LeEco Le1S( రివ్యూ అండ్ తెలుగు వీడియో ఓవర్ వ్యూ లింక్ ) , లెనోవో vibe K4 నోట్( రివ్యూ ) అండ్ హానర్ 5X మూడు మొబైల్స్ ఒకే బడ్జెట్ సెగ్మెంట్ లో రిలీజ్ అయ్యి ఇండియన్ కన్స్యూమర్స్ ను బాగా ఆకర్షించాయి. ఇక్కడ ఈ మూడింటిని కంపేర్ చేద్దాం రండి..
పెర్ఫార్మన్స్ –
బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రకారం Le 1S లో ఉన్న మీడియా టెక్ Helio X10 SoC… స్నాప్ డ్రాగన్ 616(హానర్ 5x) మరియు మీడియా టెక్ MT6753 (K4 నోట్) ల కన్నా ఎక్కువ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. GFXBench Manhattan Onscreen బెంచ్ మార్క్ లో కూడా Le1S ఈజీగా 500 ప్లస్ ఫ్రేమ్స్ ను ఇస్తుంది, కాని మిగిలిన రెండు మోడల్స్ 400 కన్నా తక్కువ స్కోర్ తో ఉన్నాయి.
3D మార్క్ టెస్ట్(మొత్తం సిస్టం ను కన్సిడర్ చేస్తుంది టోటల్ గ్రాఫిక్స్ టెస్టింగ్ లో) లో కూడా తక్కువ డిఫరెన్స్ మాత్రమే ఉంది Le 1S కు మిగిలిన రెండింటికి. అయితే రెగ్యులర్ పెర్ఫార్మన్స్ geekbench 3 accurate డిఫరెన్స్ చూపిస్తుంది.
ఇప్పుడు రియల్ వరల్డ్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే బెంచ్ మార్క్స్ లో ఉన్నట్టే సేమ్ differences కనిపిస్తున్నాయి. అంటే Le 1S మిగిలిన రెండింటి కన్నా బెటర్ గా ఉంది. హానర్ 5x లో కొత్త గ్రాఫిక్స్ కు సంబంధించి డ్రైవర్స్ సరిగా optimise చేయనట్లు అనిపిస్తుంది. ఎందుకంటే GFX బెంచ్ పై Manhattan 3.0 టెస్ట్స్ రన్ అవుతున్నాయి కాని Manhattan 3.1 టెస్ట్స్ రన్ అవలేకపోతున్నాయి. అలాగే హానర్ 5x 5GHz WiFi bands ను కూడా సపోర్ట్ చేయటం లేదు.
ఓవర్ ఆల్ గా పెర్ఫార్మన్స్ లో Le 1S winner మూడింటిలో. అయితే చాలా మంది Le1S పై హిటింగ్, లాగ్స్ అండ్ బ్యాటరీ ఇష్యూలు ఉన్నాయి అని అంటున్నారు. వీటికి కొన్ని టిప్స్ అండ్ సల్యుషణ్ ఈ లింక్ లో తెలిపాము. చదవగలరు.
Winner: LeEco Le 1s
డిస్ప్లే –
మూడు ఫోనులు 5.5 ఫుల్ HD డిస్ప్లే లతో వస్తున్నాయి. ఇక్కడ కూడా Le1S రెండింటినీ outperform చేసింది. కలర్స్ విషయంలో Le1S కొంచెం warmer గా ఉంది, హానర్ 5X cooler కలర్ ఎలెమెంట్స్ ఇస్తుంది. ఈ రెండింటికీ మధ్యలో K4 నోట్ ఉంది. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎక్కువ మంది warm కలర్స్ ను ఇష్టపడతారు. కాంట్రాస్ట్ అండ్ షార్ప్ నెస్ లో కూడా Le1S బాగుంది.
Winner: LeEco Le 1s
బిల్డ్ అండ్ డిజైన్ –
హానర్ 5x మరియు Le1S కు మెటల్ బాడీ ఉండటం వలన K4 నోట్ కన్నా పై చేయి లో ఉన్నాయి ఇవి.pure లుక్స్ ప్రకారం చెప్పాలంటే అది పెర్సనల్ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది, కాని బ్యాక్ నుండి చూస్తే Le1S మరియు హానర్ 5X రెండూ ఒకేలా ఉంటాయి(సైజెస్ మినహాయిస్తే).
అలాగే హానర్ కు ఫ్రంట్ లో healthy ప్లాస్టిక్ ఉంటుంది కాని ప్లాస్టిక్ అవటం వలన Le1S కన్నా తక్కువ ప్రీమియం గా అనిపిస్తుంది 5X. అలాగే హానర్ 5X అంత wide గా లేదు కాబట్టి ఫైనల్ గా Le1S మంచి కంఫర్ట్ డిజైన్ తో కూడా వస్తుంది అని చెప్పలి. లెనోవో vibe K4 నోట్ బిల్డ్ లో అన్ని విధాలుగా వెనుకబడింది మూడింటిలో. దీనిలో కేవలం మెటల్ అనేది ఫ్రేమ్ లో మాత్రమే ఉంది. అది కూడా Low గ్రేడ్ గా ఉంటుంది కంపేర్ చేస్తే వీటితో. వెనుక కూడా matte ప్లాస్టిక్ ఇచ్చింది లెనోవో. మిగిలిన రెండింటిలో క్వాలిటీ మెటల్ లేకపోయినా మెటల్ బ్యాక్ తో వస్తున్నాయి atleast.
Winner: LeEco Le 1s
కెమేరా –
13MP రేర్ కేమేరా విషయంలో హానర్ మరియు లెనోవో కన్నా Le1S ఈజీగా వెనుకబడింది. షార్ప్ నెస్ లేదు, డిటేల్స్ లేవు. అంతే కాదు depth లేని కలర్స్ ఇస్తుంది బ్రైట్ లైటింగ్ లో ఫోటోస్ తీసినా.
ఇక లెనోవో vibe K4 నోట్ అండ్ హానర్ 5X లో రెండింటికీ క్వాలిటీ దగ్గరగా ఉంది. K4 హానర్ 5X అంత ఫాస్ట్ గా ఫోకస్ ఇవటం లేదు అలాగే struggle అవుతుంది అప్పుడప్పుడు ఫోకస్ చేయటానికి. ఈ విషయంలో Le 1S fastest కెమేరా అని చెప్పాలి మిగిలిన రెండింటితో కంపేర్ చేస్తే.
ఫైనల్ గా హానర్ 5X బెస్ట్ ఇమేజెస్ షూట్ చేస్తుంది. అది సన్ లైట్ లో అయినా Low లైటింగ్ లో అయినా. బెటర్ డిటేల్స్ అండ్ sharper ఇమేజెస్ with balanced కలర్స్ ఇస్తుంది.
Winner: Honor 5X
యూజర్ ఇంటర్ఫేస్ –
మూడు ఫోన్లలో ఎక్కువ functionality లేదు UI పాయింట్ ఆఫ్ view లో చెప్పాలంటే. లెనోవో మాత్రం కొంచెం stock (ఒరిజినల్) ఆండ్రాయిడ్ లుక్స్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. మిగిలిన రెండు ఫోనులు గూగల్ ఒరిజినల్ ఆండ్రాయిడ్ లుక్స్ కు చాలా దూరం గా ఉన్నాయి. Le1S లో కొత్తగా అలవాటు పడాలి ui వాడాలంటే. క్లీన్ లుక్స్ విషయంలో మాత్రం Le1S బెటర్ అని చెప్పాలి. ఫైనల్ ఛాయిస్ మాత్రం యూజర్ కు సంబందించిన విషయం, ఎందుకంటే మూడింటిలో గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్స్/optimisation అంటూ ఏమి లేవు.
Winner: Tie
బాటమ్ లైన్ –
ఎక్కువ విషయాలలో Le 1S బెస్ట్ అని అర్థమవుతుంది కంపేర్ చేస్తే, కాని కెమేరా విషయంలో weak ఇది. సో మీకు కెమేరా అనేది ముఖ్యమనుకుని మిగలిన విషయాలలో compromise అయినా ఫర్వాలేదు అనుకుంటే హానర్ 5X బెటర్ ఛాయిస్ మూడింటిలో. లేదంటే Le1S బెటర్ ఛాయిస్ ఈ బడ్జెట్ లో. లెనోవో K4 నోట్ మొదటి అభిప్రాయాలలో బాగుంటుంది కాని కాంపిటేషన్ వలన వెనుకబడింది.
Final Winner: LeEco Le 1s (మరి మీ ఒపినియన్ లో మూడింటిలో ఏది బెస్ట్ ఫోన్ అనేది కామెంట్స్ లో తెలపండి)
Le1S కొన్న వారు చెబుతున్న issues అండ్ వాటికీ సల్యుషన్ మరియు టిప్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Le 1S కంప్లీట్ రివ్యూ ను ఈ లింక్ లో చదవగలరు.
లెనోవో K4 నోట్ కంప్లీట్ రివ్యూ ను ఈ లింక్ లో చదవగలరు.
Le 1S బిల్డ్ అండ్ ఫీచర్స్ హాండ్స్ ఆన్ ఓవర్ వ్యూ తెలుగు వీడియో ఈ క్రింద చూడగలరు…