10 వేల బడ్జెట్ లో చాలా ఫోనులు కాంపిటేషన్ లోకి వచ్చాయి. కాని ఇప్పుడు coolpad వాటన్నిటినీ దాటి స్పెసిఫికేషన్స్ పరంగా నంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళింది అని చెప్పాలి. దీనిలో ఉన్న 3gb ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఆక్టో కోర్ ప్రొసెసర్ దీనికి కారణం. దీని ప్రైస్ 8,999 రూ.
దీనిలో 5.5 in పెద్ద డిస్ప్లే ఉంది. ఓవర్ ఆల్ ఫీల్ పెద్దగా ఉన్నట్టు ఉంటుంది. వెనుక ఉన్న ప్లాస్టిక్ బాడీ xiaomi మి 4i ను గుర్తుకుతెస్తుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ matte డిజైన్ తో ఉంది. దీని వలన సింగిల్ హ్యాండ్ తో ఫోన్ వాడటానికి వీలు కుదురుతుంది. స్లిప్ అవదు. ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది.
దీనిలో 720P HD డిస్ప్లే ఉంది, 1080P లేదు, కాని ప్రైస్ తో కంపేర్ చేస్తే అదేమీ ప్రాబ్లెం గా అనిపించదు. వ్యూయింగ్ angles అండ్ కలర్ saturation బాగున్నాయి. అలాగే ఫింగర్ ప్రింట్స్ మరియు reflections ఎక్కువ చూపించటం లేదు.
మీడియా టెక్ MT6753 SoC, 3gb ర్యామ్, 16 gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి దీనిలో. కాని ఈ ప్రైస్ లో 3gb ర్యామ్ మోబైల్ ఇదే ఫస్ట్. UI అండ్ బ్యాటరీ కూడా ప్రస్తుతానికి బాగున్నాయి, కానీ కంప్లీట్ జడ్జ్మెంట్ ఫైనల్ రివ్యూ లో ఉంటుంది.
బ్యాక్ సైడ్ కెమెరా లెన్స్ క్రింద ఫింగర్ ప్రింట్ సెన్సార్
13MP రేర్ కెమేరా తో కొన్ని ఫోటోస్ తీయటం జరిగింది. అన్నీ బాగున్నాయి. స్పాట్ లైట్ అండ్ ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో తీసాము. డిటేల్స్ బాగా చూపిస్తుంది. కలర్ రిప్రోడక్షన్ కూడా బాగుంది. కలర్ saturation మాత్రం కొంచెం warm గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. త్వరలో కంప్లీట్ రివ్యూ వస్తుంది. wait a while..
కూల్ ప్యాడ్ నోట్ 3 తో తీసిన ఇమేజ్