చైనీస్ స్మార్ట్ ఫోన్స్ Vs ఇంటర్నేషనల్ ఫోన్స్ లో దేనికి ఫ్యూచర్ ఉంది

Updated on 05-Feb-2016

"ఒకరితో ఒకరు మాట్లాడకోవానికి ఇద్దరు ఎదురుగా కనిపించే లేదా వినిపించే దూరంలో ఉండనవసరం లేదు" అనే విషయం తో నేను article మొదలపెడితే చాలా వెటకారంగా ఉంటుంది మీకు చదవటానికి. అంతగా మన లైఫ్స్ లో మొబైల్ అనేది ఇముడిపోయింది. కాని మనం పుట్టకముందు(అప్పటి వరకూ ఎందుకు..) మన చిన్నప్పుడే ఈ మాట ఒక వింతగా ఉండేది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి..

అక్కడ నుండి మొదలైన మొబైల్స్ పరంపర బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్..కలర్ మొబైల్స్.. మల్టీ మీడియా ఫోన్స్.. నోకియా ఫోన్స్.. స్మార్ట్ ఫోన్స్ వరకూ వచ్చింది. దీని తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (A.I) రానుంది. AI గురించి సింపుల్ గా చెప్పాలంటే virtual గా స్మార్ట్ ఫోన్స్ తో మనం రిలేషన్స్ maintain చేసే పరిస్థితులను ఇవ్వనుంది ఫ్యూచర్ లో. అవును నిజమే! 🙂 AI పై కంప్లీట్ స్టోరీ త్వరలో వస్తుంది..

ప్రస్తుత మార్కెట్ ను చూస్తే ప్రపంచంలో ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో చాలా బాగా డెవలప్ అయ్యింది అని అనటంలో అస్సలు అతిశయోక్తిలేదు. ఎందుకంటే సంవత్సరానికి కాదు ఆరు నెలలకు ఒక సారే ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్ users మోడల్స్ ను మారుస్తున్నారు. దీనికి ప్రధానం కారణం చైనీస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్.

చైనా లో టెక్నాలజీ చీప్. అయితే ఇది మొన్నటి మాట. ఇప్పుడు ఇండియా కు కూడా ఇది వస్తుంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు అన్నీ ఇండియన్ మార్కెట్ లో బాగా హల్ చల్ చేస్తున్నాయి. మొదటిగా లెనోవో, తరువాత Xiaomi,Asus, Oneplus, Meizu వెరీ లేటెస్ట్ గా LeEco(LeTV) ఇండియాలో సక్సెస్ లైన్ లో ఉన్నాయి.

ఇది రోజు రోజుకీ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ను తీసుకువస్తుంది. చూస్తుంటే 5 ఇయర్స్ తరువాత 1000 రూ లకు ఫుల్ HD డిస్ప్లే లతో 2GB కు మించిన ర్యామ్ తో స్మార్ట్ ఫోన్స్ వచ్చేలా ఉన్నాయి. ఏమంటారు మీరు? ఇది ఇలా ఉంటే ఒకప్పుడు నోకియా కు పట్టిన గతి లానే ఉంది ఇప్పటి ఇంటర్నేషనల్ ఫేమస్ బ్రాండ్స్ కు.

సామ్సంగ్, LG, సోనీ, HTC, బ్లాక్ బెర్రీ ఒకప్పుడు ఈ పేరులు మనకు బాగా పరిచయం అయినవే కాదు బాగా costly అండ్ నమ్మదగిన బ్రాండ్స్. కాని ఇప్పుడు అస్సలు ఈ కంపెనీల నుండి ఏ ఫోనులు లాంచ్ అవుతున్నాయో కూడా తెలియటం లేదు. కారణం ఇవి ఇస్తున్న so called నాణ్యత గల ఫోనులను చైనీస్ కంపెనీలు తక్కువ లాభాలకే మార్కెట్ లో విడుదల చేస్తున్నాయి.

వీటిలో కొంచెం సామ్సంగ్ ఇంకా బరిలో ఉంది. ఫ్లాగ్ షిప్ మోడల్స్ ద్వారా మార్కెట్ ను కాపాడుకుంటుంది. S6 మోడల్ కంపెని కు పెద్ద help చేసింది. ఆ తరువాత ఇప్పుడు మినిమమ్ మిడ్ రేంజ్ స్పెక్స్ తో చైనీస్ మార్కెట్ ను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తుంది. మిగిలిన వాటి సంగతి చెప్పనవసరం లేదు. అవి బడ్జెట్ సెగ్మెంట్ లోకి అడుగు పెట్టేందుకు ఇంకా నిరాకరిస్తున్నాయి.

డిజిట్ తెలుగు నిన్న చైనీస్ ఫోన్స్ కు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ఒక పోల్ నిర్వహించింది. మొబైల్స్ users గ్రేట్ స్పెసిఫికేషన్స్ ను అండర్ 10,000 రూ బడ్జెట్ తో మార్కెట్ లోకి దించుతున్న చైనీస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ ను కొనటానికి ఇష్టపడతారా లేక ఫేమస్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తో ఎవరేజ్ స్పెసిఫికేషన్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ను కొంటారా అనేది పోల్.

దీనిలో ఇప్పటివరకూ 600 మందికి పైగా పాల్గొనటం జరిగింది.   378  పైగా మొబైల్స్ users గ్రేట్ స్పెక్స్ తో వచ్చే చైనీస్ ఫోనులనే కొంటారని తెలపగా, 164 మంది మినిమమ్ స్పెక్స్ తో వచ్చే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కే మొగ్గుచూపుతారు అని తెలిపారు. 378+164 = 600 కాదు కదా అని ఆలోచించకండి 🙂 మిగిలిన వారు పోల్ లో participate చేయలేదు.  సో దాదాపు 70% చైనీస్ బ్రాండ్స్ ను ఇష్టపడుతున్నారు. 30 శాతం మంది మాత్రం ఇంకా so called నిన్నటి జనరేషన్ ఫేమస్ బ్రాండ్స్ కే పరిమితం అయ్యి ఉన్నారు.

ఆఫ్ కోర్స్ ఇది ఎవరికి వారు వాళ్ళ మొబైల్స్ తో ఉన్న అనుభవాలకు సంబందించినది. ఓవర్ ఆల్ గా ఈ పోల్ లో ఈజీగా ఇండియన్ మార్కెట్ లో చైనీస్ ఫోనులకు ఫ్యూచర్ లో కూడా ఎంత డిమాండ్ ఉండనుంది అని తెలియజేస్తుంది. డిజిట్ స్మార్ట్ ఫోన్స్ పోల్ లో participate అయినవారికి నా ధన్యవాదాలు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :