కొన్ని కంప్యూటర్స్ తో పనిచేసే వాతావరణం(ఆఫీస్) లో హాకింగ్ జరిగితే అక్కడ ఉండే ప్రింటర్స్ ను ఎవరూ అనుమానించారు. కాని రీసర్చ్ లు ప్రకారం 60% కంపెనీలలో డేటా హాక్ అవ్వటానికి కారణం ప్రింటర్స్ అని తెలిసింది. ఇలా జరిగే cyberattack లను సాల్వ్ చేయటానికి దాదాపు 46 రోజులు అవుతుంది. ప్రింట్ సెక్యురిటీ కూడా ఉండాలి కంపెనీలలో.
మీరు ఒకటి కన్నా ఎక్కువ కంపూటర్స్ అవసరం ఉన్న బిజినెస్ లు చేస్తున్నారా? అవి చిన్నవైనా పెద్దవైనా ప్రింటర్ తో సెక్యూరిటీ రిస్క్స్ పై ఈ 5 విషయాలను గుర్తుకుపెట్టుకోండి…
రాజీ పడిన నెట్ వర్క్:
ఒక నెట్ వర్క్(ఇంటర్నెట్ కనెక్షన్) పై ఉన్న ప్రతీ డివైజ్ కు సొంతంగా కొత్త access point ను క్రియేట్ చేయగలిగే సత్తా ఉంటుంది, firewall ఉన్నప్పటికీ. ఈ కొత్తగా క్రియేట్ చేసిన APN మొత్తం నెట్ వర్క్ కు పెట్టగలము. ఇలాంటి పరిస్థితుల్లో ప్రింటర్స్ ను ఓవర్ లుక్ లో వదలకుండా పరిశీలించాలి, లేదంటే ఆ access point ద్వారా ఆఫీస్ నెట్ వర్క్ లోకి ప్రవేశించి హాకర్స్ ఆఫీస్ డేటా ను హరించగలరు.
సెక్యూరిటీ లేని ప్రింటర్ ను హాకర్ చేతిలోకి తీసుకుంటే:
unsecure గా ఉండే ప్రింటర్స్ ను హాకర్స్ గుప్పిట్లోకి తీసుకుంటే random ప్రింటింగ్స్, foreign faxes ట్రాన్స్మిషన్ వంటి చాలా అటాక్స్ కు దారి తీస్తుంది.
Data హరించటం:
ఎన్క్రిప్షన్ చేయని ప్రింట్ డేటా ను కనుక వాడుతున్నట్లయితే హాకర్ కు క్లియర్ గా కనిపిస్తుంది డేటా అంతా. ఇక వాళ్ళకి పని సులభంగా ఉంటుంది డేటా ను హరించటానికి.
పూర్తిగా ప్రింట్ చేయని పనులు:
చాలా సార్లు ప్రింట్ ఇచ్చినా, అవి ప్రింట్ అవ్వకపోతే, వాటిని ప్రింటర్ డాక్యుమెంట్ ట్రే లో అలా వదిలేయటం జరుగుతుంది కొన్ని రోజులు పాటు. ఇలా వదిలేసిన వాటిలో కంపెని/బిజినెస్ కు సంబంధించిన ఇంపార్టెంట్ డాకుమెంట్స్ ఉంటాయి. ఇవి కూడా హాకర్స్ చేతిలోకి వెళ్ళినట్లే.
మొబైల్ డివైజ్ లకు access ఇస్తే మరింత జటిలం అవుతుంది పరిస్థితి:
నెట్ వర్క్ కు కనెక్ట్ అయ్యే వాటిలో మొబైల్స్ కూడా ఉండటం సహజం. సో ఇలాంటి పరిస్థితిలలో నెట్వర్క్ ప్రమాణాలు మరియు secure access points ను ఇవ్వటం కష్టంతరంగా ఉంటుంది ప్రింటర్ కు. ఒకవేళ ప్రింటర్ secure నెట్ వర్క్ పైన ఉన్నా, మొబైల్ లో సెక్యూరిటీ రాజీ పడినప్పుడు హాకర్ కు back-door నుండి హాక్ చేయటానికి సులభంగా అవుతుంది.
ప్రింటర్ ద్వారా ఎదురయ్యే దాడులను(హాకర్స్ ద్వారా) క్రింద ఇమేజ్ రూపంలో అందించటం జరిగింది. చూడగలరు:
ఇప్పుడు ప్రింట్ సెక్యూరిటీ ను ఎలా పెంపొందించుకోవాలి:
పైన పేర్కొన్న threats (ముప్పు) నుండి సేఫ్ గా ఉండాలంటే 360 కోణం పద్దతిలో సెక్యూరిటీ నుఏర్పరచుకోవాలి. ఇలా ఉంటే ఎక్కడా లూప్ holes లేకుండా ఉండగలరు. అలాగే హాకింగ్ బారిన పడకుండా ఉండేందుకు కొని గైడ్లైన్స్ ఉన్నాయి, వాటిని చూడగలరు క్రింద..
మరింత సమాచారం కొరకు HP యొక్క ప్రింటింగ్ సోలుషన్స్ ను చదివి మీ బిజినెస్/ఆఫీస్ నెట్ వర్క్ లలో అవసరమైన సెక్యూరిటీ స్ట్రాటజీ ను పెంపొందించగలరు.