్లిక్ చేసి ఓపెన్ చేస్తుంటే కూడా లాగ్ ఉంటుంది ఒక సెకెండ్. ఒక సెకెండ్ లాగ్ ఏంటండీ అని అనుకోవద్దూ..ఇలా ఒక సెకెండ్ కూడా లాగ్ లేని ఫోనులున్నాయి అందుబాటులో. క్వాలిటీ కూడా moto X ప్లే అండ్ Yutopia కన్నా బాగా తక్కువ ఉంది. కాని మూడింటిలో 21MP నే ఉంది.
సో అన్నీ చూస్తె కేవలం ప్రతీ నెల కంపెని సాఫ్ట్ వేర్ అప్ డేట్ లను ఇవటం పైనే దృష్టి పెట్టింది కాని హార్డ్ వేర్ పరంగా సాఫ్ట్ వేర్ ను optimise చేయటం కూడా మానేసింది. సో మీరు ప్రతీ నెలా రాబోయే అప్ డేట్ ల కోసం ఓవర్ గా ప్రైస్ అయిన ఈ ఫోన్ ను తీసుకుంటారా? నేనైతే ప్రిఫర్ చేయను..
మెటల్ అండ్ గ్లాస్ బాడీ ఫోనుకు మంచి లుక్స్ ఇస్తుంది కాని పెర్ఫెక్ట్ గా లేదు చేతిలో హోల్డ్ చేస్తుంటే. ఫైనల్ గా చెప్పాలంటే మన ఇండియన్ కంపెని అయినప్పటికీ ఫోన్ లో విషయమేమి లేదు.