ఆండ్రాయిడ్ తయారుచేసిన వ్యక్తి నుండి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది

Updated on 16-Jan-2017

ఆండ్రాయిడ్ ను కనుగొన్న మొదటి వ్యక్తి Andy Rubin ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నారు. అవును గూగల్ ఇతని వద్ద ఆండ్రాయిడ్ OS ను కొనటం జరిగింది. ఈ ఆండ్రాయిడ్ క్రియేటర్ నుండి bloomberg రిపోర్ట్స్ ప్రకారం 2017 మిడ్ లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇది అతని సొంత కంపెని అయిన Essential Products నుండి రానుంది. ఈ ఫోన్ పై ఇప్పటివరకూ వినిపిస్తున్న విషయాల్లోకి వెళ్దాం..

డిస్ప్లే: 5.5 in కన్నా పెద్ద స్క్రీన్ ఉంటుంది కాని సైడ్స్ లో బెజేల్స్ ఉండవు. సో ఓవర్ ఆల్ సైజ్ 5.5 in డిస్ప్లే కలిగిన ఐ ఫోన్ 7 ప్లస్ కన్నా తక్కువగా ఉంటుంది. అదనంగా దీనికి pressure-sensitive ఫీచర్ కూడా ఉండనుంది, ఐ ఫోన్ మాదిరిగా.

డిజైన్: మెటల్ అండ్ ceramic బాడీ తో రానుంది. modular కాన్సెప్ట్ ఉంటుంది అని వినికిడి. 360 డిగ్రీ ఇమేజే లను షూట్ చేస్తే కెమెరా సెట్ అప్ తో పాటు add on accessories ఉంటాయని అంచనా.

సాఫ్ట్ వేర్: ఇది ఆండ్రాయిడ్ పై నడుస్తుందా లేదా ఇంకా తెలియదు కాని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆనవాలలలు అయితే ఉండనున్నాయి అని తెలుస్తుంది.

ప్రైస్ అండ్ రిలీజ్ డేట్: ఇది చీప్ గా ఉండదు. ఆపిల్ ఐ ఫోన్ 7 & గూగల్ పిక్సెల్ కు పోటీ గా ఉంటుంది. Andy Rubin కంపెని Foxconn హార్డ్ వేర్ తయారీ కంపెని తో మంతనాలు జరుపుతుంది తమ ఫోన్ తయారీ కొరకు. సో 2017 జూన్-జూలై ముగిసే నాటికి వస్తుంది అని అంచనా.

Lenovo Z2 Plus అమెజాన్ లో 14,999 లకు కొనండి

Adamya Sharma

Managing editor, Digit.in - News Junkie, Movie Buff, Tech Whizz!

Connect On :