VR అంటే ఏమిటి? ఏలా వాడాలి? ఏలాంటి అనుభూతులను ఇస్తుంది ఇది.
ముందుగా ఒక మాట. ఏ VR అయినా Gyroscope sensor కలిగి ఉన్న ప్రతీ స్మార్ట్ ఫోన్ కు పనిచేస్తుంది. రెడ్మి నోట్ 3 కు ఉంది. మీ ఫోన్ లో Gyroscope ఉందో లేదో తెలుసుకోవటానికి క్రింద ప్రోసెస్ తెలిపాము. చూడగలరు.
VR అంటే Virual Reality. అంటే సాఫ్ట్ వేర్ ఉపయోగించి visual మరియు సౌండ్ ద్వారా నిజమైన అనుభూతిని అందించే కుత్రిమ టెక్నాలజీ. అయితే ఇది మొదటిగా గూగల్ కంపెని సింపుల్ card board ద్వారా VR నమూనా ను తయారు చేసి కార్డ్ బోర్డ్ పేరుతో మార్కెట్ లో కి బేసిక్ VR ను రిలీజ్ చేసిన దగ్గర నుండీ బాగా పాపులర్ అయ్యింది VR టెక్నాలజీ. ఇవి 4.7 in నుండి 6 in స్క్రీన్ ఫోనులకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. కాని చాలా VR's 5 నుండి 5.5 సపోర్ట్ మాత్రమే ఇస్తాయి.
VR రెండు రకాలు. ఒకటి active. ఇది స్మార్ట్ ఫోన్ లో sensors పై ఆధారపడకుండా సొంతంగా sensors తో వస్తుంది. ఉదాహరణకు Oculus VR. రెండవది Passive. ఇవి గూగల్ కార్డ్ బోర్డ్ కాన్సెప్ట్ తో ఉంటాయి. స్మార్ట్ ఫోన్ లోని sensors పై ఆధారపడతాయి ఇవి. క్రిండ్ ఉన్న ఇమేజెస్ 1Re కు అమెజాన్ లో Oneplus సెల్ చేసిన VR. దీనిని కొనటానికి క్రింద లింక్ అందించటం జరిగింది. చూడండి. క్రింద మీరు Oneplus Loop VR హెడ్ సెట్ Unboxing వీడియో ను తెలుగులో చూడండి… క్రింద వీడియో కనిపించకపోతే ఈ లింక్ లో చూడగలరు.
ప్రాక్టికల్ గా ఇది చేసే పనులు…
- మీరు స్మార్ట్ ఫోన్ అండ్ హెడ్ సెట్ రెండూ ఉపయోగించి వీడియోస్ ను 3D మరియు 2D థియేటర్(సేమ్ థియేటర్ లో సినిమా స్క్రీన్ వ్యూ లా ఉంటుంది) ఎక్స్పీరియన్స్ ను పొందగలరు.
- 360 డిగ్రీ వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ – దీనిలో వచ్చే ప్రాక్టికల్ విషయాలు ఏంటంటే..
- 360 డిగ్రీ వీడియోస్ చూడగలరు(ఆఫ్ కోర్స్ ఆ వీడియో 360 లో షూట్ చేస్తేనే). అంటే హెడ్ సెట్ పెట్టుకొని హెడ్ ఎటువైపు టర్న్ చేస్తే వీడియో అటువైపు ఉన్న దృశ్యాన్ని చూపిస్తుంది. ఫర్ eg: టెంపుల్ రన్ గేమ్ వంటి గేమ్స్ ఆడితే, మీ వెనుక monster ఎంత దూరంలో ఉందో చూడాలంటే మీరు నిజంగా వెన్నక్కి బుర్ర తిప్పి చూడాలి. సో ఇక్కడ హెడ్ సెట్ వలన monster మీ వెనుకే వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది నిజంగా. ఇదే అసలైన VR ఎక్స్పీరియన్స్.
- ఏదైనా live ఈవెంట్ కు ఫిజికల్ గా మీరు అటెండ్ కాకపోయినా ఈవెంట్ నిర్వాహకులు VR లైవ్ స్ట్రీమింగ్ సపోర్ట్ ఇస్తే VR హెడ్ సెట్ ద్వారా మీ ఇంటి లో వీడియో చూస్తే ఈవెంట్ లో మీరు పోల్గోన్నట్లే ఉంటుంది.
- స్మార్ట్ ఫోన్ ద్వారా గేమింగ్ కూడా లైవ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్(360 డిగ్రీ వ్యూయింగ్) లా ఉంటుంది. ఇదే పైన చెప్పిన example. కాని అదనంగా దీనికి బ్లూ టూత్ గేమింగ్ కంట్రోల్స్ కావాలి. సామ్సంగ్ గేర్, Oculus VR హెడ్ సెట్ వంటి high end VR's exclusive VR games తో వస్తున్నాయి. ప్లే స్టోర్ లో కూడా కొన్ని VR సపోర్టింగ్ గేమ్స్ ఉంటాయి. ఇవి ఏ VR పైన అయినా ఆడుకోగలరు. ప్రతీ నార్మల్ గేమ్ ను VR లో ఆడటానికి అవ్వదు. ఆ గేమ్స్ సెపరేట్ గా VR సపోర్ట్ తో రావాలి.
1Rupee Oneplus Loop VR headset front
అంటే సింపుల్ గా.. VR అనేది మూడు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. highest entertainment – 360 వీడియోస్ ఎక్స్పీరియన్స్, సెకెండ్ highest 3D థియేటర్ మాక్స్ మోడ్, లాస్ట్ but not least 2D థియేటర్ మాక్స్ మోడ్.
అసలైన VR ఎక్స్పీరియన్స్.. అంటే 360 డిగ్రీ ఎక్స్పీరియన్స్ (eg:VR Live ఎక్స్పీరియన్స్) ను ఆనందించాలంటే మీ స్మార్ట్ ఫోన్ లో Gyroscope (దిశలను తెలిపేది) ఉండాలి. ఇది లేకపోతే మీరు హెడ్ సెట్ పెట్టుకున్నప్పుడు పక్కకు తిరిగినా VR view టర్న్ అవ్వదు. మిగిలిన 3D అండ్ 2D థియేటర్ మాక్స్ మోడ్ ఎక్స్పీరియన్స్ లకు Gyroscope సెన్సార్ తో సంబంధం లేదు.
సరే మరి Gyroscope నా ఫోన్ లో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
ఇందుకు ఏదైనా sensors యాప్ ను ప్లే స్టోర్ నుండి ఇంస్టాల్ చేసుకొని ఓపెన్ చేసి చెక్ చేయగలరు. ఫర్ eg ఈ లింక్ లో ఉన్న సెన్సార్ యాప్ ను ఇంస్టాల్ చేసుకొండి. ఇప్పుడు మీకు Gyroscope సెన్సార్ కలర్ ఫుల్ గా ఉంటే మీ ఫోన్ లో Gyro సెన్సార్ ఉన్నట్లు, డిమ్ గా/కలర్ లెస్ గా ఉంటే లేనట్లు లేదా gyro ప్రాబ్లెం ఉన్నట్లు. సో ప్రాబ్లెం ఉందేమో అనే డౌట్ ఉన్నవారు ఆ ఫోన్ మోడల్ తో గూగల్ లో స్పెసిఫికేషన్స్ సర్చ్ చేస్తే gyro ఉందో లేదో తెలుగుకోగలరు. Gyrosensor లేటెస్ట్ టెక్నాలజీ కాదు, సో పాత ఫోనుల్లో ఉండవచ్చు, కొత్తగా కొన్న ఫోనుల్లో ఉండకపోవచ్చు. బడ్జెట్ లో ఫోనులు ఇవ్వటానికి.. కాస్ట్ కటింగ్ కొరకు కొత్త ఫోనుల్లో sensors ను తీసివేయటం జరుగుతుంది. Gyro ఉంటేనే VR గేమింగ్ కూడా ఆడుకోగలరు. అంటే గేమ్ ను VR హెడ్ సెట్ పెట్టుకొని play చేస్తుంటే గేమ్ ను మీరు ఫోన్ లో అడుతున్నట్లు ఉండదు, ఆ గేమ్ మీ రియల్ లైఫ్ లో ఆడుతున్నట్లు ఉంటుంది.
Oneplus Loop VR headset sides (no buttons on any side)
Oneplus Loop VR headset Top
హార్డ్ వేర్ పరంగా ఏమి ఉండాలో చెప్పారు. మరి సాఫ్ట్ వేర్ వైజ్ గా కూడా ఏమైనా కావాలా?
థియేటర్ మోడ్ ను ఎక్స్పీరియన్స్ చేయటానికి ప్లే స్టోర్ లో కొన్ని VR యాప్స్ ఉన్నాయి. అవి కావాలి. లేదంటే థియేటర్ మోడ్ ఉండదు. లెనోవో Vibe K4 నోట లో థర్డ్ పార్టీ యాప్స్ సహాయం లేకుండా కంపెని డిఫాల్ట్ గా ఒక స్క్రీన్ పై కనిపించే దేనినైనా థియేటర్ మోడ్ లో చూపించే ఆప్షన్ ఇచ్చింది. మిగిలిన ఫోనుల్లో థియేటర్ మాక్స్ మరియు 3D థియేటర్ విడియోస్ ను చూడాలంటే క్రింద యాప్స్ ఉండాలి.
- VR Player – Playstore Link – ఈ యప్ ద్వారా Gyroscope లేకపోయినా హెడ్ టర్నింగ్ వ్యూ(360 డిగ్రీ ఎక్స్పీరియన్స్) ను ఆస్వాదించగలరు. ఆవును పైన చాలా చెప్పాను. కాని దీనితో Gyro లేకపోయినా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది 🙂 అయితే కంప్లీట్ గా కాదు. కాని ఫర్వాలేదు అనిపిస్తుంది. ఇందుకు ఫోన్ లో compass మాత్రం ఉండాలి. యాప్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి advanced సెట్టింగ్స్ లోకి వెళ్లి Orientation మెను లో Accelerometer+Compass ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు compass ద్వారా హెడ్ టర్నింగ్ పనిచేస్తుంది కొంత మేరకు. అలాగే మీ ఫోనులోని వీడియోస్ ను థియేటర్ మోడ్ లో కూడా చూపిస్తుంది. రైట్ కార్నర్ లో ఉన్న 3 డాట్ లైన్ పై క్లిక్ చేసి open file ను టాప్ చేస్తే మీ ఫోన్ లోని వీడియోస్ ను థియేటర్ మోడ్ లో చూస్తారు. అయితే థియేటర్ మోడ్ కొరకు దీని కన్నా క్రింద అప్లికేషన్ బాగా పనిచేస్తుంది Oneplus loop VR హెడ్ సెట్ లో. దీనిలో సెట్టింగ్స్ అన్నీ టెస్ట్ చేస్తూ VR లో చెక్ చేసుకోవాలి. అదే మైనస్. ప్లస్ వెర్షన్ కొంటే youtube వీడియోస్ కూడా థియేటర్ మోడ్ లో చూడగలరు.
- Var's VR Video Player – Playstore Link – ఈ యాప్ ద్వారా మీరు మీ ఫోన్ లో ఉన్న ఏ వీడియో అయిన థియేటర్ మోడ్ లో చూడగలరు. ఇదే యాప్ కాన్సెప్ట్ లెనోవో VR హెడ్ సెట్ లో సెపరేట్ గా ఫీచర్ ఇచ్చింది లెనోవో. యాప్ ఓపెన్ చేసి, play సింబల్ పై టచ్ చేయండి. ఇప్పుడు browse లేదా గేలరీ ద్వారా మీ ఫోన్ లోని వీడియోస్ ను ఓపెన్ చేయండి. ఇప్పుడు వీడియో ను సెలెక్ట్ చేసుకున్న తరువాత వచ్చే స్క్రీన్ లో Normal అని ఉన్న మొదటి బ్లాక్ లో STATIC ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. మీకు వీడియో రెండు స్క్రీన్స్ గా ప్లే అవుతుంది. రెండు స్క్రీన్స్ గా ప్లే అయితే అది కరెక్ట్ మెథడ్. దానిని VR లో చూస్తె సింగిల్ గా పెద్ద వీడియో లా కనిపిస్తుంది. సో ఇది కళ్ళకు దగ్గర ఉండటం వలన థియేటర్ మోడ్ లా ఉంటుంది. సో ఇలా మీ ఫోన్ లోని సినిమాలను, వీడియోస్ ను థియేటర్ మోడ్ లో ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇదే యాప్ 3D వీడియోస్ ను కు కూడా వాడుకోగలరు. youtube లో శాంపిల్ 3D (link) వీడియో ను డౌన్లోడ్ చేసుకొని ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేయండి. ఇప్పుడు Var's VR ప్లేయర్ యాప్ ను ఓపెన్ చేసి 3D వీడియోను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు Vertical Block లో ఉన్న STATIC ఆప్షన్ ను సెలెక్ట్ చేసి ఫోన్ ను VR లో పెట్టుకొని 3D థియేటర్ మాక్స్ మోడ్ లో ఆనందించగలరు. అయితే ఇది actual 3D కాదు. SBS 3D. అంటే side by side స్క్రీన్స్ తో వచ్చే 3D ఇంపాక్ట్. సేమ్ మీరు థియేటర్ లో 3D చూసినట్లు ఉంటుంది 🙂
- iPlay SBS Player – Playstore Link – ఇది Var's కన్నా బాగుంది. మీకు జనరల్ గా Half SBS 3D(HSBS) వీడియోస్(మూవీస్) ఎక్కువుగా దొరుకుతాయి ఇంటర్నెట్ లో. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ ద్వారా ప్లే చేయగలరు. ఈ ప్లేయర్ వాడేటప్పుడు స్క్రీన్ ఆటో రొటేషన్ లో ఉండాలి. HSBS వీడియోను ప్లే చేసేటప్పుడు యాప్ లో Input వద్ద Half SBS 3D ను సెలెక్ట్ చేసుకోవాలి. అంతే 3D లో వస్తుంది VR థియేటర్ మోడ్ లో.
- గూగల్ కార్డ్ బోర్డ్ యాప్ ఉంది. కాని ఇది మీ ఫోన్ లో Gyroscope ఉంటేనే ఇంస్టాల్ చేసుకోవటానికి అవుతుంది. లేదంటే అస్సలు యాప్ కనిపించదు. కార్డ్ బోర్డ్ యాప్ ప్లే స్టోర్ లింక్
సో ఏ VR కొనాలి నేను? ఏది బెస్ట్ VR?
VR హెడ్ సెట్ కంపెని/మోడల్ ఏదైనా, అది కంప్లీట్ గా పైన చెప్పినవన్నీ చేస్తాయి. కాని క్వాలిటీ వైజ్ గా అవి ఎలా ఉంటాయి అనేది మీరు అమెజాన్ అండ్ ఇతర సైట్స్ లో రివ్యూస్ చూసి కొనగలరు. మీ ఫోన్ లో Gyroscope sensor ఉంటే చాలు, థియేటర్ మోడ్ అండ్ 3D తో పాటు 360 వీడియోస్ అండ్ VR గేమింగ్ సపోర్ట్ చేస్తాయి. కొన్ని గూగల్ కార్డ్ బేస్డ్ బేసిక్ VR's కు అయితే VR లో ఉండగా స్క్రీన్ పై టాప్ చేయటానికి magnetic sensor అదనంగా కావాలి ఫోన్ లో. Google CardBoard VR హెడ్ సెట్స్ గురించి ఈ లింక్ లో తెలుసుకోండి.
Oneplus 3 Loop VR లో బాడీ పై ఎక్కడా ఫిజికల్ బటన్స్ లేవు. ఇది మైనస్. ఎందుకంటే ఫోన్ స్క్రీన్ పై ఏమి చేయాలనుకున్నా అన్నీ ముందే చేసుకోవాలి. VR లోపల పెడితే స్క్రీన్ ను టచ్ చేసే డిజైన్ లో లేదు VR. లెనోవో vibe K4 నోట్ ANT VR అయితే VR లో పెట్టినా స్క్రీన్ ను access చేయగలరు.
బాక్స్ తో పాటు ప్లాస్టిక్ బిల్డ్ VR హెడ్ సెట్ with horizontal strap బ్యాండ్ ఉంటుంది. మరొక బాండ్ విడిగా ఉంటుంది. దీనిని ఆల్రెడీ ఉన్న బ్యాండ్ కు మరియు VR పై భాగంలో ఉన్న రింగ్ కు (గట్టిగా ప్రెస్ చేసి తగిలించాలి) మధ్యలో ఉంటుంది. ఈ బ్యాండ్ హెడ్ పైన ఉంటుంది. ఇంకా హెడ్ సెట్ ను ఎలా ఆపరేట్ చేయాలి అని manual కూడా ఉంది. దానిని బాగా చూస్తె అంతా క్లియర్ గా ఉంటుంది. ఇంకా లెన్స్ ను క్లిన్ చేయటానికి cloth ఉంది. అంతే! VR లెన్స్ పై క్వరాస్ ఉంటాయి. వాటిని తీసేయవచ్చు. బాండ్స్ లో ఉన్న knobs ను చివరి వరకు లాగితే బాండ్ loose అవుతుంది. బాక్స్ తో పాటు వచ్చిన measurement లో loose చేయకుండా VR పెట్టుకుంటే nose కు తగులుతుంది VR బాడీ. జూన్ 14 న దీని సహాయంతో మీరు oneplus 3 మొబైల్ ను కొనగలరు. ఇందుకు సంబంధించి ప్లే స్టోర్ లో యాప్ కూడా ఉంది. ఈ లింక్ లో డౌన్లోడ్ చేసుకోండి. దయ చేసి ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను ఫేస్ బుక్ మరియు సైట్ లో క్రింద కామెంట్స్ సెక్షన్ లో తెలపగలరు.