లెనోవో K6 పవర్, రెడ్మి 3S ప్రైమ్ & Meizu M3S లో ఏది బెటర్ ఫోన్? తెలుసుకోండి క్రింద
ఇక్కడ లెనోవో K6 పవర్, రెడ్మి 3S prime అండ్ Meizu M3S ను కంపేర్ చేయటం జరిగింది. మూడింటిలో ఏది బెస్ట్ అనేది తెలపటానికి ఈ ఆర్టికల్.
డిస్ప్లే అండ్ డిజైన విషయంలో:
మూడు 5 in స్క్రీన్ తో సిమిలర్ తయారీ కలిగి ఉన్నాయి. కానీ లెనోవో లో ఫుల్ HD డిస్ప్లే ఉంది. మిగిలిన రెడింటిలో HD డిస్ప్లే ఉంది. అంటే లెనోవో మిగిలిన రెండింటి కన్నా డబుల్ పిక్సెల్ డెన్సిటీ ఇస్తుంది. అయితే రియల్ time usage లో మీకు రెడ్మి లోని డిస్ప్లే కూడా బాగుంటుంది. పెద్దగా తేడాలు తెలుసుకోలేరు.
లుక్స్ వైజ్ గా మూడు 140 గ్రా సుమారు బరువుతో వస్తూ ఒకేలా ఉంటాయి చూడటానికి. రౌండ్ edges, మెటల్ బ్యాక్ పనెల్, సింగిల్ హ్యాండ్ usability తో వస్తున్నాయి మూడు. స్పెక్స్ వైజ్ గా చూస్తె లెనోవో కు డిస్ప్లే విషయంలో పై చేయి ఉంది కాని రెడ్మి 3S ప్రైమ్ అన్నిటికన్నా బెటర్ కలర్ బాలన్స్ తో వస్తుంది.
user ఇంటర్ఫేస్:
ఒక్క Meizu లోనే లాలిపాప్ ఉంది, మిగిలిన రెండింటిలో మార్ష్ మల్లో ఉంది. లెనోవో ఒరిజినల్ ఆండ్రాయిడ్ లుక్స్ కు దగ్గరగా ఉంటుంది. మిగిలిన రెండూ సొంతంగా అదనపు లుక్స్ అండ్ ఫంక్షన్స్ తో వస్తున్నాయి. లెనోవో లో యాప్ డ్రాయర్, ఫింగర్ ప్రింట్ యాప్ లాక్ ఫీచర్, థీమ్ స్టోర్ ఉన్నాయి.
అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కాబట్టి, ఎక్కువ customization కావాలనుకుంటే MIUI బెటర్, creamy అండ్ డిఫరెంట్ లుక్స్ కు ఇష్టపడితే Meizu బెటర్, ఓవర్ ఆల్ గా ఒరిజినల్ ఆండ్రాయిడ్ లుక్స్ ను ఇష్టపడే వారికీ లెనోవో బెటర్ UI. ఇది MIUI కన్నా తేలికగా కూడా ఉంటుంది రామ్ వినియోగంలో.
పెర్ఫార్మన్స్:
పేపర్ పై చూస్తె లెనోవో, రెడ్మి లో ఉన్న స్నాప్ డ్రాగన్ 430 SoC తోనే వస్తుంది. కాని పెర్ఫార్మన్స్ రెడ్మి కన్నా slight గా బెటర్ గా ఉంది synthetic బెంచ్ మార్క్స్ లో. అయితే డైలీ వాడుక లో రెండూ సిమిలర్ గా పెర్ఫార్మెన్స్ అందిస్తాయి. రెండింటిలో ప్రాక్టికల్ పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్ చూడటం చాలా కష్టం.
Meizu మిగిలిన రెండింటి కన్నా వెనుక బడింది సింథటిక్ బెంచ్ మార్క్స్ లో. day to day usage లో ఫర్వాలేదు మంచిదే. కాని అప్పుడప్పుడు లాగ్స్ ఇస్తుంది. ఈ లాగ్ మిగిలిన రెండింటిలో కనపడటం లేదు.
ఆడియో కచ్చితంగా క్వాలిటీ లెనోవో లో బాగుంది. ఎందుకంటే దీనికి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి వెనుక. అలాగే హెడ్ ఫోన్స్ లో కూడా ఇదే మంచి సౌండ్ అందిస్తుంది.
బ్యాటరీ లైఫ్:
రెడ్మి 3S ప్రైమ్ కన్నా 100 mah తక్కువ కెపాసిటీ తో 4000 mah కలిగి ఉంది లెనోవో. కానీ దీనికి ప్రత్యేకంగా ఫుల్ HD డిస్ప్లే ఉండటం కారణంగా బ్యాటరీ మిగలిన వాటి కన్నా ఫాస్ట్ గా అయిపోతుంది టెక్నికల్ గా. ప్రస్తుతానికి అయితే రెడ్మి 3S prime లానే మంచి బ్యాటరీ బ్యాక్ అప్ అందిస్తుంది. ఇంకా ఫైనల్ నిర్ణయాలు తెలుసుకోవాలి మేము.
కెమెరా
ఇక్కడ లేనోనో లీడింగ్ లో ఉంది. మూడింటిలో 13MP కెమెరా ఉంది కాని లెనోవో లో బెటర్ కలర్ reproduction ఉంది. నెక్స్ట్ రెడ్మి లీడింగ్ లో ఉంది. మూడింటిలో Meizu పూర్ కెమెరా క్వాలిటీ అందిస్తుంది. జస్ట్ ఎవరేజ్ అని చెప్పాలి. డిటేల్స్ ఉండటం లేదు Meizu లో. క్రింద పిక్స్ చూడగలరు.
ఫైనల్ లైన్
ఓవర్ ఆల్ గా చూస్తె మూడింటిలో లెనోవో K6 పవర్ బెటర్ ఫోన్ అని తేలింది intial comparison. కెమెరా, పెర్ఫార్మన్స్, ఇంటర్ఫేస్ , బ్యాటరీ లైఫ్ మంచిగా ఉన్నాయి దీనిలో.
Hardik Singh
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile