Jio సిమ్ ఇప్పుడు Xiaomi ఫోనులపై కూడా పనిచేస్తుంది. అంటే కోడ్ generating లో ఇబ్బందులు లేకుండా GET JIO SIM ఆప్షన్ వస్తుంది. ఆఫ్ కోర్స్ Welcome ఆఫర్ నుండి అన్ని 4G ఫోనులపై పనిచేస్తుంది Jio. కాని రీసెంట్ గా రిలయన్స్ సపోర్టింగ్ లిస్టు లో Xiaomi ను కూడా యాడ్ చేసింది వెబ్ సైట్ లో.
Jio sim కు Xiaomi సపోర్ట్ చేస్తున్నట్లు కంపెని తెలిపిన మోడల్స్…
అయితే మీలో ఎవరైనా Xiaomi ఫోన్ పై ఇప్పటి వరకూ కోడ్ generate చేయటానికి ట్రై చేసి ఫెయిల్ అయితే మరొక సారి ట్రై చేయండి, కోడ్ వస్తుంది. ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నట్లు Jio తెలిపిన మోడల్స్ కు My Jio యాప్ లో కోడ్ generate అవుతుంది(అవ్వాలి) ఎటువంటి ట్రిక్స్ లేదా ఇబ్బందులు లేకుండా.
అందుకే MyJio యాప్ మిగిలిన ఫోనులను ఐడెంటిఫై చేయటం లేదు. సో సపోర్టింగ్ లిస్టు లో లేని ఫోనులకు ఎటువంటి కోడూ generate అవటం లేదు. Jio హెడ్ ఆఫీస్ బృందం మరియు Jio కస్టమర్ కేర్ సిబ్బంది తెలిపిన దాని ప్రకారం, కోడ్ లేకుండా డైరెక్ట్ గా స్టోర్ కు వెళ్లి సిమ్ తీసుకోగలరు లిస్టు లో లేని ఫోనులను వాడుతున్న వారు. ఈ విషయం గురించి ఈ లింక్ లో పోర్తిగా తెలపటం జరిగింది.
మీది లిస్టు లో లేని ఫోన్ అయినా(అంటే కోడ్ generate చేయవలసిన అవసరం లేని ఫోన్), స్టోర్ సిబ్బంది కోడ్ generate చేసుకొని రమ్మంటే.. ఈ లింక్ లో చెప్పిన ట్రిక్స్ ద్వారా కోడ్ generate చేయటానికి ట్రై చేయండి.
ఈ ట్రిక్స్ ద్వారా ఆల్రెడీ కొందరు సక్సెస్ ఫుల్ గా కోడ్ generate చేసుకోవటం జరిగింది. క్రింద వారు తెలిపిన కామెంట్ చూడగలరు. మొబైల్ లో ఈ స్టోరీ చదువుతున్న వారికి గమనిక: వాళ్ళు తెలిపిన కామెంట్స్ చూడటానికి మీరు ఇదే స్క్రీన్ లో పైన షేర్ బటన్ పై ప్రెస్ చేసి బ్రౌజర్ లో ఓపెన్ చేస్తేనే కనిపిస్తాయి.
అసలు కోడ్ generate చేయకుండా డైరెక్ట్ గా వెళ్లి తీసుకున్న వారు కూడా ఉన్నారు. క్రింద వారు డిజిట్ తెలుగు కు చేసిన కామెంట్స్ చూడండి.. సో ఇప్పటివరకూ నేను తెలిపిన అన్ని విషయాలు కరెక్ట్! కాని రిలయన్స్ అన్ని ఏరియా లలో అన్ని స్టోర్స్ లో సరైన సమాచారం ఇవ్వక, ఇన్ని confusions క్రియేట్ అవుతున్నాయి.
రిలయన్స్ ఈ ప్రాసెస్ లో స్ట్రాంగ్ గా నియమాలను స్టోర్స్ కు చెప్పకపోవటం వలన ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి.మీరు గమనించి నట్లయితే కోడ్ లేకుండా సిమ్ తీసుకున్న వారు ఉన్నారు, కోడ్ వచ్చి సిమ్ తీసుకున్న వారు ఉన్నారు & Xiaomi ఫోనులపై కోడ్ generate చేసిన వారు కూడా ఉన్నారు. కొద్ది రోజులలోనే ఇవన్నీ సెట్ అయ్యి అందరికీ అన్నీ స్టోర్స్ లో ఒక ఒకే రకమైన పద్దతిని తీసుకువస్తుంది అని ఆశిస్తున్నాము.
ఫైనల్ లైన్ – కోడ్ generate అయినా అవ్వకపోయినా మీ 4G ఫోన్ లో Jio సిమ్ పనిచేస్తుంది. . పైన తెలిపిన Xiaomi లిస్టు లో Mi 4 మరియు ఇతర xiaomi ఫోను లేకపోయినా అవి కూడా పనిచేస్తాయి. Jio పై మీ డౌట్స్ కు ఈ లింక్ లో సమాధానాలు తెలపటం జరిగింది.