Windows 10 ను Free గా ఇలా ఇంస్టాల్ చేసుకోండి : కొత్త అప్ డేటేడ్ మెథడ్

Windows 10 ను Free గా ఇలా ఇంస్టాల్ చేసుకోండి : కొత్త అప్ డేటేడ్ మెథడ్
HIGHLIGHTS

Genuine Non-genuine యూజర్స్ అందరికీ ఫ్రీ

నిన్న windows 10 రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో మైక్రోసాఫ్ట్ 10 os ను అందరికీ ఫ్రీ గా ఇస్తుంది అని చెప్పింది. అయితే వెంటనే ఒక నెల తరువాత కేవలం జెన్యూన్ windows 7 మరియు 8.1 వెర్షన్ వాడుతున్న వారికే విండోస్ 10 వాడటానికి అవుతుంది అని చెప్పింది. మైక్రోసాఫ్ట్ మళ్ళీ ఆ మాటను వెనక్కు తీసుకొని అందరికీ విండోస్ 10 ను అందుబాటులోకి తెస్తుంది. జెన్యూన్ os వాడే వారు అయినా, నాన్ జెన్యూన్ విండోస్ యూజర్స్ అయిన ఎవరికైనా విండోస్ 10 ఫ్రీ గా లభిస్తుంది ఇప్పుడు.

Windows 10 వాడటానికి కావలసినవి మినిమమ్ Requirements :
Processor : 1GHz లేదా వేగంగా ఉండే ప్రాసెసర్ లేదా SoC
RAM: 1GB – 32 బిట్ OS కు లేదా 2GB – 64 బిట్ OS కు
Hard disk Space: 32 బిట్ OS కోసం 16GB స్పేస్ కావాలి, 64 బిట్ OS కు 20GB 
Graphics card : DirectX 9 మినిమమ్  
Display : 800×600

అసలు 10 కు ఇప్పటికిప్పుడు ఇంస్టాల్ చేసుకునే అంత worth ఉందా..?

1. స్టార్ట్ మెను మెను విండో resize వంటి customisation తో తిరిగి వస్తుంది (విండోస్ 8 లో లేదు). స్టార్ మెను పక్కనే live tiles కూడా అటాచ్ అయ్యి ఉన్నాయి.
2. కొత్త సెక్యురిటీ ఫీచర్స్..microsoft Hello(facial రికాగ్నిషణ్). పాస్వర్డ్ టైపింగ్ అవసరం లేదు. మైక్రోసాఫ్ట్ పాస్ పోర్ట్ సాఫ్ట్ వేర్ ద్వారా వెబ్సైటు లేదా యాప్ లోకి సెక్యూర్ sign in ఆప్షన్ మరియు Device Guard సాఫ్ట్వేర్ ద్వారా malware ప్రొటెక్షన్.
3. Live ట్రాఫిక్, weather etc వంటి విషయాలను తెలియజేయటానికి మరియు ఇతర అసిస్టేన్స్ కోసం Cortana సాఫ్ట్వేర్ టాస్క్ బార్ పైనే ఉంటుంది.
4. Microsoft Edge internet బ్రౌజర్ నిజంగా చాలా ఫాస్ట్ గా ఉంది. ఇతర షేరింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
5. టాబ్లెట్ మోడ్ కావాలంటే వాడగలరు డెస్క్ టాప్ లో కూడా. అంటే టచ్ ఇంటర్ఫేస్ కోసం ఇది. కాని టచ్ సపోర్ట్ ఉండాలి.
6. అన్నిటికి మించి ఇది ఫ్రీ గా వస్తున్న కొత్త os వెర్షన్. అయితే సంవత్సరం తరువాత ఇదే ఫ్రీ వెర్షన్ ను కొనకపోతే రెగ్యులర్ పైరేటెడ్ వెర్షన్స్ కు వచ్చే వార్నింగ్ లు వస్తాయి.

10 OS ను రెండు విధాలుగా డౌన్లోడ్ చేయగలం..
1. OS ను డైరెక్ట్ కు ISO ఇమేజ్ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకొని dvd ద్వారా write చేసుకొని సెట్ అప్ చేసుకోగలరు. 
2. రెండవది మెథడ్ Upgrade(windows 7 సర్విస్ ప్యాక్ 1 మరియు విండోస్ 8.1 యూజర్స్ కు మాత్రమే) చేసుకోవటం. 

1. రెగ్యులర్ ISO ఫైల్ dvd writing(Formatting) ద్వారా విండోస్ 10..

విండోస్ అఫిషియల్ గా 10 os ను ఇంస్టాల్ చేసుకోవటానికి లింక్ ఇస్తుంది. ఈ లింక్ లోకి వెళ్లి మీ Edition మరియు భాష ను సెలెక్ట్ చేసుకొని మీ కంప్యూటర్ architechture ను(32/64BIT) బట్టి 3.8 GB ఉండే iso విండోస్ 10 os ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కంప్యూటర్ 32 లేదా 64 తెలుసుకోవటానికి  My Computer పై రైట్ క్లిక్ చేసి Properties పై క్లిక్ చేసి తెలుసుకోగలరు. అలాగే అక్కడే మీరు వాడుతున్న విండోస్ వెర్షన్ కూడా తెలుసుకోగలరు.
dvd లో burn చేసి డ్రైవ్ లో పెట్టి reboot చేసి ఇక రెగ్యులర్ ఓల్డ్ మెథడ్ లో విండోస్ 10 ను మీ సిస్టం లో ఇంస్టాల్ చేసుకోవచ్చు. అయితే మీరు ఏ డ్రైవ్ లో os ను ఇంస్టాల్ చేస్తున్నారో చూసుకోండి లేదంటే ఫైల్స్ అన్నీ పోతాయి. మీకు ఏలా చేయాలి అనేది అక్కడ విండోస్ స్టెప్ బై స్టెప్ instructions ఇస్తుంది.

2. అప్ డేట్ ద్వారా ఫార్మాట్ చేసే అవసరం లేకుండా..

ఈ మెథడ్ Reddit ఫోరం లో ventureBeat ద్వారా మొదటిగా వెలుగులోకి వచ్చింది.
1. ముందుగా విండోస్ 7 సర్వీస్ ప్యాక్ (డెస్క్టాప్ లేదా స్టార్ట్ మెను లో ఉండే My Computer పై రైట్ క్లిక్ చేసి Properties లోకి వెళ్లి మీరు ప్రెసెంట్ వాడుతున్న విండోస్ వెర్షన్ తెలుసుకోగలరు) లేదా విండోస్ 8.1 యూజర్స్ కు మాత్రమే ఈ అప్ డేట్ పనిచేస్తుంది.

2. windows update ఓపెన్ చేయండి.(స్టార్ట్ మెను లో సర్చ్ చేసైనా వెళ్ళచ్చు లేదా డైరెక్ట్ గా control panel లోకి వెళ్లి ఓపెన్ చేయగలరు). అక్కడ అప్డేట్ ను చెక్ చేస్తే మీకు విండోస్ 10 అప్ డేట్ కనిపిస్తుంది.

3. కనపడని వారు కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా కూడా అప్ డేట్ చేసుకోవచ్చు…

4. మీ కంప్యూటర్ లో "C:\Windows\SoftwareDistribution\Download" ఫోల్డర్ లోకి వెల్లి ఆ ఫోల్డర్ లో ఉన్న అన్ని ఫైల్స్ ను డిలిట్ చేయండి(ఫర్వాలేదు ఆ ఫైల్స్ వలన ఉపయోగం ఉండదు, చేయండి). మీ సిస్టం లో os c డ్రైవ్ లో ఇంస్టాల్ అవ్వకపోతే "C" దగ్గర మీ డ్రైవ్ లెటర్ ను replace చేయండి.

5. ఇప్పుడు మళ్ళీ windows update లోకి వెళ్లండి.

6. విండోస్ సర్చ్ బార్ లో cmd అని టైప్ చేయండి. డ్రాప్ డౌన్ లో వచ్చే command prompt పై రైట్ క్లిక్ చేసి "Run as administrator" ఆప్షన్ చూస్ చేయండి.

7. కమాండ్ బాక్స్ లో "wuauclt.exe/updatenow" అని టైప్ చేయండి. Enter ప్రెస్ చేయవద్దు.

8. ఇప్పుడు ఇంతకముందు ఓపెన్ చేసిన windows update విండో లోకి వెళ్లి Check for updates పై క్లిక్ చేయండి. అది "Checking for updates" అని చూపిస్తుంది.

9. ఇప్పుడు మళ్ళీ cmd prompt విండో లోకి వెళ్లి కీ బోర్డ్ మీద Enter ప్రెస్ చేయండి. ఇప్పుడు విండోస్ 10 (6gb సైజ్) డౌన్లోడ్ అవుతుంది.

Windows 10 మరింత సమాచారం ఇక్కడ ఈ లింక్ లో తెలుసుకోగలరు

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo