లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కెమెరా టెక్నాలజీలు నిజంగా DSLR కెమెరాలను మించుతున్నాయా? బెస్ట్ &సింపుల్ ఎనాలిసిస్ with pics

Updated on 18-Nov-2016

గూగల్ పిక్సెల్ లో బెస్ట్ crisp డిటేల్స్ మరియు సామ్సంగ్ గాలక్సీ  S7 edge లో ఉండే excellent low లైటింగ్ గుణాలను తీసుకొని తన సొంత కలర్స్ అండ్ వైట్ బాలన్స్ ఆల్గోరిథమ్స్ ను కలిపి ఓవర్ ఆల్ గా అన్నిటికంటే ఉత్తమమైన కెమెరా స్మార్ట్ ఫోన్ గా నిలిచింది ఆపిల్ ఐ ఫోన్ 7 ప్లస్.

సో రోజు రోజుకూ ధరలతో పాటు పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ కెమెరా టెక్నాలజీలు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కెమెరాలకు ఎంత దగ్గరిలో ఉన్నాయి, అసలు వాటితో సమానం గా ఉన్నాయా లేదా తెలుసుకుందాము రండి..

సో ఇక్కడ స్మార్ట్ ఫోనుల్లో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి అన్నిటికన్నా బెస్ట్ అనిపించుకున్న ఐ ఫోన్ 7 ప్లస్  ను Canon లేటెస్ట్ గా రిలీజ్ చేసిన కెమెరా మరియు ప్రస్తుతం ఫోటోగ్రఫీ ప్రపంచంలో అన్నిటినీ సమగ్రంగా మేనేజ్ చేయగలిగే DSLR కెమెరా అయిన  EOS 5D Mark IV ఫుల్ ఫ్రేమ్ DSLR ప్రొఫెషనల్ కెమెరా తో పోల్చి చూద్దాం..

అయితే విడివిడిగా ఈ రెండూ డౌట్ లేకుండా బెస్ట్ క్వాలిటీ ఫోటోస్ ను తీస్తాయి. కాని స్మార్ట్ ఫోన్ కెమెరా టెక్నాలజీ ప్రొఫెషనల్ కెమెరాలకు ఎంత దగ్గరిలో ఉన్నాయి అనే కొలమానం తెలుసుకోవటానికే ఈ కంపేరిజన్. క్రింద  ఫోటోస్ చూడగలరు..

ముందుగా ఇమేజ్ క్వాలిటీ మరియు నాయిస్ లెవెల్స్..

ఐ ఫోన్ 7 ప్లస్ reasonable గా షార్ప్ ఫోటోస్ తీస్తుంది. కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ మరియు వైట్ బాలన్స్లు బాగున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ లో ఇమేజింగ్ సెన్సార్ లు చిన్నగా ఉంటాయి కనుక తీసిన ఇమేజ్ ను 100% crop చేసినప్పుడు క్వాలిటీ తగ్గుతుంది.

Apple iPhone 7 Plus(పైన ఉన్న ఇమేజ్)

Canon EOS 5D Mark IV

సో ఐ ఫోన్ 7 ప్లస్ లో కలర్స్ సోర్స్ కు దగ్గరగా ఉన్నాయి కానీ 100% crop లో పిక్సెల్ నాయిస్ ఉంటుంది. ఉండటం సమజసం కూడా. ఎందుకంటే… ఐ ఫోన్ 7 ప్లస్ అనేది స్మార్ట్ ఫోన్ కేటగిరి డివైజ్. సో దీనిలోని సెన్సార్ 1/3 inch టైప్ సెన్సార్. దీని measurement కూడా 4.8mm x 3.6mm. అదే ప్రొఫెషనల్ DSLR కెమెరా అయిన Canon EOS 5D Mark IV measurement 36mm x 24mm. దానికి తోడూ ఇది ఫుల్ ఫ్రేమ్ సెన్సార్. సో ఇది ఐ ఫోన్ 7 ప్లస్ కన్నా 50 రెట్లు పెద్దది. అందువలన ఆటోమాటిక్ గా canon లైటింగ్ కెపాసిటీ లో లీడింగ్ లో ఉంటుంది.

Apple iPhone 7 Plus(పైన ఉన్న ఇమేజ్)

Canon EOS 5D Mark IV

సో ఫోన్ కెమెరాలలో నాయిస్ అనేది మెకానికల్ లిమిటేషన్ కారణంగా ఉంటూనే ఉంటుంది. అంటే చిన్న sensors కారణంగా ఎంత చిన్న సెన్సార్ ఉంటే Low లైటింగ్ మరియు smaller పిక్సెల్స్ లో నాయిస్ లెవెల్స్ అంత ఎక్కువగా ఉంటాయి.

Apple iPhone 7 Plus

Canon EOS 5D Mark IV

అంతర్గతంగా కూడా Canon EOS 5D Mark IV తో తీసిన ఫోటోలలో బ్రైట్ నెస్ మరియు vibrant బాగా ఉన్నాయి అండ్ sharpness గ్రేట్ గా ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఐ ఫోన్ 7 ప్లస్ ను అత్యవసరమైన కెమెరా గా వాడుకోవచ్చు. ఫోన్ లోని frames కు లోబడి మంచి డిటేల్స్, కలర్స్ అండ్ షార్ప్ నెస్ ఇస్తుంది ఇది కూడా. సో బాటం లైన్ ఏంటంటే ఏ స్మార్ట్ ఫోన్ కెమెరా అయినా DSLR ను మించిన నాణ్యతను ఇవ్వవు కాని ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కు అప్పటికప్పుడు తీసుకునే instant ఫోటోస్ అవసరాలకు ఉపయోగించుకోగలరు.

Bokeh mode in Apple iPhone 7 Plus(పైన ఉన్న ఇమేజ్)

Bokeh mode in Canon EOS 5D Mark IV(రెండింటిలో ఇది పెర్ఫెక్ట్ గా ఉంది)

 

Apple iPhone 7 Plus

Canon EOS 5D Mark IV

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :