VLC ప్లేయర్ బాగా వాడుతారా? అయితే ఎవ్వరికీ తెలియని ఈ టిప్ మీకు బాగా నచ్చుతుంది

VLC ప్లేయర్ బాగా వాడుతారా? అయితే ఎవ్వరికీ తెలియని ఈ టిప్ మీకు బాగా నచ్చుతుంది

మీరు ఇంగ్లీష్ సినిమాలను ఎక్కువుగా చూసే హాలీవుడ్ ఫాన్స్ అయితే subtitles గురించి అందరికన్నా కొంచెం ఎక్కువుగా పరిచయం ఉండి ఉంటుంది.

కంప్యూటర్/లాప్ టాప్  లో ఏ వీడియో లేదా సినిమా చూడాలన్నా care of address, VLC  ప్లేయర్. అయితే కొన్ని సినిమాలకు subtitles దొరికినా ఆడియో dailogues కు subtitle కు సరైన అనుసంధానం లేక రెండూ ఒకే సారి రావు.

కానీ చాలా మంది ఉన్న srt ఫైల్ ను వదిలేసి, పెర్ఫెక్ట్ sync అయ్యే సబ్ టైటిల్ ఫైల్ గురించి చాలా కష్ట పడి వెతుకుతుంటారు. ఇక నుండి మీరు వేరే వాటి కోసం వెతకనవసరం లేదు. 

ఒక సారి సినిమా అండ్ subtitle రెండూ ప్లేయర్ లో లోడ్ అయిన తరువాత, మొదటి ఆడియో డైలాగు వచ్చినప్పుడు కీ బోర్డు పై shift+h ప్రెస్ చేయండి, ఇప్పుడు అదే ఆడియో డైలాగు subtitle రూపంలో ఎప్పుడు వచ్చిందో అప్పుడు మరలా shift+J ప్రెస్ చేయండి.

ఇక వెంటనే shift+K ప్రెస్ చేయాలి. అంతే! ఎంత non sync లో ఉన్నప్పటికీ ఈ మూడు combinations బటన్స్ perfect గా వీడియో – ఆడియో తో  sync చేస్తాయి subtitles ను.

అయితే అప్పుడపుడు ఆడియో డైలాగు కన్నా subtitle ముందు వస్తుంది. సో అలాంటప్పుడు ముందు shift + J ప్రెస్ చేయాలి, తరువాత ఆడియో డైలాగు వచ్చినప్పుడు shift + h ప్రెస్ చేసి ఫైనల్ గా sync చేయటానికి shift + k ను ప్రెస్ చేయాలి.

అడిషనల్ ఇన్ఫర్మేషన్ : సినిమా ఏదైనా subtitles కావాలంటే బెస్ట్ వెబ్ సైట్ opensubtitles.org

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo