కంపేరిజన్: LeEco Le 2 vs Xiaomi రెడ్మి నోట్ 3
ఇక్కడ MOTO G4 Plus, Xiaomi రెడ్మి నోట్ 3 అండ్ LeEco Le 2 లను అన్ని సెగ్మెంట్స్ లో కంపేర్ చేసి ఏది బెస్ట్ అని తెలియజేయటం జరిగింది.
ఇప్పటి వరకు అండర్ 15K లో టాప్ ఫోన్ అంటే రెడ్మి నోట్ 3. MOTO G4 ప్లస్ కూడా కెమెరా లో మించినా, స్పీడ్ వైజ్ గా మించలేకపోయింది రెడ్మి ను. మరి Le 2 Xiaomi రెండు బ్రాండ్స్ ఒకే మార్కెట్ strategies తో ఉంటాయి.
అంటే తక్కువ ధరకే ఎక్కువ స్పెక్స్ ఇవటం etc వంటవి.. సో Le 2, రెడ్మి నోట్ 3 ను మించటానికి ఇబ్బంది పడలేదు. అదే ప్రైస్ కు రెడ్మి కన్నా బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది Le 2. ఎందుకో చూడండి..
పెర్ఫార్మన్స్
Le 2 లోని ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 652 లో 4 Cortex A72, 4 Cortex A53 కోర్స్ ఉన్నాయి. అందుకే ఫాస్స్ట్ గా ఫోన్. అలా గని రెడ్మి నోట్ 3 ఫాస్ట్ గా లేదని కాదు. ఇది కూడా ఫాస్ట్ కాని మల్టీ కోర్ పెర్ఫార్మన్స్ tests లో Le2 లో ఉన్న నలుగు అదనపు cores ఫోన్ కు బల్లాన్ని ఇచ్చాయి. అలాగే సింగిల్ కోర్ పెర్ఫార్మన్స్ లో కూడా extra Cortex A72 cores హెల్ప్ అయ్యాయి Le 2 కు. రెగ్యులర్ usage లో యాప్ లోడింగ్ time రెండింటిలోనూ దాదాపు same. కాని Le 2 హెవీ గేమింగ్ లోడింగ్ లో కొంచెం ఫాస్ట్ గా ఉంది. ఫ్రీ ర్యామ్ కూడా రెండూ same, 1.5GB.
కేమెరా
రెండింటిలో 16MP కెమెరా sensors ఉన్నాయి. Xiaomi లో సామ్సంగ్ ISOCELL సెన్సార్ ఉంటే Le 2 Omnivision OV16880 సెన్సార్ ఉంది. shutter delay, ఫోకస్ స్పీడ్ అండ్ processing time లో రెండూ same. అలాగే Low లైటింగ్ లో రెండూ slow గా ఉన్నాయి కాని మంచి లైటింగ్ లో ఫాస్ట్ గానే ఉన్నాయి. అయిన క్వాలిటీ మాత్రం డిఫరెంట్ గా ఉంది.
LeEco Le 2 (Left) vs Xiaomi Redmi Note 3 (Right) [See full size images in galleries below]
Le 2 లో ఎక్కువ dynamic range, బెటర్ డిటేల్స్ అండ్ కలర్స్ ఉన్నాయి. రెడ్మి slight గా ఇమేజెస్ ను soft చేస్తుంది. Low లైట్ లో Le 2 బ్రైట్ నెస్ రెడ్మి కన్నా బాగుంది. Studio లైటింగ్ లో మాత్రం Le 2 ఇమేజెస్ ను warm గా ఇస్తుంది. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. డిటేల్స్ మరియు ఓవర్ ఆల్ క్వాలిటీ ఓవర్ ఆల్ గా LE 2 లో బెటర్ గా ఉన్నాయి.
LeEco Le 2 (Left) vs Xiaomi Redmi Note 3 [See full size images in the galleries below]
మీరు క్రింద ఉన్న ఇమేజెస్ చూస్తే stairs వద్ద డార్క్ గా ఉంటుంది. అండ్ PC ముందు కూర్చున్న వారి ఫోటోస్ చూస్తే Le 2 లో ఒరిజినల్ గా ఉన్నాయి కలర్స్ రెడ్మి కన్నా. అయితే ఈ రెండు ఫోనులకు MOTO G4 Plus ను మించే అంత కెమెరా క్వాలిటీ లేదు. రెడ్మి మరియు Le 2 లో మాత్రం LE 2 కెమెరా winner.
బ్యాటరీ
రెడ్మి నోట్ 3 ఈజీగా Le 2 ను మించింది బ్యాటరీ లైఫ్ లో. రెగ్యులర్ usage లో 20% extra బ్యాక్ అప్ ఉంటుంది Le 2 తో పోలిస్తే. అంతే! అంటే దీని అర్థం Le 2 కేవలం బెస్ట్ బ్యాక్ అప్ ఇవటం లేదు కాని దాని mah కు తగ్గట్టుగా మంచి బ్యాక్ అప్ ఇస్తుంది.
Le 2 లో రెగ్యులర్ usage లో 16 గంటలు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అదే usage లో రెడ్మి నోట్ 3 ఒక ఫుల్ day cross అవుతుంది బ్యాటరీ. స్క్రీన్ బ్రైట్ నెస్ ను తగ్గించి, power saver modes ను అవసరమైనప్పుడు వాడితే రెండు ఫోనులలో బ్యాక్ అప్ బాగా పెరుగుతుంది. రెడ్మి లో ఉన్న 4000 mah Le 2 లో ఉన్న 3000 mah తో పోలిస్తే 25% పెద్ద బ్యాటరీ తో వస్తుంది.
బిల్డ్ అండ్ డిజైన్
లుక్స్ సెగ్మెంట్ లో ఎప్పుడూ ఎవరికీ వారి ఒపీనియన్స్ ఉంటాయి. కాని Le 2 లో మంచి built క్వాలిటీ ఉంది అని ఈజీగా ఎవరైనా feel అవుతారు. unibody మెటల్ డిజైన్ Le 2 లో మరింత స్ట్రాంగ్ గా మరియు ప్రీమియం గా ఉంది రెడ్మి కన్నా. రెడ్మి లో మెటాలిక్ ఫినిష్ ఉంది కాని అది Le 2 లో మెటల్ ఉంది.
డిస్ప్లే
రెండూ సమానంగా ఉన్నాయి మా టెస్ట్ లలో. రెడ్మి లో కొంచెం bluish tint ఉంది. ఇది రీడింగ్ మోడ్ ను ఆన్ చేస్తే పోతుంది. అలాగే intensity కూడా తగ్గించాలి. ఈ రెండూ చేస్తే రెండు ఫోనుల్లో డిస్ప్లే లు same గా ఉంటాయి. at least కలర్స్ లో. కాని రెడ్మి నోట్ 3 డిస్ప్లే కొంచెం బ్రైట్ గా ఉంది. ఈ సన్ లైట్ లో హెల్ప్ అవుతుంది.
బాటం లైన్
Le 2 లో బెటర్ పెర్ఫార్మన్స్, బెటర్ కెమెరా, బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉన్నాయి. సో ఈజీగా Le 2 రెడ్మి నోట్ 3 ను మించి, అండర్ 15000 బడ్జెట్ లో టాప్ ఫోన్ గా నిలిచింది Le 2. అయితే రెడ్మి నోట్ 3 కు దీనికి ఎక్కువ దూరం లేదు. slight గానే ఇది తగ్గింది పైన చెప్పిన విషయాలలో. కాని Le 2 ను మించలేకపోయింది.
సో ఎవరెవరికి ఏ ఫోన్ సూట్ అవుతుంది?
బ్యాటరీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ విషయమైతే రెడ్మి నోట్ 3 తీసుకోండి. satisfying బ్యాక్ అప్ ఉంటే చాలు అనుకుంటే రెడ్మి ను అన్నిటిలో మించిన Le 2 తీసుకోండి. అయితే Le 2 లో రెడ్మి నోట్ 3 కు ఉన్నంత ROMS(ఇది పవర్ ఫుల్ users అండ్ డెవలప్మెంట్ కు సంబందించిన విషయం. దీనిపై అవగాహన లేని వారు దీనిని పట్టించుకోనవసరం లేదు) లేవు. అలాగే SD కార్డ్ మరియు ఆడియో లేదా మూవీస్ చూస్తూ చార్జింగ్ పెట్టుకునే సదుపాయాలు కూడా లేవు Le 2 లో.
ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు డైలీ usage లో అసలు ఫోన్ లో ఏమి వాడతారు, ఎక్కువుగా ఏది చేస్తారు, నిజంగా చార్జింగ్ పెట్టుకొని మ్యూజిక్ లేదా వీడియోస్ వంటివి use చేస్తుంటారా? Custom ROMS అవీ ఇంస్టాల్ చేసుకుంటారా? రెడ్మి నోట్ 3 కన్నా బెటర్ గా ఉన్న ఆ slight డిఫరెన్స్ ను మీరు డైలీ usage లో నిజంగా తెలుసుకోగలరా..ఆ డిఫరెన్స్ ఉపయోగపడే అంత కంప్లీట్ గా ఫోన్ ను వాడతారా? అనేవి మీకు మీరు ఆలోచించుకొని మీ true డైలీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్ వాడుక బట్టి ఫోన్ తీసుకోండి. అయతే అన్నిటికన్నా బెటర్ కెమెరా కావాలనుకుంటే MOTO G4 Plus బెస్ట్ కెమెరా ఈ మూడింటిలో. స్టోరీ పై కామెంట్స్ తెలియజేయగలరు ఫేస్ బుక్ లో.