ఐ ఫోన్ 7 తో పాటు లాంచ్ అయిన ఆపిల్ AirPods, iOS 10 అండ్ సిరిస్ 2 ఆపిల్ వాచ్ కంప్లీట్ డిటేల్స్

ఐ ఫోన్ 7 తో పాటు లాంచ్ అయిన ఆపిల్ AirPods, iOS 10 అండ్ సిరిస్ 2 ఆపిల్ వాచ్ కంప్లీట్ డిటేల్స్

ఆపిల్ ఫైనల్ గా ఐ ఫోన్ 7 మరియు ఐ ఫోన్ 7 ప్లస్ ఫోనులను లాంచ్ చేసింది. వీటితో పాటు మొదటి సారిగా Apple AirPods పేరుతో wireless ఇయర్ ఫోన్స్ మరియు ఆపిల్ Watch Series 2 కూడా రిలీజ్ అయ్యాయి.

Apple AirPods

ఐ ఫోన్ 7 లో apple 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ను రిమూవ్ చేసి USB టైప్ C పోర్ట్ ను అందిస్తుంది. ఇక ఆపిల్ ఫోన్స్ లో కూడా 3.5mm హెడ్ ఫోన్ జాక్ కనిపించదు. అయితే ఫోన్స్ తో పాటు ఆపిల్ ఇయర్ ఫోన్స్(వైర్లెస్ కాదు) మరియు 3.5mm జాక్ కనెక్టర్ కూడా ఇస్తుంది.

Wireless airpods ఇయర్ ఫోన్స్ గురించి కొన్ని పాయింట్స్..

  • pairing వంటివి అవసరం లేకుండా చెవిలో పెట్టుకోగానే ఆపిల్ ఫోన్ కు కనెక్ట్ అయిపోతాయి.
  • W1 చిప్ తో బెటర్ కనెక్షన్ అండ్ సౌండ్.
  • Built-in బ్యాటరీ – సొంతంగా బ్యాటరీ తో వస్తుంది.
  • సింగిల్ చార్జింగ్ కు 5 గంటలు బ్యాక్ అప్ వస్తుంది.(సామ్సంగ్ IconX వైర్లెస్ ఇయర్ ఫోన్స్ సుమారు 3 గం కంపెని ప్రకారం)
  • airpods లో ఆప్టికల్ sensors, మోషన్ accelerometers(ఆడియో మరియు mic ను కంట్రోల్ చేయటానికి)
  • చెవిలో పెట్టుకోగానే సౌండ్ తో నోటిఫికేషన్ వస్తుంది.
  • టచ్ కంట్రోల్స్ అండ్ సిరి టచ్ కంట్రోల్ సపోర్ట్.
  • 15 mins పాటు కేస్ లో పెడితే (చార్జింగ్ అవుతాయి) 3 గంటలు బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తాయి.
  • AirPods price charging case తో కలిపి  15,400 రూ ఇండియాలో
  • ఆపిల్ తెలిపిన సమాచారం ప్రకారం Airpods కేవలం iOS 10 OS, watchOS® 3 or macOS™ Sierra  పై రన్ అవుతున్న ఆపిల్ డివైజెస్ పైనే పనిచేస్తుంది.

 

Apple Watch Series 2 :


Confuse అవ్వకండి, ఆపిల్ రెండవ జనరేషన్ వాచ్ కు కంపెని సిరిస్ 2 అని కొంచెం డిఫరెంట్ పేరు పెట్టింది అంతే! డిజైన్ same మొదటి జనరేషన్ వాచ్ వలె ఉంది ఆల్మోస్ట్. కాని లోపల changes జరిగాయి.

  • Built-in GPS – డిస్టెన్స్, స్పీడ్, pace రికార్డింగ్ అవుతాయి.
  • PokemonGO గేమ్ ను ఇప్పుడు వాచ్ లో కూడా ఆడుకోగలరు. అంటే నడుస్తూ ఉంటే, ఫోన్ చూడకుండా pokemon దగ్గరిలో ఉన్నప్పుడు తెలుసుకోగలరు.
  • డ్యూయల్ కోర్ SoC అండ్ రెండు రెట్లు (2X times) అధిక బ్రైట్ నెస్ డిస్ప్లే – 1000 nits (nits అంటే brightness measurement) 
  • 50 మీటర్స్ వాటర్ resistant
  • Watch OS 3
  • 2nd GEN వాచ్ తో పాటు మొదటి జనరేషన్ వాచ్ కు అప్ గ్రేడ్ వేరియంట్ ను కూడా series 1 పేరుతో లాంచ్ చేసింది. దీనిలో కూడా డ్యూయల్ కోర్ SoC ఉంది.
  • Series 1 వాచ్ gold, rose gold, silver మరియు space grey aluminium cases,  Sport Band తో కలిసి 23,900 రూ ప్రైస్ తో వస్తుంది.
  • Apple Watch Series 2  gold, rose gold, silver, space grey aluminium, space black stainless steel cases వివిధ రకాల bands తో కలిసి  32,900 రూ లకు వస్తుంది.

 

iWork, iOS 10 etc :

  • రియల్ time కొలాబరేషన్  వర్క్స్ కొరకు iWork – డాకుమెంట్స్ ఇతర వర్క్స్ ను లైవ్ రిసల్ట్స్ తో ఒకే సారి పనిచేయగలరు.
  • సెప్టెంబర్ 13 నుండి iOS 10 కొత్త ఓస్  అన్ని ఆపిల్ డివైజెస్ కు అప్ డేట్ రోల్ అవుతుంది. అయితే ఆల్రెడీ iOS 10 బీటా వెర్షన్ లో రిలీజ్ అయ్యింది.
  • కొత్త వెర్షన్ లో Widgets, improved సిరి, డిజిటల్ Home వంటివి ఉన్నాయి. డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేవు కాని కొంచెం curves యాడ్ అయ్యాయి నోటిఫికేషన్స్ కు.
  • వీటితో పాటు ఆపిల్ మొదటి సారి, ConnectED పేరుతో iPads, మాక్ లాప్ టాప్స్ అండ్ ఆపిల్ TV's ను ఫ్రీ గా డొనేట్ చేస్తుంది కొంతమంది స్టూడెంట్స్ కు. ఇవే ఆపిల్ నిన్న జరిగిన ఈవెంట్ లో చేసిన అనౌన్సుమెంట్స్. 
  • ఈ లింక్ లో iOS 10 కు సంబంధించి కంప్లీట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూడగలరు.

 

iOS 10 OS అప్ డేట్ ను సపోర్ట్ చేసే ఐ ఫోన్స్ అండ్ iPads లిస్టు:

  • iPhone 7                                           
  • iPhone 7 Plus
  • iPhone 6s
  • iPhone 6s Plus
  • iPhone 6
  • iPhone 6 Plus
  • iPhone SE
  • iPhone 5s
  • iPhone 5c
  • iPhone 5
  • iPad Pro 12.9-inch
  • iPad Pro 9.7-inch
  • iPad Air 2
  • iPad Air
  • iPad 4th generation
  • iPad mini 4
  • iPad mini 3
  • iPad mini 2
  • iPod touch 6th generation

ఈ లింక్ లో డిజిట్ తెలుగు ట్విటర్ అకౌంట్ లో ఆపిల్ లైవ్ ఈవెంట్ announcement కు సంబంధించి 45 tweets ను లైవ్ గా తెలపటం జరిగింది నిన్న రాత్రి. మిస్ అయిన వారు వాటిని ఒకసారి చూడగలరు.
ఈ లింక్ లో ఆపిల్ ఐ ఫోన్ 7 మోడల్స్ ప్రైస్ – డిటైల్డ్ స్పెక్స్ మరియు ఐ ఫోన్ 7 కు ఐ ఫోన్ 7 ప్లస్ కు ఉన్న తేడాలు చూడగలరు.
డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

 

 

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo