Xiaomi రెడ్మి 3S prime(8,999 rs) OR రెడ్మి నోట్ 3 (9,999rs) :1000 రూ డిఫరెన్స్ లో ఏది బెస్ట్ ఫోన్

Xiaomi రెడ్మి 3S prime(8,999 rs) OR రెడ్మి నోట్ 3 (9,999rs) :1000 రూ డిఫరెన్స్ లో ఏది బెస్ట్ ఫోన్

Xiaomi రెండు మంచి ఫోనులను చాలా కష్టంగా ఎంచుకునేలా స్పెక్స్ జోడించి తక్కువ డిఫరెన్స్ లోని బడ్జెట్స్ లో రిలీజ్ చేసింది. అవే 10 వేల రూ రెడ్మి నోట్ 3 అండ్ 9 వేల రూ రెడ్మి 3S prime.

రెండింటిలో ఏది తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నవారి కోసం ఈ ఆర్టికల్. ముందుగా రెండు ఫోనుల స్పెక్స్ అండ్ డిఫరెన్స్ లు చూద్దాం…

Xiaomi Redmi Note 3 16GB  ప్రైస్ –  9,999 రూ

Specs:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 2GB
Storage: 16GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1

Xiaomi Redmi 3s Prime  ప్రైస్ – 8,999 రూ

స్పెక్స్
Display: 5-inch, 720p
SoC: Qualcomm Snapdragon 430
RAM: 3GB
Storage: 32GB
Camera: 13MP, 5MP
Battery: 4100mAh
OS: Android 6.0.1

రెండింటిలో ఎవరికీ ఏది అవసరం:
ఇక స్పెక్స్ వైజ్ గా కూడా చూసినట్లయితే 1000 రూ ఎక్కువైన్నప్పటికీ – రెడ్మి నోట్ 3 లో 2GB రామ్ అండ్ 16GB ఇంబిల్ట్ స్టోరేజ్(హైబ్రిడ్ స్లాట్) ఉంది. కాని 1000 రూ తక్కువైన 3S prime లో 3GB ర్యామ్ అండ్ 32 GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది(ఇది కూడా హైబ్రిడ్ స్లాట్). ఇక్కడ confuse అవ్వకుండా స్టోరేజ్ అండ్ మల్టీ టాస్కింగ్ అనేది మీకు ప్రోసేస్సింగ్ అండ్ గేమింగ్ పెర్ఫార్మన్స్ కన్నా ఎక్కువ ప్రియారిటీ అయితే 3S prime తీసుకోవాలి. అంతేకాదు మీకు డ్యూయల్ సిమ్ అనేది డైలీ usage లో అవసరం అనుకుంటే కచ్చితంగా రెడ్మి 3S prime తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది. కాని రెడ్మి నోట్ 3 9,999 వేరియంట్ లో కేవలం 16GB ఉంది. అంటే మీరు SD కార్డ్ పై కచ్చితంగా డిపెండ్ అవ్వవలసిన పరిస్తితి ఉంది. కాని డ్యూయల్ సిమ్ అవసరం కూడా ఉంటే రెండూ ఒకేసారి సాధ్యం కావు హైబ్రిడ్ స్లాట్ కారణంగా.

స్పెక్స్ వెనుక ఉన్న కంటెంట్ విషయంలో రెండింటిలో ఏది బెస్ట్ : 
processing స్పీడ్ పరంగా మాత్రం రెడ్మి నోట్ 3 మంచి ఫోన్ రెడ్మి 3S prime కన్నా. 3S prime హెవీ usage కు పర్ఫెక్ట్ కాదు. రెడ్మి నోట్ 3 బాగా పవర్ఫుల్ ఫోన్. అంటే గేమింగ్ వంటి హెవీ usage మరియు భారి యాప్స్ తో ఫోన్ వాడుక ఉన్న వారు రెడ్మి నోట్ 3 2GB వేరియంట్ తీసుకోవటం బెటర్. ఇక్కడ చెబుతున్న processing పవర్ అనేది ప్రొసెసర్ లో ఉంటుంది. సో రామ్ 2GB నే ఉంది కదా అనుకోకండి. పవర్ డిఫరెన్స్ అంతా  Snapdragon 650(రెడ్మి నోట్ 3) ప్రొసెసర్ లోనే ఉంది. 3S లో ఉన్నSnapdragon 430 650 SoC తో పోటీ పడలేదు.

ఇంపార్టెంట్ టిప్: యూనివర్సల్ గా బెస్ట్ ఫోన్ అనేది ఉండదు అనే వాస్తవాన్ని మీరు ముందుగా జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయండి. జనరల్ గా ఇలాంటి మాటలు కొందరికి నచ్చవు కాని అది నిజం, అందుకే జీర్ణించుకకోవాలి అన్నాను. సో పాయింట్ ఏంటంటే మీ అవసరానికి ఏ ఫోన్ లో ఎటువంటి స్పెక్స్ ఉన్నాయి. డైలీ usage లో మీరు నిజంగా వాడే స్పెక్స్ దేనిలో ఉన్నాయి అనే ప్రశ్నకు హానెస్ట్ గా జవాబు మీకు మీరే అడిగి తెలుసుకొని ఎటువంటి హంగులు, "ఫేమస్ ఫోన్" అనే మాటలకూ లొంగకుండా చూస్ చేసుకోవాలి ఫోన్ ఇదే బెస్ట్ బయింగ్. సో ఎవరినీ అడగకుండా మీకు మీరు తీసుకుంటే అదే బెస్ట్ బయింగ్. అయితే రీసర్చ్ (అంటే మీ డైలీ అవసరాలను సమీక్షించుకొని వాటికీ తగ్గట్టుగా ఎంచుకోవటం) చేసుకొని తీసుకోవాలి. ఊరికే ఏమి తెలుసుకోకుండా తీసుకోవటం అనేది సరైన పద్దతి కాదు అని గ్రహించాలి. గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.
రెడ్మి 3S prime కంప్లీట్ రివ్యూ కొరకు ఈ లింక్ లో కి వెళ్ళండి.
రెడ్మి నోట్ 3 3GB వేరియంట్ కంప్లీట్ రివ్యూ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు.

Buy Xiaomi Redmi Note 3 on flipkart at Rs 9999 
Buy Xiaomi Redmi 3S Prime on flipkart at Rs 8999 

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo