USB Type-C పోర్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్
ఈ మధ్య ఎక్కువుగా "usb టైప్ c పోర్ట్" అనే స్పెసిఫికేషన్ స్మార్ట్ ఫాన్స్ స్పెక్స్ లో ఎక్కువుగా వినిపిస్తుంది. అయితే అసలు ఇది ఏంటి? ఎందుకు? అనే ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి.. కాని అడగటానికి, తెలుసుకోవటానికి చాలా చిన్న విషయం అని దాని మీద ఎక్కువ టైమ్ కేటాయించారు.
usb అంటే కన్కేషణ్. usb లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇవ్వనీ వాటి ఫిజికల్ ఆకారం బట్టి వాటి ఉపయోగాలు మారుతాయి. అలానే వీటిలో మళ్ళీ వెర్షన్స్ కూడా ఉన్నాయి.
usb 2.0, 3.0, 4.0 ఇలా. వెర్షన్స్ లో వాటి గుణాలు, స్పీడ్ వంటి విషయలు మారుతూ ఉంటాయి. అందరం కామన్ గా వాడె usb టైప్ పోర్ట్స్… Type – A అండ్ Type – B. ఇవి కేవలం ఒక సైడ్ మాత్రమే కనెక్ట్ చేసుకునే వీలు కలిపిస్తాయి.
అదేంటి, రెండు వైపులా కన్కేక్ట్ చేసుకోవచ్చా?.. అవును రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వీలు ఇస్తుంది ఇప్పుడు USB టైప్ C పోర్ట్. Usb Type-C పోర్ట్ అంటే అది కనెక్టర్ షేప్ మాత్రమే.
ఆపిల్ కొత్త మాక్ బుక్ లో USB Type C పోర్ట్
దిని ఫిజికల్ కనేక్టర్ సైజ్.. 8.4mm వెడల్పు, 2.6mm పొడవు ఉంటుంది. దీనిని reversible ప్లగ్ orientation అని కూడా అంటారు.
రెండు వైపులా కనెక్ట్ చేసుకునేలా…. టైప్ A లో ఇది మూడవ వంతు పరిమాణంలో ఉంటుంది. డేటా ట్రాన్సఫర్ అండ్ స్పీడ్ పవర్ డెలివరీ విషయాలలో టైప్ c పోర్ట్ స్టాండర్డ్ usb 3.0 ఫార్మాట్ నే ఫాలో అవుతుంది.
కాని దాని కన్నా 100 వాట్స్ అంటే 10 రెట్లు ఎక్కువ పవర్ డెలివరీ ఇస్తుంది. అలానే 10gbps bandwidth తో చేయగలదు. ఇది usb 3.0 కు డబుల్ bandwidth.
ఇది ఏమి కనెక్ట్ చేస్తుంది?
సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే.. ఇది మనం ప్రస్తుతం వాడుతున్న లాప్ టాప్ అండ్ మొబైల్ చార్జర్స్ మీద ఆధారపడే అవసరం లేకుండా on-the-go లో టైప్ c పోర్ట్ ద్వారా వాటి కన్నా ఫాస్ట్ గా చార్జింగ్ చేసుకోగలము. అలానే గేగా బైట్ డేటాలను సేకేండ్స్ లో ట్రాన్సఫర్ చేయగలము.
కొంచెం టెక్నికల గా ..
దీనితో లాప్టాప్స్ ను మొబైల్స్, కేమేరాస్, కీ బోర్డ్స్, ప్రింటర్స్, స్కానర్స్ మరియు మొబైల్స్ ను కేమేరాస్, టీవీ, లాప్టాప్స మరియు అదే పోర్ట్ ఉన్న అన్ని కొత్త జేనేరేషణ్ డివైజెస్ కు కనెక్ట్ చేస్తుంది. USB టైప్ C పోర్ట్ ముందుగా ఆపిల్ mac లాప్టాప్ లో డెవలప్ అయ్యింది.
ఇది bi-directional పద్ధతిలో పవర్ సెండ్ అండ్ receive కూడా చేస్తుంది. ఇప్పుడు దీనితో మొబైల్స్ అండ్ లాప్ టాప్స్ కు పవర్ చార్జింగ్ మరియు హాయ్ స్పీడ్ డేటా ట్రాన్సఫర్ చేయగలము.
అయితే రెండు డివైజెస్ ను usb టైప్ c పోర్ట్ ద్వారా కనెక్ట్ చేయాలంటే, రెండు వైపులా పోర్ట్ ఉండాలి. అయితే mac లాప్టాప్స్ అండ్ వెరీ రీసెంట్ స్మార్ట్ ఫోన్స్ కు మాత్రమే ఇది ఉండ కాబట్టి, తక్కువ డివైజెస్ కే పనిచేస్తుంది ప్రెసెంట్. కాని ఒక ఎండ్ లో usb టైప్ c పోర్ట్ ఉండి, మరొక వైపు స్టాండర్డ్ usb 2.0 లేదా 3.0 వాడి వీటిని వాడుకోవచ్చు.
usb టైప్ c పోర్ట్ సెపరేట్ అడాప్టర్ ద్వారా HDMI, VGA, డిస్ప్లే పోర్ట్స్ మరియు ఇతర కనెక్షన్ లకు కూడా ఔట్పుట్ గా మారి పనిచేస్తుంది. ఈ టైపు c పోర్ట్ వాడటం వలన ఎక్కువ కేబుల్స్ అవసరం లేకుండా సింపుల్ గా టెక్నాలజీ ను వాడుకోవచ్చు.
ప్రస్తుతం ఆల్రెడీ usb టైప్ c పోర్ట్ ఉన్న డివైజెస్…
నోకియా N1 ఆండ్రాయిడ్ టాబ్లెట్. ఇది అనౌన్స్ అయ్యింది కాని ఇంకా మార్కెట్ లో రిలీజ్ కాలేదు. ఆపిల్ 2015 12 ఇంచ్ MacBook, గూగల్ సెకెండ్ క్రోమ్ బుక్ పిక్సెల్, oneplus 2 , వెరీ రీసెంట్… Xiaomi Mi 4C