[SEP 6] ఎవరికీ కోడ్ అవసరం, ఎవరికీ కోడ్ అవసరం లేదు అనే క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ Jio బృందం
ముందుగా ఇది చదివే ముందు కోడ్ జెనరేటింగ్ విషయంలో మీరు ఇప్పటివరకూ డిజిట్ తెలుగు ద్వారా లేదా ఇతర సోర్సెస్ నుండి తెలుసుకున్న విషయాలను మరిచిపొండి. వాటికీ పక్కన పెట్టేయండి. అండ్ in case బాగా confuse చేసినట్లయితే క్షమించండి!
Code జెనరేటింగ్ విషయం లో జరుగుతున్న ఇబ్బందులపై రిలయన్స్ డిల్లీ హెడ్ ఆఫీస్ తో email కమ్యునికేషన్ చేయటం జరిగింది ఈ రోజు ఉదయం. మరియు టెలిఫోన్ కమ్యునికేషన్ లో కూడా ఇదే సమాధానం తెలిపారు రిలయన్స్ కస్టమర్ కేర్ persons. సో వారి చెప్పిన దాని ప్రకారం..
Welcome ఆఫర్ కు ముందు Jio అఫీషియల్ గా కేవలం కొన్ని బ్రాండ్స్/ఫోనులకు మాత్రమే Jio సిమ్ ను సపోర్ట్ చేసింది. సో వీటికి కోడ్ జెనరేటింగ్ ఉంటుంది. కాని ఇదే welcome offer కు ముందు అఫీషియల్ గా సపోర్ట్ చేయని ఫోనులకు కోడ్ జెనరేటింగ్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ గా ఆధర్ కార్డ్ ఒరిజినల్ అండ్ Xerox పట్టుకొని వెళితే సిమ్ ఇస్తారు.
Welcome ఆఫర్ కు ముందు కంపెని సపోర్ట్ చేసిన ఫోన్స్ లిస్టు.. అంటే క్రింద ఉన్న ఫోనులకు కోడ్ కావాలి. క్రింద లిస్టు లో లేని మోడల్స్ కు అవసరం లేదు.
Samsung devices – Grand Prime 4G, Galaxy J1, Galaxy J2, Galaxy J7, Galaxy J5, Galaxy S5 Plus, Galaxy A5, Galaxy A7, Galaxy Core Prime 4G, Galaxy S6, Galaxy J3 (2016), ON7, Galaxy A8, Galaxy S6 Edge, ON5, Galaxy Note 5, Galaxy Note 4, Galaxy Alpha, Galaxy S6 Edge Plus, Galaxy Note 4 Edge, Galaxy Note 5 Duos, Galaxy S5 Neo, S7, Galaxy A5 (2016), Galaxy A7 (2016), S7 Edge, A8 VE, J5 (2016), J7 (2016), ON5 Pro, ON7 Pro, Galaxy J2 (2016), J Max, Galaxy A9, Galaxy A9 Pro, Galaxy C5, Galaxy C7, Galaxy J2 Pro, Galaxy Note 7.
Gionee phones – E8, F103 Pro, F103(1GB), F103(2GB), F103(3GB), M4, M5, M5 Lite, M5 Lite CDMA, M5 Plus, P5L, S Plus, S6, S6s, S7, V6L
Karbonn phones – Aura 1, Aura Power, Quattro L45 IPS, Quattro L50 HD, Quattro L51 HD, Quattro L52 VR, Quattro L55 HD
Lava phones – A71, A72, A76, A76 Plus, A88, A89, A97, Ivory s 4g, Lava V5 M, Pixel V2, V2s, X10, X11, X12, X17, X28, X38, X41, X41 Plus, X46, X50, X50 Plus, X81
Xolo phones – Black-1X M, era 1X, era 2X, era 4G, era 4K, era X
Yu devices – Yu Yureka, Yu Yutopia, YU Note, Yu Yuphoria, Yunicorn, Yunique, Yuphoria, Yureka Plus, Yureka S
TCL – FIT 5.5, Pride T500L, TCL 560, TCL 562
Alcatel – OneTouch X1, Pixi 4 -5, POP Star, POP3, POP4
ASUS – ZenFone 2 Laser (ZE550KL), Zenfone 2 (ZE551ML), Zenfone Max (ZC550KL), Zenfone 2 Laser 5.0 (ZE500KL), Zenfone 2 (ZE550ML), Zenfone Selfie( ZD551KL), Zenfone 2 Laser (ZE601KL), Zenfone Zoom(ZX551ML), Zenfone Go 5.0 LTE (T500), Zenfone 3 ZE552KL, Zenfone 3 Laser( ZC551KL), Zenfone 3( ZE520KL), Zenfone 3( ZS570KL), Zenfone 3( ZU680KL)
Panasonic ఫోన్స్ – ELUGA L, ELUGA Switch, ELUGA Icon, T45, ELUGA I2 ( 1GB ), ELUGA L2, ELUGA Mark, ELUGA Turbo, ELUGA Arc, ELUGA I2 2GB, ELUGA I2 3GB, ELUGA I3, ELUGA Icon 2, ELUGA A2, ELUGA Note, P55 Novo 4G, ELUGA Arc 2, P77
LG devices – K332 (K7 LTE), K520DY (Stylus 2), K520DY, H860 (LG G5), K500I (X Screen), K535D (Stylus 2 Plus), LGH630D (G4 Stylus 4G) & LGH 442 (LGC70 Spirit LTE)
Micromax devices – Bolt Selfie, Canvas 5, Canvas 5 Lite, Canvas 5 Lite Special Edition, Canvas 6, Canvas 6 Pro, Canvas Amaze 4G, Canvas Blaze 4G, Canvas Blaze 4G Plus, Canvas Evok, Canvas Fire 4G, Canvas Fire 4G plus, Canvas Fire 6, Canvas Juice 4G, Canvas Knight 2, Canvas Mega 2, Canvas Mega 4G, Canvas Nitro 4G, Canvas Pace 4G, Canvas Play 4G, Canvas Pulse 4G, Canvas Sliver 5, Canvas Tab, Canvas Unite 4, Canvas Xpress 4G, Unite 4 Plus, Unite 4 Pro
Sony smartphones – Xperia X A, Xperia X A Ultra, Xperia X(F5122), Xperia Z5 Dual(E6883), Xperia Z5 Premium Dual
HTC smartphones – Desire 626 dual Sim, Desire 628, Desire 630, Desire 728 Dual SIM, Desire 820, Desire 820Q, Desire 820S Dual Sim, Desire 825, Desire 826, Desire 826 DS, Desire 828 DS, Desire 830, Desire Eye, HTC 10, HTC 10 Life style, One A9, One E9 S dual sim, One E9+ Dual Sim, One M8, One M8 Eye, One M9 Plus, One M9e, One ME Dual Sim, One X9
Intex smartphones – Aqua 4G, Aqua 4G Star, Aqua 4G Strong, Aqua 4G+, Aqua Ace, Aqua Ace 2, Aqua Ace Mini, Aqua Craze, Aqua Eco 4G, Aqua GenX, Aqua Music, Aqua Power 4G, Aqua Raze, Aqua S7, Aqua Secure, Aqua Shine 4G, Aqua Strong 5.1, Aqua Super, Aqua Trend, Aqua Turbo 4G, Aqua View, Aqua Wing, Cloud 4G Smart, Cloud 4G Star, Cloud Crystal 2.5D, Cloud Fame 4G, Cloud Flash, Cloud Glory 4G, Cloud Jewel, Cloud String HD, Cloud String V2.0, Cloud Swift
Vivo – vivo V3, vivo V3Max, vivo Y21L, vivo Y51L
Sansui – S50 FD45S
Videocon – Graphite1 V45ED, Krypton 3 V50JG, Q1, V50FA3, V50FG6
మా వద్ద పైన చెప్పిన మోడల్స్ లో ఫోన్ ఉంది. సో ఇప్పుడు కోడ్ ఏలా generate చేయాలి? Jio సిమ్ ఎలా తీసుకోవాలి?
1. ముందుగా ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుండి MYJio యాప్ ను ఇంస్టాల్ చేసుకోండి ఫోన్ లో. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది యాప్.
2. ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తే మీకు Get Jio SIM అని ఉంటుంది క్లియర్ గా. దాని పై టాప్ చేయండి.
3. క్రింద Agree and Get Jio offer అని ఉంటుంది. దాని పై కూడా టాప్ చేయాలి.
4. ఇప్పుడు మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి డ్రాప్ డౌన్ బాక్స్ నుండి.
5. ఇక్కడ మీరు కొంత సమాచారం చూస్తారు. దానిని చదివి, next బటన్ టాప్ చేయాలి.
6. ఇప్పుడు ఆఫర్ కోడ్ కనిపిస్తుంది మీ ఫోన్ స్క్రీన్ పై. దీనిని ఎక్కడైనా నోట్ చేసుకోండి. లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి.
7. ఇప్పుడు ఒరిజినల్ అడ్రెస్ ప్రూఫ్ మరియు Xerox ఒకటి, ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్ మరియు Xerox ఒకటి, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఆ ఆఫర్ కోడ్ ను పట్టుకొని మీ దగ్గరిలో ఉన్న Reliance Digital, Dx Mini stores లేదా Modern Trade outlets మరియు prominent multi brand Jio stores కు వెళ్లి సబ్మిట్ చేస్తే మీకు సిమ్ వస్తుంది.
పైన చెప్పినది అఫీషియల్ ప్రోసెస్. కాని ఎవరికైనా కోడ్ generate చేసుకోవలసిన మోడల్ ఉండి, పైన చెప్పినట్లుగా చేసినా కోడ్ రాకపోతే ఈ క్రింద తెలిపిన మరొక రెండు మెథడ్స్ ట్రై చేయండి. గమనిక కొంతమందికి మూడు నాలుగు సార్లు ఈ స్టెప్స్ ను రిపీట్ చేస్తేనే కాని సక్సెస్ ఫుల్ గా generate అవటం లేదు కోడ్.
Jio sim తీసుకోవటానికి కోడ్ generate చేయాలి అనేది కన్ఫర్మ్. కోడ్ లేకుండా సిమ్ తీసుకోవటం కుదరటం లేదు. అయితే కోడ్ ఏలా generate చేయాలి అని లేటెస్ట్ గా ఈ లింక్ లో తెలపటం జరిగింది. కాని చాలా మందికి కోడ్ generate అవటం లేదు. సో ఎందుకు అవటం లేదు, ఏమి చేయాలి? తెలుసుకుందాము రండి!
ఎందుకు కోడ్ generate అవటం లేదు?
MyJio యాప్ ను ఇంస్టాల్ చేయటం ద్వారా గతంలో చాలా మంది అఫీషియల్ గా కంపెని సపోర్ట్ చేయని 4G ఫోనులపై కూడా కోడ్ generate చేసుకొని సిమ్ తీసుకోవటం జరిగింది.
సో కంపెని వెంటనే యాప్ ను అప్ డేట్ చేసి bug solve చేసి ఫోన్ ట్రాకింగ్ ను కష్టం చేసింది. అందుకే ప్లే స్టోర్ లో ప్రస్తుతం available గా ఉన్న My Jio App మీ ఫోన్ ను సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతుంది.
మరి దీనికి సొల్యూషన్ ఏంటి?
ప్లే స్టోర్ లో ఉన్న updated MyJio యాప్ వెర్షన్ కాకుండా గతంలో అందరికీ ఈజీగా కోడ్ generate చేసిన old వెర్షన్ My Jio apk ను డౌన్లోడ్ చేసుకొని వాడాలి. ఈ లింక్ (MyJio 3.2.05 version) నుండి డౌన్లోడ్ చేయగలరు ఓల్డ్ వెర్షన్ apk ను.
ఇప్పుడు ఫోన్ మెయిన్ సెట్టింగ్స్ లో ఉన్న security ఆప్షన్ లోకి వెళ్తే Unknown sources ఆప్షన్ కనిపిస్తుంది. దానిని enable చేసి apk ఫైల్ ను ఫోన్ లో ఎక్కడ డౌన్లోడ్ చేశారో అక్కడకు వెళ్లి (సాధారణంగా downloads ఫోల్డర్ లో ఉంటుంది) apk మీద క్లిక్ చేస్తే యాప్ ను ఇంస్టాల్ చేయగలరు. లేదంటే మీరు విడిగా apk ఫైల్ ను ఇంస్టాల్ చేయగలరు.
అయితే old వెర్షన్ యాప్ ఇంస్టాల్ చేసినంత మాత్రం కోడ్ generate అవ్వదు. క్రింద చెప్పిన స్టెప్స్ ను జాగ్రత్తగా ఫాలో అయితే కోడ్ generate అవుతుంది. క్రింద తెలిపిన ప్రాసెస్ 3G ఫోనులో కూడా పనిచేస్తుంది. 3G ఫోన్ లో Jio సిమ్ ను ఏలా వాడాలో ఈ లింక్ లో తెలపటం జరిగింది.
- ముందుగా మీరు ప్లే స్టోర్ నుండి ఇంస్టాల్ చేసుకున్నలేటెస్ట్ My Jio App మరియు ఇతర అన్ని Jio యాప్స్ ను uninstall చేయాలి.
- ఫోన్ లో WiFi లేదా మొబైల్ ఇంటర్నెట్ అనేవి ఆన్ అయ్యి ఉండకూడదు. ఆఫ్ చేసి పెట్టండి.
- ఇప్పుడు ముందుగా డౌన్లోడ్ చేసిన apk ఫైల్ (లింక్) ను ఇంస్టాల్ చేయాలి.
- యాప్ ఇంస్టాల్ చేసిన తరువాత ఓపెన్ చేయకుండా ఫోన్ రిస్టార్ట్ చేయాలి.
- ఫోన్ ఆన్ అయిన తరువాత ఇంటర్నెట్ ఆఫ్ లో ఉండగానే My Jio యాప్ ఓపెన్ చేయండి.
- మీకు ఎప్పుడూ కనిపించే Welcome to your digital life అనే స్క్రీన్ కనిపిస్తుంది. కాని కొత్తగా ఇప్పుడు దాని క్రింద Get Jio Sim అనే మెసేజ్ ఉంటుంది.
- ఇప్పుడు ఫోన్ యొక్క హోమ్ బటన్ ప్రెస్ చేసి ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫోన్ లో మొబైల్ ఇంటర్నెట్(WiFi కాదు) ను ఆన్ చేయండి.
- వెంటనే మరలా బ్యాక్ గ్రౌండ్ లో రీసెంట్ యాప్స్ లిస్టు లో రన్ అవుతున్న Jio యాప్ ను ఓపెన్ చేసి Get Jio Sim పై క్లిక్ చేయండి.
- Next స్క్రీన్ లో మీకు Agree and Continue అనే మెసేజ్ వస్తుంది. దాని పై క్లిక్ చేయాలి.
- ఇక ఇక్కడ నుండి మీరు యాప్ లో వచ్చే instructions ఫాలో అయితే మీకు కోడ్ వస్తుంది. Jio యాప్స్ అన్నీ కూడా ఇంస్టాల్ చేయాలి. కోడ్ ను స్క్రీన్ షాట్ (పవర్ బటన్ మరియు వాల్యూం ప్లస్ బటన్ ఒకే సారి ప్రెస్ చేసి) తీసి పెట్టుకోవటం మంచిది.
- అంతే! ఇదే కోడ్ ను పట్టుకొని, ఆధర్ కార్డ్ ఒరిజినల్ మరియు xerox ను తీసుకోని స్టోర్ కు వెళ్లి సిమ్ అడిగితే సిమ్ ఇస్తారు.
పైన చెప్పినది పనిచేయకపోతే క్రింద అదే ప్రోసెస్ ను వేరే స్టెప్స్ తో చేయండి…
- ఆల్రెడీ ఇంస్టాల్ అయ్యి ఉన్న Jio యాప్ ను uninstall చేయండి ముందు.
- ప్లే స్టోర్ నుండి మళ్ళీ అదే యాప్ ను ఇంస్టాల్ చేసుకోండి.
- ఓపెన్ చేసి Install All బటన్ పై క్లిక్ చేయగలరు ఇప్పుడు. అన్ని Jio యాప్స్ ఇంస్టాల్ చేసేసి యాప్ ను close చేయండి (రీసెంట్ యాప్స్ లిస్టు నుండి కూడా).
- ఇప్పుడు ఫోన్ లోని WiFi అండ్ మొబైల్ ఇంటర్నట్ రెండూ ఆఫ్ చేసేయాలి.
- మరలా My Jio యాప్ ను ఓపెన్ చేయండి. మీకు ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు అని చెబుతుంది స్క్రీన్ పై.
- కాని ఆ మెసేజ్ ను పట్టించుకోకండి. వెంటనే మీకు Get Jio సిమ్ అనే బటన్ కూడా కనిపిస్తుంది.
- ఇప్పుడు దానిపై క్లిక్ చేయండి. మరలా ఇంటర్నెట్ లేదు అని మెసేజ్ వస్తుంది.
- ఇప్పుడు మీరు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి WiFi లేదా మొబైల్ ఇంటర్నెట్ ను ఆన్ చేసి మరలా రీసెంట్ యాప్స్ లిస్టు లో ఉన్న My Jio యాప్ ను ఓపెన్ చేసి Get Jio sim బటన్ పై ప్రెస్ చేస్తే మీకు కోడ్ generate అయ్యే ముందు ఉండే agree and get Jio Offer స్క్రీన్ కనిపిస్తుంది. next స్క్రీన్ లో కోడ్ generate చేసుకోవటమే. అంతే!
ఈ ప్రోసెస్ రెడ్మి నోట్ 3, Mi మాక్స్, oneplus వంటి ఫోనులపై సక్సెస్ ఫుల్ గా పనిచేస్తుంది అని రిపోర్ట్స్. కాని ఆపిల్ ఫోనులపై లొకేషన్ ఆఫ్ చేసి ట్రై చేస్తే వర్క్ అవుతున్నట్లు తెలుస్తుంది. ట్రై చేయండి. అయితే పైన చెప్పిన కోడ్ జెనరేటింగ్ ప్రాసెస్ కంపెని అఫీషియల్ గా welcome ఆఫర్ కు ముందు సపోర్ట్ చేయని ఫోనులకు అవసరం లేదు. అందుకే వారికీ కోడ్ generate అవటం లేదు.
ఫైనల్ పాయింట్ : సెప్టెంబర్ 6 వ తేదిన కంపెని హెడ్ ఆఫీస్ మార్కెటింగ్ బృందం తో మాట్లాడిన తరువాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కోడ్ జెనరేటింగ్ అనేది కేవలం Jio, welcome offer అనౌన్స్ చేయకముందు అఫీషియల్ గా సపోర్ట్ చేసిన బ్రాండ్స్/ఫోన్స్ కే అవసరం. మిగిలిన ఫోనులకు డైరెక్ట్ గా స్టోర్ కు వెళ్లి అడిగితే ఇస్తారు. అలా ఇవ్వని స్టోర్ వాళ్ళని పేరు అడిగి, స్టోర్ అడ్రెస్ నోట్ చేసుకొని రిలయన్స్ కస్టమర్ కేర్ కు కంప్లైంట్ చేయమని కస్టమర్ కేర్ సిబ్బంది తెలిపారు.
కోడ్ అవసరం లేని వారు డైరెక్ట్ గా ఆధర్ కార్డ్ ఒరిజినల్ పట్టుకొని వెళితే చాలు. కాని కొన్ని స్టోర్స్ లో ఫోటోస్ మరియు ఆధర్ కార్డ్ Xerox అడుగుతున్నారు. సో ముందు చూపు కోసం పట్టుకెల్లండి. ఆధర్ కార్డ్ లేని వారు మీ వద్ద ఉన్న మిగిలిన ఐడెంటి మరియు అడ్రెస్ ప్రూఫ్ లను పట్టుకొని వెళ్ళండి.