Windows 10 లాంచ్ – 190 దేశాలలో ఫ్రీ అప్ గ్రేడ్

Updated on 29-Jul-2015
HIGHLIGHTS

ఫైనల్ గా అఫిషియల్ విండోస్ 10 OS రిలీజ్ అయ్యింది

న్యూ డిల్లీ తో పాటు 13 సిటిలలో లాంచ్ ఈవెంట్ ద్వారా విండోస్ 10 కొత్త డెస్క్టాప్ pc os ఈ రోజు లాంచ్ అయ్యింది. ఇంతవరకూ రిలీజ్ చేసినవి ప్రివ్యూ బిల్డ్స్. అంటే టెస్టింగ్ purpose రిలీజ్ చేసిన వెర్షన్స్ అవి. ఇది పూర్తి బగ్ లెస్ ఎడిషన్. విండోస్ 10 ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి.. కంప్లీట్ information ఈ లింక్ లో తెలుసుకోండి.

మైక్రోసాఫ్ట్ ప్రొమోషన్ ప్రకారం విండోస్ 10 Edge బ్రౌజర్, Cortana, Photos, Xbox ప్రధాన అప్ గ్రేడ్ ఫిచర్స్ తో పాటు మోస్ట్ secure os గా లాంచ్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ నుండి ఇదే లాస్ట్ విండోస్ os అని కూడా చెప్తున్నారు మైక్రోసాఫ్ట్ team. దీనికే ఎప్పటికప్పుడు అప్ డెట్లు ఫ్యూచర్ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా ఇస్తుంటారు.

విండోస్ 10 కేవలం pc os గానే కాకుండా multiple స్మార్ట్ డివైజెస్ కు యూనివర్సల్ ప్లాట్ఫారం గా ఉండనుంది అని సత్య నాదెళ్ళ చెప్పటం జరిగింది. విండోస్ 10 హై లైట్ ఫీచర్ Contiuum తో ఫ్యూచర్ విండోస్ 10 ఫోనులను లార్జర్ డిస్ప్లే మరియు కీ బోర్డ్ bundle కు కనెక్ట్ చేస్తే అటోమేటిక గా pc గా convert చేయగలిగే అవకాశం ఉంది. 

విండోస్ 10 ఇచ్చిన ప్రెస్ నోట్ లోని కీ పాయింట్స్ …

1. cortana పర్సనల్ డిజిటల్ అసిస్టంట్ ఆ పనిచేస్తూ మీకు కావలసిన రైట్ info ను ఇస్తుంది.

2. Edge బ్రౌజర్ ఇప్పటి వరకూ ఉన్న ఇంటర్నెట్ explorer లా కాకుండా ఫాస్ట్ గా బ్రౌజింగ్, రీడింగ్ మరియు షేరింగ్ చేస్తుంది వెబ్ లో.

3. ఇంటిగ్రేటెడ్ Xbox యాప్ ఫ్రెండ్స్ తో పాటు కలసి గేమింగ్ ఆడుకోవటానికి ఇంప్రూవ్ చేయబడినది.

4. Continuum యాప్స్ మరియు విండోస్ 10 ఎక్ష్పిరియన్స్ ను టచ్ నుండి డెస్క్టాప్ మరియు డెస్క్టాప్ నుండి టచ్ కు beautiful గా మోడ్స్ ను మర్చి ఇస్తుంది.

5. ఫోటోస్, మ్యాప్స్, న్యూ మ్యూజిక్ యాప్ – Groove, మూవీస్ , టీవీ మరిన్ని ప్రోదక్టివిటీ బిల్డ్ in యాప్స్ గా రానున్నాయి.

6. మైక్రోసాఫ్ట్ companion యాప్ ఐ ఫోన్, ఆండ్రాయిడ్ మరియు విండోస్ ఫోనులను ఈజీగా విండోస్ 10 డివైజెస్ తో అనుసందిస్తుంది.

7. ఇక రెగ్యులర్ విండోస్ ఆఫీస్ యాప్స్ అన్ని కొత్త ఆప్షన్స్ తో ఇంప్రూవ్ చేయబడ్డాయి.

 

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Connect On :