కంపేరిజన్: Xiaomi Mi 5 Vs OnePlus 2

Updated on 20-Apr-2016

24,999 రూ లకు 3GB ర్యామ్ తో లాంచ్ అయిన Xiaomi Mi5 మంచిదా లేక 4GB ర్యామ్ తో 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో లాంచ్ అయిన oneplus 2 మంచిదా?

ఈ ప్రశ్నకు సమాధానం తో పాటు క్లారిటీ మరియు కంపేరిజన్ ఇక్కడ మీ కోసం…

బిల్డ్ అండ్ డిజైన్: Mi 5
oneplus 2 built బాగుంటుంది. కాని లుక్స్ వైజ్ గా Xiaomi Mi 5 అంత అందంగా ఉండదు అని ఒప్పుకొని తీరవలసిన విషయం. వెనుక ఉన్న sandstone బ్యాక్ Mi 5 వెనుక ఉన్న గ్లాస్ curved బ్యాక్ డిజైన్ కన్నా బెటర్ కాదు. అంతేకాదు Mi 5 తో పోలిస్తే oneplus 2 ఏ విధంగానూ కాంపాక్ట్ గా ఉండదు స్క్రీన్ సైజ్ కారణంగా.

అయితే sandstone మాత్రం గ్రిప్ ఇస్తుంది గ్లాస్ బ్యాక్ కన్నా బెటర్ గా. Mi 5 స్లిప్ అయ్యే chances చాలా ఎక్కువ. బరువు మాత్రం oneplus 2 ఎక్కువ. సో ఇక్కడ డిజైన్ అండ్ లుక్స్ వైజ్ గా Mi 5 విన్నర్.

పెర్ఫార్మన్స్: Mi 5(SD 820 వలన)
స్నాప్ డ్రాగన్ 820(Mi 5) Vs స్నాప్ డ్రాగన్ 810 (oneplus 2). oneplus 2 లోనిది one ఇయర్ ఓల్డ్ SoC. కాని డిస్ప్లే Mi కన్నా పెద్దది. larger ఫుల్ HD డిస్ప్లే ఉంది. కాని రియల్ వరల్డ్ మరియు బెంచ్ మార్క్స్ రెండు విధాలుగానూ Mi 5 స్మార్ట్ ఫోన్ oneplus 2 ను ఓడించింది.

ఇందుకు ప్రధాన కారణం Mi 5 లో ఉన్న లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్. కాని గొప్ప విషయం ఏంటంటే oneplus 2 హిటింగ్ issues పరంగా బాగా మేనేజ్ చేసింది ఫోన్ ను. Mi 5 కూడా బెస్ట్ హీటింగ్ management తో వస్తుంది. Mi 5 లోని ప్రొసెసర్ 1.8GHz వరకూ రన్ అవుతుంది, oneplus 2 ప్రొసెసర్ 0.8 నుండి 1GHz వద్ద రన్ అవుతుంటుంది.


Xiaomi Mi 5 Heat Graph


OnePlus 2 Heat Graph

 కాని రెగ్యులర్ users కు os లో ఎటువంటి బగ్స్(issues) ఉండకుండా పనిచేసే విధంగా ఈ రెండు ఫోనులు లేవు. రెండింటిలోనూ os పరంగా కొన్ని బగ్స్ ఉన్నాయి. అవి ఫోన్ ను వదలేనంత ఇబ్బందికరమైనవి కాకపోయినా అప్పుడప్పుడు చికాకు తెప్పిస్తాయి. ఫర్ eg Mi 5 లో మీరు Google Now On Tap వాడలేరు..అదేవిధంగా oneplus 2 లో home స్క్రీన్ పైన ఉండే గూగల్ సర్చ్ bar కనపడదు చాలా సార్లు.

కెమేరా: oneplus 2
Mi 5 లో వీక్ పాయింట్ ఇదే. 16MP లెన్స్ ఉన్న ఫోటోస్ లో షార్ప్ నెస్ miss అవుతుంది. oneplus 2 లో షార్ప్ నెస్ డే లైట్ లో ఎక్కువుగా ఉంటుంది. indoor లో Mi 5 కన్నా బెటర్ షార్ప్ నెస్ అండ్ బ్రైట్ నెస్ ఇస్తుంది కూడా. అయినా Low లైట్ లో రెండూ దగ్గరగా ఉంటాయి mostly.


Xiaomi Mi 5 Camera Samples (L-R) Daylight,Studio White Lights,Indoor Fluorescent Lights,Low Light (Click to enlarge)


OnePlus 2 Camera Samples (L-R) Daylight,Studio White Lights,Indoor Fluorescent Lights,Low Light (Click to enlarge)

బ్యాటరీ: ఆల్మోస్ట్ సేమ్ రెండూ
oneplus 2 హెవీ usage లో 14 గంటలు రాగా, Mi 16 గంటలు వరకూ వస్తుంది. గీక్ బెంచ్ 3 బ్యాటరి టెస్ట్ లో oneplus 2 కన్నా రెండు రెట్లు ఎక్కువుగా వస్తుంది Mi 5. కాని రియల్ వరల్డ్ లో ఇంట తేడా కనపడటం లేదు. సో ఫైనల్ గా చెప్పాలంటే Mi 5 oneplus 2 కన్నా కొంచెం ఎక్కువ బ్యాక్ అప్ ఇస్తుంది.

స్టోరేజ్: oneplus 2
MI 5 లో ఉన్న 32GB స్టోరేజ్ మోస్ట్ రెగ్యులర్ users కు సరిపోతుంది ప్రస్తుతం కాని ఇంకా ఎక్కువ ఉంటే మంచిది. ఆఫ్ కోర్స్ SD స్లాట్ ఉంది కాని అది హై బ్రిడ్ స్లాట్. oneplus 2 లో ఇంటర్నెల్ స్టోరేజ్ 64GB(ఈ ప్రైస్ ర్యాంజ్ లో) ఉంది. sd కార్డ్ స్లాట్ లేదు. కాని ఈజీగా సరిపోతుంది 64gb.

బాటమ్ లైన్: Mi 5 విన్నర్
Mi 5 ఫ్లాగ్ షిప్ క్లాస్ స్మార్ట్ ఫోన్ అయ్యుండవచ్చు కాని ఫ్లాగ్ షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్ కాదు. 24,999 రూ మంచి డివైజ్ ఇది. కేవలం కెమేరా ఒకటే నిరుత్సాహం. oneplus 2 కన్నా బెటర్ డిస్ప్లే, పెర్ఫార్మన్స్ ఉన్నాయి Mi 5 లో. ఒక్క కెమేరా మినహా దాదాపు అన్ని విషయాలలో Mi 5 oneplus 2 పై గెలిచింది. సో రెండింటిలో విన్నర్ Mi 5

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Connect On :