ప్రపంచం లోనే అతి పెద్ద కన్స్యూమార్( ఎలెక్ట్రానిక్స్ ను వాడే వారు ) ఎలెక్ట్రానిక్ షో, స్టార్ట్ అవుతుంది రేపటి నుండి. మేము CES 2016 లో జరగనున్న విషయాలను అప్ డేట్ చేయనున్నాము. ఇది ప్రతీ సంవత్సరం జవనరి లో జరుగుతుంది.
ఈ సంవత్సరం జనవరి 7 నుండి 9 వరకూ జరగనుంది. మరి ఈ ఈవెంట్ సందర్భాగం ఆల్రెడీ రిలీజ్ అయిన కొన్ని ప్రొడక్ట్స్ చూద్దామా..?
1. హాట్ డ్రింక్స్ మిక్స్ చేసే Brewery – బీర్ తయారు చేస్తుంది ఇంటిలోనే. ఆల్కాహాల్ డ్రింక్స్ ను కూడా అద్భుతంగా మిక్స్ చేస్తుంది. దీనికి యాప్ కూడా ఉంది. 750ml వరకూ స్టోర్ చేయగలదు
2. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ – NVIDIA Drive PX2 అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సూపర్ కంప్యుటర్ ను రిలీజ్ చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కు ఉపయోగపడే టెక్నాలజీ. 150 మాక్ బుక్ ప్రో లకు కు equal గా ఉంటుంది దీని పవర్.
3. నెక్స్ట్ జనరేషన్ thermometer – నోటిలో పెట్టుకొని wait చేసే టైమ్స్ పోయాయి, ఇది హెడ్ పై టచ్ చేస్తే యాప్ సహాయంతో స్మార్ట్ ఫోన్ కు బాడీ టెంపరేచర్ ను పంపిస్తుంది.
4. Faraday Future FF01 కాన్సెప్ట్ – కేవలం హార్స్ పవర్స్ ను increase చేయటం లోనే ఫ్యూచర్ ఆటో మొబైల్స్ గొప్ప తనం కాదు, వాటి నుండి బయటకు వచ్చేవి (పొల్యూషన్ etc) కూడా తగ్గించటంలో సఫలం అయితేనే అవి ఫ్యూచర్ ఆటోమొబైల్స్ అని ప్రోవ్ చేసింది ఈ కొత్త కాన్సెప్ట్.
5. Inail ఇంటెలిజెంట్ ప్రింటర్ – 3D ప్రింటర్ లా పనిచేస్తుంది. ఏదైనా ప్రింట్ కావాలంటే డిజైన్ ను సెట్ చేసుకొని మెషిన్ లోపల వేలు పెడితే చాలు ప్రింట్ వస్తుంది మీ చేతి వేలు మీద నచ్చిన విధంగా.
6. Parrot డిస్కో ఫిక్స్డ్ – వింగ్ డ్రోన్ – ఆటోమేటిక్ take-off అండ్ లాండింగ్ ఇస్తుంది. ఇదే చాలా ఇంపార్టంట్ manual జాబ్. సో డ్రోన్స్ అవసరం ఉన్న వారికీ బాగా useful అవుతుంది. 2 km అండ్ 45 మినిట్స్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. (డ్రోన్ అంటే రిమోట్ కంట్రోల్ తో పనిచేసే ఎగిరే డివైజ్)
7. ZIRO : చేతితో కంట్రోల్ చేయగలిగే రోబోటిక్ కిట్. అంటే ఫర్ eg మీరు దీనిని మీ కార్ లో ఫిట్ చేస్తే, gloves వేసుకొని చేతితో కార్ మూవ్మెంట్స్ ను కంట్రోల్ చేయగలరు. దీనికి యాప్ కూడా ఉంది.
8. Hyundai AR manual – మనం గాడ్జెట్స్ చదివేటప్పుడు manual గా ఇన్ఫర్మేషన్ చదువుతాము. ఇది కొత్తగా రియాలిటీ లో డిటేల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది యాప్ సహాయంతో. అయితే ఇది కేవలం కార్స్ కు మాత్రమే.
9. Immersit – మీరు 7D థియేటర్స్ అంటూ మాల్స్ లో కనిపించే కొన్ని ఎంటర్టైన్మెంట్ విభాగాలు చూసే ఉంటారు. ఇప్పుడు అలాంటివి ఇంటిలోనే పొందటానికి ఇది పనిచేస్తుంది. అంటే ఆ కాన్సెప్ట్ లో. మీరు VR లో చూసే కంటెంట్ కు తగ్గట్టుగా లెగ్స్ ను మూవ్ చేస్తూ రెండు పాడ్స్ ఉంటాయి. చైర్స్ మూవింగ్ అండ్ 3d ద్వారా ఇది virtual reality ను మరింత రియల్ గా చేసే డివైజ్.
10. MagSafe – ఇది లాప్ టాప్ ను USB c పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసే కనెక్టర్. ఇది ఏప్రిల్ లో లాంచ్ కానుంది. ప్రైస్ 2700 రూ. సుమారు. ఇండియాలోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే చార్జర్స్ పట్టుకొని తిరగనవసరం లేకుండా జస్ట్ డేటా కేబుల్ లాంటి కనేక్టర్ తో లాప్ టాప్ కు చర్కింగ్ చేయగలరు. అయితే ఇది ఆపిల్ మాక్ బుక్ కు మాత్రమే. Griffin కూడా పోర్టబల్ చార్జర్ రిలీజ్ చేసింది ఆపిల్ వాచ్ కు. 4,700 రూ.
11. కంట్రోలింగ్ BB-8 droid – చేతికి పెట్టుకునే బ్లూ టూత్ wrist బాండ్ వలె ఉంటుంది ఈ ఫోర్స్ బాండ్. కేవలం చేతిని ముందుకు వెనకకు కదిపితే చాలు droid కదులుతుంది. BB-8 droid అంటే చిన్న బొమ్మలా ఉంటే గాడ్జెట్.