Acer లిక్విడ్ Z630s & Z530: ఫర్స్ట్ ఇంప్రెషన్స్
Taiwanese కంపెని, Acer లిక్విడ్ Z630S(10,999 రూ) లిక్విడ్ Z530(6,999 రూ) అని రెండు మోడల్స్ రిలీజ్ చేసింది నిన్న ఇండియాలో. వీటి పై మా మొదటి అభిప్రాయాలను చూడగలరు..
పెద్ద మోడల్ కు 3gb ర్యామ్, రెండవ దానికి 2gb ర్యామ్ ఉన్నాయి, కాని మిగిలిన విషయాలలో స్పెసిఫికేషన్స్ weak.
Acer లిక్విడ్ Z630S
లుక్స్ వైస్ గా mi 4i, meizu ఆసుస్ జెన్ ఫోన్ కన్నా అద్భుతంగా లేదు, కాని Unique గా ఉంటుంది మెటల్ ఫినిషింగ్ వలన. కాని రిమేనింగ్ బాడీ అంతా cheap ప్లాస్టిక్.
5.5 in డిస్ప్లే 720P తో వస్తుంది. ఆ స్క్రీన్ సైజ్ కు 720P బాగా తక్కువ. బెటర్ ఉన్నాయి దీని కన్నా. అలానే ఫోన్ ఓవర్ ఆల్ సైజ్ కూడా పెద్దది. టచ్ రెస్పాన్స్ కూడా బాలేదు కాంపిటిషన్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే.
Acer లిక్విడ్ Z530
విచిత్రంగా పై ఫోన్ కన్నా ఇది కొంచెం బాగా బిల్ట్ అయ్యింది. sturdy అండ్ స్ట్రాంగ్ గా ఉంది ప్లాస్టిక్ తో తయారు చేసి నప్పటికీ. లుక్స్ వైస్ గా కూడా దాని కన్నా ఇది బాగుంది.
2gb ర్యామ్, 8MP both సైడ్ కెమేరాస్, మీడియా టెక్ MT6735 క్వాడ్ కోర్ ప్రొసెసర్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్. ఇవి సేమ్ meizu m2 లో ఉన్నాయి. సో రెండూ ఒకేలా పెర్ఫరం అవుతాయి అని అనుకుంటున్నా.
Acer UI మాత్రం బాలేదు చూడటానికి వాడటానికి కూడా. bloatware ఎక్కువ, animations ఏమీ ఉండవు. అలానే ఫోన్ బేసిక్ మోడల్ లా అనిపిస్తాది UI వలన. నిన్న అర్దరాత్రి నుండి ఫ్లిప్ కార్ట్ లో సెల్ అవుతున్నాయి రెండు మోడల్స్.