10,000 బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం సజెషన్.. ఇక్కడ కేవలం సింపుల్ గా మేజర్ మైనస్ లు చెప్పటం జరిగింది. సో అవి మీకు ఇబ్బంది కాకపోతే వాటిని తీసుకోండి. లేదంటే వేరే మొబైల్స్ ను కన్సిడర్ చేయగలరు.
Meizu M2 నోట్ – దీనిలో ఉన్న ఒకే ఒక్క మైనస్ రెండు సిమ్స్ అండ్ sd కార్డ్ సపోర్ట్ ఒకేసారి వాడటానికి అవ్వదు. ఎదో ఒక సౌలభ్యం మాత్రమే ఉంది. ఈ లింక్ లో meizu m2 నోట్ రివ్యూ చదవండి.
అంటే ఒక సిమ్ ట్రే లోనే sd కార్డ్ ఆప్షన్ సెకెండ్ సిమ్ ఆఫ్షన్ ఇచ్చింది కంపెని. మిగిలినవన్నీ బెస్ట్ దీనిలో. చాలా మంది os బాలేదు అంటున్నారు. వచ్చే నెలలో కంపెని అప్ డేట్ ఇస్తుంది. వెర్షన్ 5 రిలీజ్ చేస్తుంది.
Asus జెన్ ఫోన్ 2 లేసర్ – దీనిలో మైనస్ అంటూ ఏమీ లేదు. బడ్జెట్ కు తగ్గ అవుట్ పుట్ ను ఇస్తుంది. కాని లేసర్ ఉంది అంటూ ప్రోమోట్ చేసి 13MP కెమెరా తో వచ్చిన ఈ ఫోన్ లో కెమెరా మాత్రం బాలేదు. noise ఎక్కువ ఉంది ఫోటోస్ లో. ఎప్పుడు మంచి ఫోటోస్ తీస్తుందో చెప్పటం కష్టం. ఆసుస్ జెన్ UI అప్ డేట్స్ మాత్రం నెలకు రెండు వస్తాయి. కాని ఇంతవరకు అవి కెమెరా ను మెరుగ పరచలేదు. జెన్ ఫోన్ లేసర్ కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చదవండి.
లెనోవో K3 నోట్ – అన్నీ బాగున్నాయి కాని బోరింగ్ ఫోన్ డిజైన్, పై రెండు ఫోనులతో పోలిస్తే, ,దిని బిల్డ్ క్వాలిటీ అంత బాలేదు. ఆలాగే ఆసుస్ జెన్ UI తో కంపేర్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ UI ఆప్షన్స్ లో లెనోవో వైబ్ UI డౌన్ అని చెప్పాలి. లెనోవో K౩ నోట్ మిగలిన ఫోన్స్ తో కంపేర్ చేస్తే హీటింగ్ కూడా ఎక్కువుగా ఉంది.
Honor 4X – దీనిని చాలా మంది కన్సిడర్ చేయరు.. కారణం హానర్ కంపెని పెద్దగా మార్కెటింగ్ చేయదు. కాని బెస్ట్ కంటెంట్ ఇస్తుంది ఫోన్ లో. అన్నీ బాగున్నాయి కాని 8gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది దీనిలో. అలాగే ప్రైస్ కూడా 10 వేల కన్నా తక్కువ ఉంటే కన్సిడర్ చేసేవారు users.
యురేకా ప్లస్ – బోరింగ్ డిజైన్, కాని బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండర్ 10K ఫోన్స్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ ఇది. అన్నిటి కన్నా టాప్. కాని కొంచెం హిటింగ్ ఉంది. దిని కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడండి.