రీసెంట్ గా ఇండియన్ స్మార్ట్ ఫోన్ ఏరా లో మరొక చైనీస్ బ్రాండ్ 10K బడ్జెట్ సమీపంలో ఒక మోడల్ ను లాంచ్ చేసి users ను ఆకర్షించింది. Le 1S పేరుతో వచ్చిన దీని ధర 10,999 రూ.
దీని కంప్లీట్ స్పెక్స్ కొరకు ఈ లింక్ లో చూడండి. Key స్పెక్స్ – 3GB ర్యామ్, 13MP రేర్ కెమెరా, మీడియా టెక్ Helio X10 SoC, 5.5 ఫుల్ HD డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, USB టైప్ c పోర్ట్.
విశేషం ఏంటంటే దీని కన్నా తక్కువ పవర్ అండ్ స్పెక్స్ తో వచ్చే Mi 4i, ఆసుస్ జెన్ ఫోన్ 2, మోటో G టర్బో Le 1S కన్నా ఎక్కువ ధరలో ఉన్నాయి.
Le 1S కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చదవగలరు. దీనిపై రివ్యూ చేసినప్పటికీ చాలా మందికి ఇంకా ఫైనల్ బయింగ్ కొరకు నిర్ణయం తీసుకోవటం కష్టం గా ఉంది. అందుకని ఇక్కడ కూల్ ప్యాడ్ నోట్ 3, మోటో G టర్బో తో కంపేరిజన్ చేయటం జరిగింది.
పెర్ఫార్మెన్స్
Le 1S టాప్. నెక్స్ట్ ఆసుస్ దీనికి దగ్గరిలో ఉంది. Le Eco యూజర్ ఇంటర్ఫేస్ మల్టీ కోర్ పెర్ఫార్మెన్స్ ను enhance చేయటం జరిగింది. అంటే డే టు డే రియల్ usage లో మోటో G టర్బో, Mi 4i, జెన్ ఫోన్ 2 కన్నా బెటర్ గా పెర్ఫరం చేస్తుంది Le 1S. ఇక బెంచ్ మార్క్ స్కోర్ అయితే మిగిలిన రెండింటి కన్నా ఇదే హై స్కోర్.
గ్రాఫిక్స్ అండ్ GPU పెర్ఫార్మెన్స్ మాత్రం Le 1S లో తగ్గింది. తక్కువ పవర్ కలిగిన SoC(SD 615) మరియు adreno(405) ఉన్నా మోటో G టర్బో లోనే బెటర్ frame రేట్స్ వస్తున్నాయి. అంటే Le 1S గేమింగ్ లో bad అని కాదు. కేవలం బెస్ట్ కాలేకపోయింది అంతే. గేమింగ్ హై ప్రియారిటీ అనుకునే వారికీ ఆసుస్ జెన్ ఫోన్ 2 బెటర్ ఛాయిస్.
యూజర్ ఇంటర్ఫేస్
ui అనేది ఒపినియన్ కు సంబంధించిన విషయం. Le Eco లో UI ఇంటరెస్టింగ్ గా ఉంది. లెఫ్ట్ సైడ్ కు స్వైప్ చేస్తే HTC లా బ్లింక్ feed కనిపిస్తుంది హోమ్ స్క్రీన్ లో. చైనా లో అయితే బ్లింక్ ఫీడ్ లో LeTV వీడియో కంటెంట్ చూపించేది. మన ఇండియాలో అదేమీ లేదు. ఓవర్ ఆల్ గా పెద్దగా ui లో చూస్ చేసుకోవటానికి ఏమీ లేదు, మీరు stock ui లవర్ అయితే మోటో G టర్బో బెటర్. మమ్మల్ని అడిగితే Mi 4i యొక్క MIUI బెస్ట్ ui. LeEco డిఫరెంట్ గా ఉంది అనిపిస్తుంది కాని functions ఏమి లేవు ప్రత్యేకంగా చెప్పుకోవటానికి.
బ్యాటరీ
Le 1S, కూల్ ప్యాడ్ నోట్ 3, Mi 4i మరియు జెన్ ఫోన్ 2 ఫోన్స్ అన్నీ 3000 mah తో వస్తున్నాయి. మోటో G టర్బో లో మాత్రం 2470 mah ఉంది. పేపర్ టెస్ట్ లలో కూల్ ప్యాడ్ లాంగ్ లైఫ్ తో ఉంది. రియల్ లైఫ్ లో కూల్ ప్యాడ్ మరియు Xiaomi మి 4i కొన్ని ఎక్కువ గంటలు వస్తున్నాయి మిగిలిన వాటి కన్నా. మోటో G టర్బో, Le 1S, ఆసుస్ మూడూ ఒక వర్కింగ్ డే ను కంప్లీట్ చేస్తాయి. అయితే వినియోగం లో కొన్ని తగ్గించుకోవాలి 24 గంటలు బ్యాక్ అప్ రావాలంటే. ప్రాక్టికల్ గా మరొక కోణం లో చెప్పాలంటే ఇవేమీ ఉత్తమమైన బ్యాటరీ లైఫ్ ఇవటం లేదు, కాని స్మార్ట్ ఫోన్ కరెంట్ ట్రెండ్ లో స్టాండర్డ్స్ కు తగ్గా ఉన్నాయి.
కెమెరా
LE 1S 13MP కెమెరా మిగిలిన నాలుగు ఫోనుల కన్నా weak అని చెప్పాలి. టర్బో లో బ్రైట్ ఇమేజెస్, కూల్ ప్యాడ్ లో బెటర్ షార్ప్ నెస్ అండ్ కలర్ రిప్రోదక్షన్, Low లైట్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్రైట్ నెస్, Mi 4i లో Low లైటింగ్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. కూల్ ప్యాడ్ అండ్ జెన్ ఫోన్ 2 రెండూ ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్.
Le 1S లో డిటేల్స్ అండ్ subdues ఇమేజెస్ లేవు. దీనికి తోడూ Low లైట్ పెర్ఫార్మెన్స్ కూడా బాలేదు. నాయిస్ ఎక్కువుగా ఉంది. కాని ఈ ప్రైస్ రేంజ్ లో Le 1S ఫాస్ట్ కెమెరాలలో ఒకటి. కాని ఇమేజ్ క్వాలిటీ లో వెనుకబడింది.
బాటం లైన్
10,999 రూ లకు Le 1S మంచి ఫోన్. కేవలం కెమెరా ఇమేజ్ క్వాలిటీ లోనే compromise అవ్వవలసి వస్తుంది. దీనిని ఫోన్ పెర్ఫార్మెన్స్ బర్తీ చేస్తుంది. లేదు మీకు కెమెరా మెయిన్ ఇంపార్టెన్స్ అయితే మిగిలిన ఫోన్లకు వెళ్ళటం బెటర్.
Le 1S కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చదవగలరు