HTC బ్రాండ్ లో అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ మోడల్ వస్తుంది. ఈ సారి కంపెని పేరులో M ను తీసివేసి కేవలం HTC 10 అనే పేరుతోనే ఫోన్ ను లాంచ్ చేసే ప్రయత్నాలు చేస్తుంది.
దాదాపు ఫోన్ లో ఏమి ఉండనున్నాయని అనే విషయాలు అన్నీ లీక్ అయిపోయాయి. సామ్సంగ్ S7, Xiaomi Mi 5 వంటి ఫ్లాగ్ షిప్ మోడల్స్ ను మించే విధంగా కంపెని 10 ను లాంచ్ చేయనుంది రేపు..
దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటో ఇక్కడ చూద్దాం రండి..
LCD 5 : 5.15 in LCD 5 డిస్ప్లే 2560×1440 పిక్సెల్ రిసల్యుషణ్ తో రానుంది. దీనిలో అమోలేడ్ ఉంటుంది అని కూడా అంచనా.
స్నాప్ డ్రాగన్: దీనిలో క్వాల్ కామ్ లేటెస్ట్ ప్రొసెసర్ స్నాప్ డ్రాగన్ 820 ఉంటుంది అని రిపోర్ట్స్. ప్రివియస్ ఫ్లాగ్ షిప్ మోడల్ HTC one M9 ప్లస్ లో కంపెని మీడియా టెక్ SoC ను తీసుకోవటం జరిగింది. దాదాపు అన్నీ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ ఫోనులను SD 820 తోనే విడుదల చేస్తున్నాయి. అలాగే HTC 10 మోడల్ కు lite వేరియంట్ ను SD 652 SoC తో రిలీజ్ చేయనుంది అని అంచనా.
వరల్డ్ క్లాస్ కెమెరా: కంపెని రీసెంట్ గా కెమెరా గురించి ప్రోమోట్ చేస్తూ రెండు వైపులా వరల్డ్ లోనే మొదటి ఫర్స్ట్ క్లాస్ కెమెరా HTC 10 లో ఉంటుంది అని తెలిపింది. రూమర్స్ ప్రకారం 12MP రేర్ డ్యూయల్ tone ఫ్లాష్ కెమెరా, OIS, 4K రికార్డింగ్ అండ్ లేసర్ assisted ఫోకస్ ఉండనున్నాయి. అలాగే ఫ్రంట్ లో 5MP కెమెరా.
https://twitter.com/htc/status/717743733739954176
బెటర్ బూమ్ సౌండ్: ఇంత వరకూ వచ్చిన వాటి అన్నిటికన్నా దీనిలో బెస్ట్ బూమ్ సౌండ్ స్పీకర్స్ ఉండనున్నాయని కూడా అంటుంది. దీనిపై కూడా కంపెని ప్రోమోట్ చేసింది.
https://twitter.com/htc/status/717019520913682433
డిజైన్: పాతది కాని మార్పులు చేసింది. సాధారణంగా htc ఫ్లాగ్ షిప్ ఫోనుల్లో డిజైన్ బాగుంటుంది. లీక్ అయిన htc 10 ఇమేజెస్ చూస్తె ఫోన్ మరింత మార్పులను చేసుకొని వస్తున్నట్లు స్పష్టం అవుతుంది.