Xiaomi రెడ్మి నోట్ 3, LeEco LE1S అండ్ హానర్ 5X – ఈ మూడింటిలో ఏది బెటర్? ఈ ప్రశ్నకు సమాధానం తెలియక చాలా మంది మూడింటిలో ఏది తీసుకోవాలో క్లారిటీ miss అవుతున్నారు. సో ఇక్కడ మీకు ఈ మూడింటినీ in depth గా కంపేర్ చేసి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాము చూడండి..
బిల్డ్ అండ్ డిజైన్:
మూడు same డిజైన్ లాంగ్వేజ్ లో చాలా slight డిఫరెన్స్లు ఉన్నాయి. హానర్ 5x లో హెవీ ప్లాస్టిక్ ఉంది ఫ్రంట్ లో. ఇది కొంచెం cheap లుక్ ఇస్తుంది మిగిలిన రెండింటితో కంపేర్ చేస్తే. సో డిజైన్ వైజ్ హానర్ కన్నా మిగిలిన రెండూ బెస్ట్ అని మా ఉద్దేశం.
మరింత లోతుగా వెళితే, LE1S అండ్ రెడ్మి నోట్ 3 లలో మెయిన్ గా రెడ్మి లో rounded edges difference గా తెలుస్తుంది. రెండూ లైట్ అండ్ comfortable గా మెటల్ బాడీ తో మంచి ఫీల్ ఇస్తాయి. ఇక్కడ రెడ్మి లో బ్యాక్ సైడ్ స్పీకర్ వద్ద flat surface లపై ఫోన్ ప్లేస్ చేస్తే సౌండ్ తగ్గకుండా ఉండటానికి చిన్న బెంట్ ఉంది డిజైన్ పరంగా. కాని ఓవర్ ఆల్ గా more సాలిడ్ బిల్ట్ అండ్ thinner బాడీ కారణంగా బిల్డ్ అండ్ డిజైన్ లో LeECo బెస్ట్. అయితే రెడ్మి నోట్ 3 కూడా మంచి డిజైన్ కలిగి ఉంది కంపేర్ చేయకపోతే.
పెర్ఫార్మన్స్:
గతంలో LE1S ను వైబ్ K4 అండ్ హానర్ 5x తో కంపేర్ చేసినప్పుడు Le1S బాగా పెర్ఫార్మన్స్ ఇస్తుంది అని తెలియజేయటం జరిగింది. సో ఇక్కడ కాంపిటిషన్ మెయిన్ గా రెడ్మి నోట్ 3 అండ్ LE1S ల మధ్య ఉంటుంది ఇప్పుడు..
అన్నీ కన్సిడర్ చేసిన తరువాత pure పెర్ఫార్మన్స్ పాయింట్ ఆఫ్ view లో రెడ్మి నోట్ 3 లో ఉన్న స్నాప్ డ్రాగన్ 650 SoC LE1S లో ఉన్న మీడియా టెక్ Helio X10 SoC ను మించి వేసింది. మీరు గిక్ బెంచ్ మల్టీ కోర్ స్కోర్స్ చూస్తె క్రింద, Helio కు అదనంగా రెండు కోర్స్ ఉండటం వలన రెడ్మి కన్నా బెటర్ స్కోర్ వస్తుంది. కాని sd 650 లో heat management అండ్ far సుపీరియర్ GPU పెర్ఫార్మన్స్ ఉండటం వలన రెడ్మి నోట్ 3 ఓవర్ ఆల్ గా పెర్ఫార్మన్స్ లో LE1S కన్నా బెస్ట్.
కెమేరా:
మూడు కెమేరా సెగ్మెంట్ లో పెద్దగా ఇంప్రెస్ చేయలేదు అని చెప్పాలి. మూడు చాలా దగ్గరగా ఉంటాయి క్వాలిటీ పరంగా. క్రింద samples లో చూడండి..
outdoor లైటింగ్ లలో 3 ఫోనులు మంచి షాట్స్ తీస్తున్నాయి. కాని LE1S అండ్ హానర్ 5x బ్రైట్ వైట్ స్టూడియో లైటింగ్ లో bleach ఎఫెక్ట్ ఇస్తున్నాయి ఇమేజెస్ లో. Low లైటింగ్ లో మూడు ఫోనులు disappointing, అందుకే కెమేరా లో మూడు ఇంప్రెస్ చేయలేదు అని చెప్పటం జరిగింది.
యూజర్ ఇంటర్ఫేస్:
ui ఆధారంగా డివైజ్ లను difference చేయటం కరెక్ట్ కాదు. హానర్ లో emotion ui, రెడ్మి లో Mi UI , LE1S లో eUI ఉన్నాయి. MiUI లో Visual IVR, private మెసేజింగ్, హిడెన్ folders etc ఉండటం వలన Mi UI మిగిలిన రెండింటి కన్నా lead లో ఉంది. అంతేకాదు mi ui మరింత optimise అయ్యి కూడా ఉంటుంది.
Le1S eUI రెగ్యులర్ ఆండ్రాయిడ్ కు చాలా మార్పులు చేయటం వలన భిన్నంగా ఉంటుంది. అంటే మీరు అలవాటు పడటానికి టైమ్ పడుతుంది కొంచెం. ui మాత్రం బాగా optimise అయ్యి ఉంది. మెయిన్ ప్లస్ పాయింట్స్ దీనిలో Le view అండ్ Le Live స్క్రీన్స్. ఇవి ఇండియన్ హాండ్ సెట్స్ లో లేవు. సో LeEco యొక్క eUI బాగున్నా, MiUI కాదని దీనిని recommend చేయలేము ప్రస్తుతానికి.
లాస్ట్ గా హానర్ emotion ui ఉంది. మోడరన్ గా ఉండవు దీని లుక్స్. మరియు కొంచెం హెవీ గా అనిపిస్తుంది. 2gb ర్యామ్ లో ఎప్పుడూ 900MB కన్నా ఎక్కువ free ర్యామ్ చూడలేదు. సో మూడింటిలో MiUI బెస్ట్.
డిస్ప్లే:
రెడ్మి లో బ్రైట్ గా ఉంది డిస్ప్లే, కాని slight గా బ్లూ షెడ్ ఇస్తుంది. దీని వలన cool గా ఉంటుంది డిస్ప్లే. అయితే కలర్ tones ను డిస్ప్లే సెట్టింగ్స్ లో మార్చుకోగలరు. Le1S లో dim డిస్ప్లే ఉంది రెడ్మి నోట్ 3 తో కంపేర్ చేస్తే. సో దాని మీద రెడ్మి నోట్ 3 బెస్ట్ ఛాయిస్. అయితే Le 1S హానర్ 5x కన్నా మంచి డిస్ప్లే అని చెప్పాలి. హానర్ లో కూడా డిస్ప్లే quite cool కాని టచ్ పెర్ఫార్మన్స్ బాలేదు. అయితే ఇదే ప్రాబ్లెం concore గ్లాస్ కారణంగా రెడ్మి నోట్ 3 లో కూడా ఉంటుంది, కాని హానర్ 5x కన్నా బెటర్ అని చెప్పాలి. ఓవర్ ఆల్ గా మూడింటిలో డిస్ప్లే మాత్రం రెడ్మి నోట్ 3 బెస్ట్.
బాటమ్ లైన్
xiaomi రెడ్మి నోట్ 3 ద్వారా కంపెని మరలా ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను తన వైపు తిప్పుకునే అంశాలు చాలా కనిపిస్తున్నాయి రెడ్మి నోట్ 3 పనితనం లో. ఒక్క Low లైటింగ్ లో weak క్వాలిటీ ఫోటోస్ మినహా దీనిలో ఎటువంటి మైనస్ విషయాలు లేవు. సో ఫైనల్ గా అన్నీ కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ గా మరియు టాప్ ప్రొసెసర్ పెర్ఫార్మన్స్ తో xiaomi రెడ్మి నోట్ 3 ఈ మూడింటిలో బెస్ట్ డివైజ్. XIAOMI REDMI NOTE 3 కంప్లీట్ తెలుగు VIDEO రివ్యూ క్రింద చూడగలరు..